twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలర్ ఫుల్ కాలక్షేపమే (‘కళ్యాణ వైభోగమే’రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    పోస్టర్ నిండుగా కలర్ ఫుల్ గా కళకళ్లాడుతూ జనం, అందరి ముఖాల్లో సంతోషం, పెళ్లి బట్టల్లో హీరో,హీరోయిన్ ..ఇవి చాలవా జనాలను ధియోటర్ దాకా లాక్కురావటానికి...ఇదేమి నందిని రెడ్డీ కనిపెట్టిన మంత్రం కాదు కానీ అనుసరించిన సక్సెస్ ఫుల్ స్ట్రాటజీ. ఓపినింగ్స్ బాగనే రప్పించుకున్న ఈ చిత్రం ఏ మేరకు నిలబెట్టుకోబోతోందో చూద్దాం.

    తొలి చిత్రం 'అలా మొదలైంది' తో మంచి రొమాంటిక్ కామెడీలు తీయగల దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న ఆమె రెండో చిత్రం జబర్దస్త్ తేడా కొట్టినా మూడో చిత్రంతో తన బలాలేంటో తెలుసుకుని సరైన దార్లోకి వచ్చింది. అర్బన్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం యూత్ లోకి వెళ్లే అవకాసం ఉంది. సినిమా చూస్తూంటే ఎన్నో సినిమాలు గుర్తుకు వచ్చినా, తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయినా దర్శకురాలు మాత్రం తన మ్యాజిక్ తో కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ చేసి నిలబెట్టింది.

    సింపుల్ గా చెప్పాలంటే పెళ్లంటే ఇష్టం లేని గేమ్ డిజైనర్ శౌర్య (నాగశౌర్య) ... దివ్య (మాళవికా నాయర్) . కానీ వీళ్ల తల్లి తండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూండటంతో..దాంతో వీళ్లద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లి అనే తంతుని డ్రామాగా ఆడటం మొదలెడతారు. ఆ డ్రామా ఏ మలుపు తిరిగింది. ఎలాంటి పరిణాలకు దారి తీసింది. వీళ్లద్దరూ చివరకు ఎలా ఒకటయ్యారు. ఇంతకీ పెళ్లి అంటే చివరకు వీళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారా వంటి విషయాలతో కూడిన సినిమా ఇది.

    ఇలాంటి కథలు తెలుగుకు కొత్తేమీ కాదు... కాకపోతే ట్రీట్ మెంట్ తేడా. కొంచెం అటూ ఇటూలో అప్పట్లో అంటే 2001 లో మాధవన్ హీరోగా డుం..డుం..డుం అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం అంటే జగపతిబాబు హీరోగా చేస్తున్నప్పుడు పెళ్లైన కొత్తలో అని చిత్రం వచ్చింది. కృష్ణవంశీ, గోపచంద్ తో చేసిన మొగుడు సినిమా వచ్చింది. ఇవన్నీ ఇలాంటి కథలే. కాకపోతే ఇందులో కామెడీ డోస్ కాస్త పెంచి హిట్ కొట్టాలనే ఆలోచన చేసింది నందినీ రెడ్డి...అదే దీని స్పెషాలిటీ. కృష్ణవంశీ సినిమాల్లో లాగ ఫస్టాఫ్ ఫ్రేమ్ నిండా జనాలు, పెళ్లి హడావిడితో గడిచిపోతే సెకండాఫ్ ..ఫన్ తో నడిచి, క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో ముగింపుకొచ్చింది. సినిమాలో ఎక్కువ ట్రై చేసింది ఫన్ కాబట్టి అదే సినిమాని నిలబెట్టే అంశం కావాలి.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

    ట్రిమ్ చేయాలి

    ట్రిమ్ చేయాలి

    సినిమాకు లెంగ్తే పెద్ద సమస్య అనిపిస్తుంది. కొంత ట్రిమ్ చేసి వదిలితే ఇంకాస్త మంచి రిజల్ట్ వస్తుందనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్ పాయింట్ ని కొన్ని చోట్ల బాగా సాగతీసిన ఫీలింగ్ వచ్చింది. దర్శక,నిర్మాతలు ఈ విషయమై దృష్టి పెడితే మరింత మెరుగైన ఫలితం వస్తుంది.

    కన్విసింగ్ గా చెప్పలేదు

    కన్విసింగ్ గా చెప్పలేదు

    హీరో, హీరోయిన్స్ పెళ్లి ఎందుకు వద్దంటున్నారో చెప్పే కారణాలతో మనం కన్వీన్స్ కాము. అయితే ఈ పాయింట్ తో కన్వీన్స్ అయితేనే లీనం కాగలం. లేకపోతే ఓ కామెడీ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది అంతే.

    తప్పలేదు కానీ..

    తప్పలేదు కానీ..

