twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాటమరాయుడు మూవీ రివ్యూ

    కాటమరాయుడు చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్ చిత్రానికి రీమేక్. లవ్, కామెడీ, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌, పవర్ ఫుల్ డైలాగ్స్ దట్టించిన కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: పవన్ కల్యాణ్, శృతిహాసన్, శివబాలాజీ, ఆలీ, అజయ్, రావు రమేష్
    Director: కిషోర్ కుమార్ పార్ధసాని

    తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్, స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. భారీ అంచనాలతో గతేడాది వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకోవడం అభిమానులను జీర్ణించుకోలేకపోయారు. తాజాగా అభిమానులను మెప్పించేందుకు పవన్ కల్యాణ్ కాటమరాయుడు అవతారం ఎత్తాడు. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్ చిత్రానికి రీమేక్.

    మాస్ ఎలిమెంట్స్‌తో

    మాస్ ఎలిమెంట్స్‌తో

    ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో శ్రుతిహాసన్ రెండోసారి జతకట్టింది. ఇప్పటివరకు తమ్ముడి ఇమేజ్‌ ఉన్న పవన్ కల్యాణ్ తొలిసారిగా అన్నయ్యగా కనిపించనున్నారు. అన్నదమ్ముల అనుబంధం, లవ్, కామెడీ, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌, పవర్ ఫుల్ డైలాగ్స్ దట్టించిన కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన కాటమరాయుడు అభిమానులను ఏ మేరకు సంతృప్తి పరిచిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     ప్రేమ, ఫ్యాక్సన్ మేలవింపు

    ప్రేమ, ఫ్యాక్సన్ మేలవింపు

    రాయలసీమలోని తాళ్లపాక గ్రామంలో కాటమరాయుడు ఓ పెద్ద తరహా వ్యక్తి. ప్రజలకు ఏ కష్టం వస్తే తన ప్రాణాలను అడ్డపెట్టి
    ఆదుకోవడం ఆయన నైజం. కాటమరాయుడుకి నలుగురు తమ్ముళ్లు (శివబాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, చైతన్య కృష్ణ), ఓ మిత్రుడు లింగా (అలీ) ఉంటారు. ప్రేమ, పెళ్లి మనుషులను విడతీస్తాయనే భావనలో ఉంటూ అమ్మాయిలకు, పెళ్లికి కాటమరాయుడు దూరంగా ఉంటారు. కానీ నలుగురు తముళ్లు, మిత్రుడు లింగా ప్రేమలో పడుతారు. అన్నయ్యకు వివాహామైతే కానీ తమకు పెళ్లి కావడం కష్టంగా మారిన నేపథ్యంలో కాటమరాయుడ్ని ఎలాగైనా ప్రేమలో పడేలా చేయాలనుకొంటారు. సున్నిత మనస్కుడు, జంతు ప్రేమికుడు అని అబద్దాలు ఆడి ఆ గ్రామానికి వచ్చిన డ్యాన్సర్ అవంతి (శ్రుతీహాసన్)తో ప్రేమలో పడేలా చేస్తారు.

    పలు సమస్యలకు పరిష్కారం

    పలు సమస్యలకు పరిష్కారం

    అలా ప్రేమలో ఉండగా కాటమరాయుడు నిజస్వరూపం తెలుస్తుంది. తన కుటుంబానికి విరుద్ధమైన భావాలను కాటమరాయుడు కలిగి ఉన్నాడని తెలుసుకొన్న శ్రుతి హాసన్ ప్రేమ నిరాకరిస్తుంది. తన ప్రేమను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాటమరాయుడికి అవంతి కుటుంబానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నదని తెలుసుకొంటాడు. ఇంతకి అవంతికి కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటీ? దానిని కాటమరాయుడు ఎలా పరిష్కరించాడు. అవంతితో తన ప్రేమను ఎలా దక్కించుకొన్నాడు? తన సోదరులకు ఎలా చూసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కాటమరాయుడు సినిమా.

    చకచకా సాగిన ఫస్టాఫ్

    చకచకా సాగిన ఫస్టాఫ్

    ఎలాంటి సాగతీత లేకుండా మొదటి సీన్‌లోనే అన్నదమ్ముల అనుబంధం, కాటమరాయుడు ఎంటో చక్కగా చెప్పేశాడు. మరో సీన్లో రావు రమేశ్‌కు ఉన్న శత్రుత్వాన్ని సింపుల్ చెప్పేసే కథపై పట్టు సాధించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో కాటమరాయుడు సోదరులు, ఆలీ ప్రేమ వ్యవహారాన్ని డైరెక్టర్ చకచకా నడిపించేశాడు. అవంతి (శ్రుతిహాసన్) ఎంట్రీ చాలా సాఫీ జరిగిపోయింది. కాటమరాయుడు, అవంతి ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా సాగిపోతాయి. కాటమరాయుడు టైటిల్ సాంగ్, జివ్వు జివ్వు, లాగే లాగే పాటలు, రెండు మంచి ఫైట్లతో ఫస్టాఫ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది.

    సెకండాఫ్ నత్త నడక..

    సెకండాఫ్ నత్త నడక..

