twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    “I”య్ బాబోయ్... ( విక్రమ్ ‘ఐ’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    సాధారణంగా శంకర్ సినిమాలంటే ఓ విధమైన ఎక్సపెక్టేషన్స్ ఉంటూ వస్తున్నాయి. సామాజిక సందేశాన్ని కమర్షియల్ విలువలతో తెరకెక్కిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రతీసారి ఏం సామాజిక అంశాలు ఎత్తుకుంటాం...ఈసారి లవ్ స్టోరీ తో వద్దాం... బాహ్య సౌందర్యం కన్నా అంతర్‌సౌందర్యం గొప్పదని చెప్దామనుకున్నారు. ఆ ఐడియాతో ‘ఐ' ని దింపారు. అయితే సినిమాలో విక్రమ్ ...సౌందర్య హీనమైన గెటప్ తో మొదట నుంచీ చివరి వరకూ విరక్తి కలిగించాడనే చెప్పాలి. అతని కష్టం...ఎంత పడ్డారో..ఆ గెటప్ లో అతన్ని దాదాపు గంటపైనే చూడటానికి ప్రేక్షకులూ అంత కన్నా ఎక్కువ కష్టమే పడాల్సి వచ్చింది.

    దానికి తోడు...పక్కా రివేంజ్ కథ కావటం... ఆ రివేంజ్ కథని అయినా సరిగ్గా తీర్చిదిద్దారా అంటే... హీరో పాత్ర కు ప్రీ క్లైమాక్స్ దాకా విలన్ ఎవరో తెలయక(ప్రేక్షకులకు స్పష్టంగా అప్పటికే తెలుసు) అతన్ని ఎదుర్కునే సీన్స్ లేక ప్యాసివ్ గా మారి ఇబ్బంది పెట్టింది. దాంతో ఇంత భారిగా అత్యున్నత సాంకేతిక విలువలతో తీసిన చిత్రం అంతే భారీ ఎక్సపెక్టేషన్స్ కలిగించింది..అదే స్ధాయిలో నిరాశపరిచింది. అయితే విక్రమ్ గెటప్స్, టెక్నికల్ స్టాండర్ట్స్ మాత్రం ఇండియన్ సినిమాను మరో మెట్టుకు తీసుకు వెళ్ళేవే. వాటి కోసమే సినిమాలు తీస్తే ఇలాగే ఉంటుంది.

    పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

    లింగేష్(విక్రమ్) ఆర్నాల్డ్ జిమ్ లో ఔత్సాహిక బాడీ బిల్డర్. అతని జీవితాశయం మిస్టర్ ఇండియా అవ్వాలని. ఈ లోగా మిస్టర్ ఆధ్రప్రదేశ్ అవుతాడు. అయితే ఆ గెలుపు నుంచే అతనికి శతృవులు మొదలవుతారు. మరో ప్రక్క అతను ...దియా(అమీ జాక్సన్) అనే మోడల్ ని ఆరాధిస్తూంటాడు. ఆమెకు తన తోటి మోడల్ జాన్(ఉపేన్ పటేల్) నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతాయి. వాటినుంచి తప్పించుకుని తన కెరీర్ ని నిలబెట్టుకోవటం కోసం లిగేష్ ని మోడల్ గా ప్రమోట్ చేసి వాడుకోవాలనుకుంటుంది. అయితే ఆమె లింగేష్ తో ప్రేమలో పడుతుంది. అంతేకాకుండా ఆ పెయిర్ మోడలింగ్ ఫీల్డ్ లో హాట్ గా మారతారు. దాంతో ఆమె ఫ్రొఫిషనల్ వైపు నుంచి లింగేష్ కు శతృవులు ప్రారంభమవుతారు. ఈ లోగా ఊహించని విధంగా ..లింగేష్ ..ఓ అంతుపట్టని వ్యాధి వచ్చి కురూపిలా(ట్రైలర్ లో చూపినట్లు బొబ్బలతో) మారిపోవటం మొదలవుతాడు. ఇంతకీ లింగేష్ అలా మారటానికి కారణం ఏమిటి... దాని వెనక ఉన్న కుట్రను లింగేష్ ఎలా ఛేధించాడు..లింగేష్...దియా ల ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ.

