twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటెంటు ఉంది కానీ...(జెండా పై కపిరాజు రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్: నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెండా పై కపిరాజు' చిత్రం సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతి అంశాన్ని బేస్ చేసుకుని సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    సినిమా స్టోరీ వివరాల్లోకి వెళితే...
    అరవింద్(నాని) ఐటి ప్రొఫెషనల్. నీతిగా, న్యాయంగా ఉంటూ రూల్స్ ప్రకారం నడుచుకునే వ్యక్తి. తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతి, లంచగొండి తనం అతన్ని అవినీతి వ్యతిరేక పోరాటం దిశగా నడిపిస్తుంది. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని నీతివంతులైన అధికారులను ఏకం చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుడతారు. 147 మంది ప్రభుత్వ అధికారుల అవినీతిని సాక్షాధారాలతో సహా నిరూపించి మీడియా ద్వారా బట్టయబలు చేస్తారు. కేసు కోర్టుకు వెలుతుంది. అయితే 147 మంది అవినీతి అధికారులు ఒక కమిటీగా ఏర్పడి తమపై ఉన్న కేసును నీరుగార్చేందుకు.... మాయా కన్నన్(మరొక పాత్ర పోషించిన నాని)ను రంగంలోకి దింపుతారు. ఈ పోరాటంలో అరవింద్ ఎలా విజయం సాధించాడు అనేది తర్వాతి థియేటర్లో చూడాల్సిందే.

    Jenda Pai Kapiraju Review

    పెర్ఫార్మెన్స్...
    సినిమాలోని హైలెట్స్‌లో చెప్పుకోదగ్గ మొదటి అంశం నాని పెర్ఫార్మెన్స్....ఇటు అరవింద్ పాత్రలో, అటు మాయా కన్నన్ పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గత సినిమాలతో పోలీస్తే పెర్ఫార్మెన్స్ పరంగా నాని మెచ్యూరిటీ కనబర్చాడు. హీరోయిన్ అమలా పాల్ తన పాత్రకు తగిన విధంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నాని ఫ్రెండు పాత్రలో వెన్నెల కిషోర్ మంచిపెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాగిణి ద్వివేది స్పెషల్ సాంగులో గ్లామర్ పరంగా ఫర్వాలేదనిపించింది. ఇతర పాత్ర ధారులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. సీబీఐ ఆఫీసర్ గా శరత్ కుమార్ గెస్ట్ రోల్ బావుంది.

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...
    దర్శకుడు సముద్రఖని ఎంచుకోవడమే పాత సబ్జెక్టు ఎంచుకున్నాడు. కనీసం ప్రజెంటేషన్ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. సినిమా చూసినంత సేపు గతంలో అవినీతి వ్యతిరేక సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఫస్టాఫ్ కాస్త ఫర్వాలేదనిపించి సెకండాఫ్‌లో ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెట్టాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి రేకెత్తించే విధంగా స్క్రీప్లే లేదు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలను మాత్రం మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. జి.వి.ప్రకాష్ అందించిన సంగీతం ఫర్వా లేదు. కెమెరామెన్ పని తనం బావుంది. సినిమా ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సి ఉంది.

    ‘జెండాపై కపిరాజు' సినిమాలో కంటెంటు ఉంది కానీ....దాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో నిరాశ పరిచే విధంగా ఉంది.

    English summary
    Jenda Pai Kapiraju has its bits and pieces of negatives and positives and it is still a watchable film with a great content and brilliant performances.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X