    ఓ సినిమా హిట్టైతే దాన్నే ఫాలో అవ్వాలా...క్లైమాక్స్ లో కన్ఫూజన్ కామెడీ, అదీ తాగుబోతు రమేష్ ని, ఆషిష్ విద్యార్దాని పెట్టే చేయాలా ..తప్పదా. అయితే చెప్పుకోదగ్గ అంశం ఏమిటీ అంటే ఇక్కడ నుంచే బాగా పికప్ అయ్యింది

    సంగీతం

    సంగీతం

    పాటలు ..సినిమాకు ఇంటర్వెల్ గా అడ్డుపడినా చక్కటి మెలోడితో సాగాయి. అయితే రిలీజ్ కు ముందే ఈ పాటలు జనాల్లోకి మరింతగా వెళితే మ్యూజికల్ హిట్టయ్యేది. రిరికార్డింగ్ కొన్ని బాలీవుడ్ సినిమాల ట్రాక్ లను గుర్తు చేస్తూ సాగింది. అప్ టు ది మార్క్ లేదు

    కథ, మాటలు

    కథ, మాటలు

    క్యారక్టర్ డ్రైవన్ స్క్రీన్ ప్లే తో సాగే సినిమాకు క్యారక్టర్స్ మరింత బలంగ రాసుకుంటే బాగుండేది. అలాగే సినిమాకు పెద్ద ప్లస్ డైలాగులు, ఫన్ రైడర్ లా సినిమాని లాక్కెళ్లటానికి డైలాగులు బాగా ప్లస్ అయ్యాయి.

    కెమెరా, ఎడిటింగ్

    కెమెరా, ఎడిటింగ్

    హైదరాబాద్ అందాలను కెమెరా బాగా పట్టుకుంది. అలాగే ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, జోష్ గా చూపెట్టడంలో కలిసి వచ్చింది. ఎడిటింగ్ మాత్రం మరింత షార్ప్ గా అంటే ఓ ఇరవై , ఇరవై ఐదు నిముషాలు లేపేసినా బాగుండేది అనిపించింది.

    కలర్ ఫుల్ కాలక్షేపమే (‘కళ్యాణ వైభోగమే’రివ్యూ)

    కలర్ ఫుల్ కాలక్షేపమే (‘కళ్యాణ వైభోగమే’రివ్యూ)

    నందినీ రెడ్డి ప్రతీ ఫ్రేమ్ ని కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకోవటంలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగ అందరినీ అందంగా చూపెట్టాలనే కాన్సెప్టుతో ముందుకెళ్లినట్లుంది. ముఖ్యంగా ఎమోషన్స్ ని మెలోడ్రామాకు అవకాసం ఇవ్వకుండా బాగా పండించింది.

    హీరో,హీరోయిన్స్

    హీరో,హీరోయిన్స్

    నాగశౌర్య...డీసెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. మాళవిక నాయిక్ కూడా ఎమోషన్స్ ని చక్కగా పలికించింది. అయితే కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ కూడా వీళ్ల చేత చేయించారు.

    స్పెషల్

    స్పెషల్

    ఈ సినిమాలో అప్పటి హీరోయిన్ రాశి కు రీ ఎంట్రీ దొరికింది. హీరోయిన్ తల్లిగా ఆమె చాలా బాగా చేసింది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్
    నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్, రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్‌మదిరాజ్, తా.రమేష్, ధన్‌రాజ్, హేమంత్, స్నిగ్ధ తదితరులు
    సంగీతం : కళ్యాణ్‌ కోడూరి,
    సినిమాటోగ్రఫీ : జివిఎస్‌ రాజు,
    ఎడిటర్‌ : జువైద్‌ సిద్ధిక్‌,
    కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్‌, రఘు, అని,
    మాటలు, పాటలు: లక్ష్మీ భూపాల్‌,
    యాక్షన్‌ : డ్రాగన్‌ ప్రకాష్‌, పాంథర్‌ నాగరాజు,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వివి నందినిరెడ్డి.
    సహనిర్మాతలు: వివేక్ కూచిభోట్ల, జగన్‌మోహన్‌రెడ్డి.వి.
    నిర్మాత: కె.ఎల్.దామోదర్‌ప్రసాద్
    విడుదల తేదీ: 04-03-2015.

    ఫైనల్ గా అసభ్యత,హింస లేకుండా ఫన్ తో మిళితం అయిన ఈ సినిమా ఫ్యామిలీలకు వీకెండ్ లో మంచి ఆప్షన్....కాలక్షేపం. బి,సి సంగతేమో కానీ మల్టిప్లెక్స్ లకు ముఖ్యంగా అర్బన్ యూత్ ని ఆకట్టుుకనే అవకాసం ఉంది.

    English summary
    Kalyana Vaibhogame film was smooth and simple without much dramatization, which makes it a good watch. Moreover the casting of the film is interestingly done.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X