    'బ్యూటీ అండ్ ది బీష్ట్' ని గుర్తు చేసే ఈ చిత్రం పూర్తిగా ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాకే పక్కా పగ-ప్రతీకారం మార్క్ సినిమా. ప్రారంభమే కురూపిగా హీరోని ఓపెన్ చేసి..అతను ఎలా ఎందుకు అయ్యాడు అనే విషయం రివిల్ చేయటం వరకూ స్క్రీన్ ప్లే టెక్నిక్(పాతదే అయినా) బాగుంది. అయితే ఆ ప్లాష్ బ్యాక్... సినిమా మొత్తం ఆక్రమించేసింది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయితే కదా.. ప్రెజంట్ లోకి వచ్చి... ఆ ప్లాష్ బ్యాక్ తాలూకూ నీడలను, నిజాలను కనుక్కుని ప్రతీకారం తీర్చుకునేది. అలా కాకుండా ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ నే సాగతీస్తూ... చెప్తూ పోతే అసలు కథ ఎప్పుడు వింటాం...గతాన్నే పట్టుకుని ఎంత సేపు వేళ్లాడతాం...

    అలా అనుకుంటే ...శంకర్ గత హిట్ చిత్రాలు చక్కడా టీవీలో చూసుకోకుండా కొత్త చిత్రం చూద్దామనే థియోటర్ కి ఎందుకు వెళతాం..గతం ఎంత గొప్పదయినా...ఇప్పుడు ఏం జరుగుతుందనే దానికే కదా ప్రయారిటీ. ఎందుకనో అంత పెద్ద దర్శకుడూ ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయారు. దాంతో హీరో కి లాగానే ..కథకి జబ్బు చేసింది. హీరో కి మెయిన్ విలన్ ఎవరో తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తే...ఇంక పగ ఎలా తీర్చుకుంటాడు అనేదానికు స్క్రీన్ టైమ్ ఎక్కడుంది. పోనీ ఆ మెయిన్ విలన్ ఎవరనేది తెలుసుకోవటం పెద్ద ట్విస్టా అంటే ...థియోటర్ లో కూర్చున్న చిన్న పిల్లాడు సైతం కనిపెట్టేస్తాడు. అంత వీక్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కేవలం సాంకేతికంగా, విజువల్ గా వండర్ గా తీర్చిదిద్దాలనే తపన తప్పించి మిగతా విషయాలపై ఆయన దృష్టి పెట్టలేదు.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    పెద్ద నిరాశ

    పెద్ద నిరాశ

    సినిమాలో బీస్ట్ (తోడేలు) గెటప్ ...ప్రారంభం నుంచీ హైలెట్ చేస్తూ వస్తున్నారు. అయితే సినిమాలో కేవలం అది ఓ పాటకు మాత్రమే పరిమితం చేసారు. దాంతో ఎక్సపెక్టేషన్స్ ను పూర్తిగా దెబ్బకొట్టినట్లైంది.

    విక్రమ్ సినిమా

    విక్రమ్ సినిమా

    నిజానికి ఇది శంకర్ సినిమా అని చెప్పకూడదు...ఎందుకంటే ఇది పూర్తిగా విక్రమ్ తన శరీరాన్ని రకరకాల శ్రమలకు గురి చేసి అందించిన చిత్రం. రకరకాల గెపట్స్ కు అణుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా జిమ్ లో బాడీ బిల్డర్ గా హైలెట్. కురూపిగా గెటప్ బాగుంది కానీ ఎక్కువ సేపు ఉంచకుండా ఉండాల్సింది.

    గ్లామర్ మోత

    గ్లామర్ మోత

    సినిమాలో హీరోయిన్ గా చేసిన అమీ జాక్సన్... గ్లామర్ ని విచ్చలవిడిగా చూపటానికి ఆమె టాప్ మోడల్ క్యారక్టరేషన్ అవకాసమిచ్చింది. దాంతో ఆమె ఎప్పటిలాగానే నటనమీద కన్నా గ్లామర్ గుప్పించటం మీదే దృష్టి పెట్టింది.

