twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీం బీడి కట్టేం కాదూ.. (పూరి జగన్నాథ్‘ఇజం’రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    నల్లధనం వెలకితీత, అది పేజలకు పంచిపెట్టడం అనే కార్యక్రమం గురించి రెగ్యులర్ గా ఇంకా చెప్పాలంటే రొటీన్ గా మనం దాదాపు రోజూ టీవిల్లో చూస్తున్నాం, పేపర్లలో వింటున్నాం. ఎవరన్నా దొరికితే డిస్కస్ చేసేస్తూంటాం. మరీ ఉత్సాహం వస్తే ఫేస్ బుక్ లో పోస్ట్ లు కూడా పెట్టేసి, దేశభక్తిని ప్రూవ్ చేసుకునే పని పెట్టుకుంటాం.

    అలా మనం ఎప్పుడు ఆ నల్లధనం బయిటకు తెస్తాయా ఈ గవర్నమెంట్స్ , అసలు తెస్తాయా తేవా అని బెట్ లు కూడా కాసుకుంటూంటే.. , పూరి మాత్రం ఆ నల్లధనం కాన్సెప్టుతో ఓ సినిమా తీసేసి సొమ్ము చేసుకునే పోగ్రామ్ పెట్టుకున్నాడు.

    ఐడియావరకూ బాగానే ఉన్నా కానీ కథా విస్తరణ అసలు లేకపోవటంతో మరీ నాసిరకమైన స్క్రిప్టు తయారయ్యి కళ్యాణ్ రామ్ ధనాన్ని వృధా చేసే పని పెట్టుకున్నట్లు తయారైంది. స్క్రిప్టే బలంగా నమ్మి తెరకెక్కించే పూరి ఈ సారి కథని,స్క్రీన్ ప్లేని ఎంత లేజీగా తయారు చేసారో ఈ క్రింద కథ చదివితే మీకే అర్దం అవుతుంది.

    బ్యాంకాక్ లో మనోడు ఏం చేస్తూంటాడంటే..

    బ్యాంకాక్ లో మనోడు ఏం చేస్తూంటాడంటే..

    బ్యాంకాక్ లోని ఓ దీవిలో ఇల్లీగల్ స్ట్రీట్ ఫైట్స్ చేస్తూంటాడు కళ్యాణ్ రామ్(కళ్యాణ్ రామ్) . అక్కడికి వచ్చిన అలియా ఖాన్ (అదితి ఆర్య)ని చూసి లవ్ ఫస్ట్ సైట్ అంటూ ఆమె వెనకపడతాడు. ఆమె..మాఫియాసామ్రాజ్యాన్ని ఏలుతున్న జావేద్‌ ఇబ్రహీం (జగపతిబాబు) కూతురు.

    ఆ డాన్ , ఆయన కూతురు కాస్త వెరైటీ

    ఆ డాన్ , ఆయన కూతురు కాస్త వెరైటీ

    అదేంటి ప్రపంచాన్ని ఏలుతున్న అంత పెద్ద మాఫియా డాన్ కుమార్తె మన హీరో ( ఓ మామూలు పైటర్ కు) అంత ఈజీగా పరిచయం అవుతుందా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె వెనక పడటానికి బయిట దొరుకుతుందా అంటే...ఆమె అంతే... సెక్యూరిటీ గట్రా లేకుండా తిరుగుతూంటుంది.

    కరీం బీడి కట్ట ఇచ్చి..

    కరీం బీడి కట్ట ఇచ్చి..

    అంతెందుకు ఆ మాఫియా డాన్ ని కలవటమే చాలా చాలా ఈజీ. ఆయనకు కరీం బీడీకట్టలంటే ఉన్న బలహీనతతో ఆయన్ని కొడతాడు. భలే ఐడియా కదా. అంతేనా హీరోయిన్ కు పెళ్లి చూపులు అనగానే ఆ ఇంట్లోకి ఈజిగా జొరపడిబోతాడు. ఆ టైమ్ లో ఆ డాన్ గారు సెక్యూరిటీ నిద్రపోతోందా. ఇంతోటి డాన్ ని రా ఏజెంట్స్ కూడా ఏమీ చేయలేదు. ఆయన ఇంటికి కూడా వెల్లలేరు.

    ఇక్కడే ఓ ట్విస్టండోయ్

    ఇక్కడే ఓ ట్విస్టండోయ్

    ఈ లోగా హీరోయిన్ కు తను ప్రేమించే కల్యాణ్‌రామ్‌ అనేది అసలు పేరు కాదని, అతని పేరు సత్య మార్తాండ్‌ అని ఆమెకు తెలుస్తుంది. పోనీలే పేరులో ఏముంది పెన్నిది అని సరిపెట్టుకుందామనుకున్నా....అతనే తన తండ్రి పాలిటి విలన్ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది.

    ఇంతకీ ఏం సాధిద్దామని...

    ఇంతకీ ఏం సాధిద్దామని...

    ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనే విషయాలు మీకు తెలుసుకోవాలంటే... వెండితెర మీద చూడాల్సిందే. అంతగా మీరు వెండితెరదాకా వెళ్లలేం అనుకుంటే మీకో క్లూ..ఆ జావేద్ ఇబ్రహం గారికి ఓ ప్యారడైజ్ బ్యాంక్ అని ఉంటుంది. దాంట్లో ఆయన మన పొలిటీషన్స్ అందరి నల్లధనం దాగుటుంది. మిగతాదంతా సస్పెన్స్..మీరే చూడండి.

    ప్యాసివ్ హీరోతో ....

    ప్యాసివ్ హీరోతో ....

    నల్లధనం వంటి సీరియస్ సబ్జెక్టుని ఓ కాకమ్మ కథలా అల్లిబిల్లిగా అల్లేసి మన ముందుంచే ప్రయత్నం చేసారు పూరి. ఈ కథలో హీరో తెహల్కా వంటి వెబ్సైట్ నడుతూ స్కామ్ లు అన్నీ లీక్ చేస్తూండాడు. అంతపెద్ద స్కామ్ లు లీక్ చేసినా ఎక్కడా అతనికి ఎదురనేది ఉండదు. ఇంటిలిజెన్స్ వారు కూడా పట్టుకోలేని...దావూద్ ఇబ్రహం స్దాయి మాఫియా డాన్ ని కలవటం, అతని ఇంటికి వెల్లటం వంటివి చాలా ఈజీగా చేసేస్తూంటాడు. దాంతో హీరో క్యారక్టరైజేషన్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టేసింది.

    విలన్ ముసుగులో ఉన్న మంచోడులా

    విలన్ ముసుగులో ఉన్న మంచోడులా

    ఇందులో జగపతిబాబు క్యారక్టరైజేషన్ చూస్తూంటే నవ్వు వస్తుంది. ఓ టోపి పెట్టుకుని, బీడి కాల్చుకుంటూ ఉంటాడు. ఎక్కడా కరుకుతనం అనేది ఉండదు. అతను విలన్ ముసుగులో ఉన్న మంచివాడేమో అనే డౌట్ వస్తూంటుంది.

    హీరో లక్ష్యం ఇంతకీ ఏంటి

    హీరో లక్ష్యం ఇంతకీ ఏంటి

    సినిమా సగం అయ్యేసరికి విలన్ జగపతి బాబు నా లేక పోసానా లేక, మన పొలిటీషన్స్ అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మాఫియా డాన్ కు వ్యతిరేకంగా చేస్తున్ననంటూ అతను బ్లాక్ మనీ ని బయిటకు తెచ్చే పనిలో ఉంటాడు. హీరో లక్ష్యం..బ్లాక్ మనీ బయిటకు తేవటమా లేక మాఫియా డాన్ ని అంతమొందించటమా తేలదు. దాంతో కథ ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని స్దితి ఏర్పడింది.

    కరీం బీడికట్టకు బ్రాండ్ అంబాసిడర్ లాగ

    కరీం బీడికట్టకు బ్రాండ్ అంబాసిడర్ లాగ

    విలన్ ని మచ్చిక చేసుకోవటానికి అతని బలహీనత అయిన కరీం బీడి కట్టని అతని ఎదురుగా కాల్చి, అతనితో ప్రెండ్షిప్ చెయ్యవలను అనే కొత్త విషయం మనకు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఏదో అల్లరి నరేష్ సినిమాలో సీన్ లాగ ఉంటుంది కానీ ఎక్కడా సీరియస్ గా అనిపించదు.

    తప్పదా ఆ ప్లాష్ బ్యాక్

    తప్పదా ఆ ప్లాష్ బ్యాక్

    హీరోకు చిన్నప్పుడు అతని తండ్రి నెగిటివ్ క్యారక్టర్స్ చేతిలో దెబ్బ తినే ఫ్లాష్ బ్యాక్ ఉండాల్సిందేనా...తండ్రి దెబ్బతినటం చూసి అక్కడ నుంచి అతని మనస్సులో జర్నలిస్ట్ అయ్యి..దేశాన్ని ఉద్దరించాలనే ఆలోచన పుట్టడం కాస్త అతిగానే అనిపించింది.