    గే గోల తప్పలేదు

    గే గోల తప్పలేదు

    ఈ సినిమాలోనూ తెలుగు సినిమాల్లో వస్తున్నట్లు గే గోల తప్పలేదు. ఒరిజనల్ స్టైలిస్ట్, గే అయిన ఓజస్ రజనీ చేసిన గే రోల్ చాలా చాలా చిరాకు తెప్పించింది.

    కామెడీ...

    కామెడీ...

    సినిమాలో ఎంటర్టైన్మెంట్ (అనగా ఇక్కడ కామెడీ అని అర్దం)బాగా తక్కువ అనే చెప్పాలి. సంతానం వంటి కమిడియన్ ని ఫుల్ లెంగ్త్ రోల్ కు వాడారు కానీ అతనిచేత కామెడీ మాత్రం చాలా తక్కువ చేయించారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    శంకర్ సినిమాలు తొలి నాటి నుంచి టెక్నికల్ గా ఉన్నతంగా ఉంటూ వస్తున్నాయి. ఆయన స్టాండర్డ్స్ ని ఆయనే బ్రేక్ చేసుకుంటూ కొత్త స్దాండర్డ్స్ స్దాపిస్తూ వస్తున్నారు. ఇప్పుడూ అదే జరిగింది. సినిమా టెక్నికల్ గా ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఉంది.

    పాటలు

    పాటలు

    తమిళంలో మాట ఏమో కానీ తెలుగు లో మాత్రం ఆడియో పెద్దగా క్లిక్ అవలేదు. సినిమా రిలీజయ్యాకు ఎ ఆర్ రహమాన్ పాటలు ప్రతీసారి పుంజుకుంటున్నాయి. ఈ సారి అది కనిపించటం లేదు. అయితే ఆ పాటలకు సమకూర్చిన విజువల్స్ మాత్రం అద్బుతం అని చెప్పాలి.

    రొటీన్ సమస్యే ఇక్కడా..

    రొటీన్ సమస్యే ఇక్కడా..

    ఈ మధ్య కాలంలో మన సినిమాలకు లెంగ్త్ పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సినిమా సైతం అదే దారిలో ప్రయాణం పెట్టుకుంది. నిడివి 3 గంటల 3 నిమిషాలు ఉంది. ఏమన్నా ట్రిమ్ చేస్తే కొద్ది లో కొద్ది బెస్ట్ ఏమో.

    9కెమెరా వర్క్

    9కెమెరా వర్క్

    చైనాలోని అందమైన లోకేషన్స్ ని, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించిన షాట్స్ ని అత్యంత అద్భుతంగా తెరపైకి తీసుకు వచ్చిన ఘనత పిసి శ్రీరాంకే చెందింది.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    సంస్ధ : ఆస్కార్‌ ఫిలింస్‌, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    నటీనటులు: విక్రమ్, అమీ జాక్సన్, సురేష్‌గోపి, ఉపేన్‌ పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు
    ఛాయగ్రహణం: పి.సి.శ్రీరామ్‌,
    సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌.
    మాటలు: శ్రీరామకృష్ణ
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్
    నిర్మాత: ఆస్కార్ రవి చంద్రన్
    విడుదల తేదీ: 14, 01,2015.

    ఏ అంచనాలు లేకుండా ఈ సినిమాకు వెళ్తే బాగుంటుందేమో కానీ టీజర్స్, హైప్ తో అంచనాలు మనల్ని ఎప్పుడో దాటేసాయి కదా. ఇండియన్ సినిమాలో ప్రపంచ స్ధాయి టెక్నికల్ విలువలు, విక్రమ్ గెటప్స్, అందమైన లొకేషన్స్ చూడాలంటే ఈ సినిమా ఓ ఆప్షన్. అలా కాకుండా సంక్రాంతి పండక్కి ఈ సినిమాతో పండగ చేసుకుందామంటే మాత్రం ఓ సారి ఆలోచించి అడుగువేయటం మంచింది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Vikram and Shankar's "I" has hit the screens today with divide talk. The movie, which is made with a huge budget, is the most awaited movie of 2015. So, there are a lot of expectations riding on the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X