    ఇంటర్వెల్ బ్యాంగ్ పేలలేదు

    ఇంటర్వెల్ బ్యాంగ్ పేలలేదు

    కల్యాణ్‌రామ్‌ ఓ జర్నలిస్ట్‌ అనే హింట్‌ ఇచ్చేసారు ప్రేక్షకులకు. దాన్ని ఇంటర్ వెల్‌ వరకూ దాచి పెట్టి.. దాన్నో బ్యాంగ్‌ అన్నట్టు చూపించడం బాగోలేదు. ఇంటర్వెల్ ఇవ్వాలి అన్నట్లుగా ఆ సీన్ అతికినట్లుగా అనిపించింది...షాకింగ్ రాలేదు.

    క్లైమాక్స్ లోనే కాస్తంత

    క్లైమాక్స్ లోనే కాస్తంత

    ఇజం సినిమాకో ప్రత్యేకత ఉంది. అది మొదటి నుంచీ చివరవరకూ ఏదోదో జరుగుతుంది. అయితే క్లైమాక్స్ లోనే ఒక్కసారిగా స్పీడు అందుకుంటుంది. కోర్టు సీన్‌తో తన ఉద్దేశం.. లక్ష్యాన్ని చాటి చెప్పాడు దర్శకుడు. ఈ కోర్టు సీన్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కోర్టు సీన్ లేకపోతే అసలు భరించలేం.

    కళ్యాణ్ రామ్ కొత్తగా

    కళ్యాణ్ రామ్ కొత్తగా

    ఈ సినిమా ఎలా ఉన్నా...హీరో కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, అతని పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం మాట్లాడుకునేలా ఉంది. కళ్యాణ్ రామ్ తన ముందు సినిమాల్లో కన్నా ఇందులో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు మునపటి కన్నా చాలా మెరగయ్యాయి.

    సాంగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి

    సాంగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి

    సాధారణంగా పూరి సినిమాల్లో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువ హిట్ ఆల్బమ్సే. అయితే ఎందుకనో ఈ సారి పూరి ఆ మ్యాజిక్ మిస్సయ్యారు. పాటలు రొట్టకొట్టుడుగా ఉన్నాయి ఒక్క పాట కూడా గుర్తు పెట్టుకునేలా లేదు. హమ్ చేసుకునేలా అంతకన్నా లేదు. పూరి పాడిన ఒక్కపాటే కాస్తంత బాగుంది.

    సాంకేతికంగా

    సాంకేతికంగా

    ఈ సినిమా ఎప్పటి పూరి సినిమా లాగే టెక్నికల్ గా సౌండ్ గా ఉంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ అద్బుతం అని చెప్పలేం కాని సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి కానీ పూరి గత సినిమాల స్దాయిలో లేవు.

    తెర వెనక, తెర ముందు

    తెర వెనక, తెర ముందు

    బ్యానర్: ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌
    నటీనటులు: నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదితరులు .
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    సినిమాటోగ్రఫీ: ముఖేష్‌,
    ఎడిటింగ్‌: జునైద్‌,
    పాటలు: భాస్కరభట్ల,
    ఫైట్స్‌: వెంకట్‌,
    ఆర్ట్‌: జానీ,
    కో-డైరెక్టర్‌: గురు,
    మేకప్‌ చీఫ్‌: బాషా,
    కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌,
    ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌,
    కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌,
    స్టిల్స్‌: ఆనంద్‌,
    మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌,
    క్యాషియర్‌: వంశీ,
    నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌,
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
    విడుదల తేదీ: 21-10-2016

    ఓ సెన్సేషనల్ ప్లాట్ ని ఎంత నీరసంగా ఎగ్జిక్యూట్ చెయ్యవచ్చో సోదోహరణంగా చెప్పినట్లు అనిపించే చిత్రం ఇది. అలాగే వికీ లీక్ లు,స్కామ్ లు, కంప్యూటర్ అంటూ కొత్త విషయాలతో పాత కథనే అంతే పాతగా చెప్పే ప్రయత్నం చేసిన ఈ చిత్రం పూరి వీరభక్తులుకు నచ్చుతుంది.

    English summary
    Ism which is directed by Puri Jagan has finally released today after a huge round of promotions. Let’s see whether Kalyan Ram impresses in his new movie or not.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X