    ఇక సెకండాఫ్‌లోనే దర్శకుడు తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. అవంతి ప్రేమ కోసం కాటమరాయుడు తన ప్రవర్తనను మార్చుకోవడం లాంటి సీన్లు రొటీన్‌గా ఉండటంతో సినిమా పట్టుతప్పినట్టు కనిపిస్తుంది. కేవలం క్లైమాక్స్ కోసమే కథను ముందుకు తీసుకెళ్లడం, కథనం మందగించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ప్రీ కైమాక్స్ నుంచి కథ కొంచెం అందుకోవడంతో కాస్తా రిలీఫ్ అనిపిస్తుంది. చివరి సన్నివేశంలో కాటమరాయుడు నాలుగు మంచి మాటలతో విసిగిపోయిన ప్రేక్షకుడికి కొంత ఉపశమనం కలుగుతుంది.

     వన్ మ్యాన్ షో..

    వన్ మ్యాన్ షో..

    కాటమరాయుడుగా పవన్ కల్యాణ్ లుక్స్, పంచెకట్టుతో రఫ్ ఆడించాడు. ఫస్టాఫ్‌లో మూడు ఫైట్లతో అదరగొట్టేశాడు. సెకండాఫ్‌లో తన రేంజ్‌కు తగిన సీన్లు పవన్ కల్యాణ్‌కు లేకపోవడం కొంత మైనస్. శ్రుతిహాసన్‌కు తన ప్రేమను వ్యక్తీకరించే సమయంలో పవన్ నటన ఆకట్టుకొన్నది. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. చివర్లో పవన్ చెప్పిన డైలాగ్స్ మనసును హత్తుకునేలా ఉన్నాయి. టోటల్‌గా ఈ సినిమాకు పవన్ వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచాడు

    గ్లామర్ సీన్లకే పరిమితమైన శ్రుతి

    గ్లామర్ సీన్లకే పరిమితమైన శ్రుతి

    అవంతిగా శ్రుతిహాసన్‌ పాత్ర సాదాసీదా పాత్ర. ప్రేక్షకులకు బాగా గుర్తుండి పోయే పాత్ర కాకపోవడంతో పాటలు, గ్లామర్ సీన్లకే పరిమితమైంది. గబ్బరసింగ్, శ్రీమంతుడు చిత్రాలతో పొలిస్తే శ్రుతిహాసన్‌కు పోషించిన పాత్ర చాలా రొటీన్‌గా కనిపిస్తుంది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది.

    అలీ రెగ్యులర్, రొటీన్

    అలీ రెగ్యులర్, రొటీన్

    లింగా పాత్రలో కనిపించిన ఆలీది రెగ్యులర్, రోటిన్ క్యారెక్టర్. అలీ చేసిన సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కాటమరాయుడికి తమ్ముళ్లుగా నటించిన శివబాలజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ వారి వారి పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. శ్రుతిహాసన్ తల్లిదండ్రులుగా నాజర్, పవిత్రా లోకేష్ పర్వాలేదనిపించారు.

    మళ్లీ డిఫరెంట్‌గా రావు రమేశ్

    మళ్లీ డిఫరెంట్‌గా రావు రమేశ్

    రావు రమేశ్ పోషించిన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంది. కసి, ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో కనిపించాడు. తనకు లభించిన సీన్లలో అద్భుతమైన నటనతో రాణించాడు. ఈ చిత్రంలో ఉన్న మరో ఇద్దరు విలన్లు (ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా)లతో పోల్చుకుంటే చాలా బెటర్‌గా అనిపిస్తుంది.

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

    కాటమరాయుడికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఒకటి. సన్నివేశాలకు తగినట్టుగా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. లవ్, కామెడీ సీన్లకు అందించిన థీమ్ ఆకట్టుకుంది. మెలోడితో సాగిన పాటలు తెరపైన కూడా స్పెక్టాక్యులర్‌గా ఉన్నాయి.

    ప్రసాద్ మూరెళ్ల కెమెరా భేష్

    ప్రసాద్ మూరెళ్ల కెమెరా భేష్

    ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. పవన్ కల్యాణ్ గెటప్, లుక్‌ను కొత్తగా చూపించాడు. విదేశాల్లో చిత్రీకరించిన పాటలు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటీరియర్ సీన్లలో ప్రసాద్ మూరెళ్ల ఉపయోగించిన లైటింగ్, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి.

    బ్రహ్మ ‘కడలి’ సృష్టి

    బ్రహ్మ ‘కడలి’ సృష్టి

    కాటమరాయుడు సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రానికి వేసిన విలేజ్ సెట్ ఇండస్ట్రీలో టాక్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో షూట్ చేయడానికి సమయం లేకపోవడంతో హైదరాబాద్‌లోనే కేవలం వారం రోజుల వ్యవధిలోనే కళా దర్శకుడు బ్రహ్మ కడలి విలేజ్ సెట్ వేసి తన సత్తా చాటుకొన్నాడు. వారం రోజులపాటు ఆయన పడిన శ్రమ తెరమీద చాలా రిచ్‌గా కనిపించింది. సెట్టింగ్ చాలా నేచురల్‌గా కనిపించాయి.

    ఇరగదీసిన రామ్, లక్ష్మణ్

    ఇరగదీసిన రామ్, లక్ష్మణ్

    ఈ సినిమాలో ఫైట్స్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ మరోసారి తమ ప్రతిభను చాటుకొన్నారు. వారు రూపొందించిన ఫైట్స్ పవన్ కెరీర్‌లోనే బెస్ట్ అనిపించేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎంట్రీ ఫైట్, ట్రైన్ ఫైట్, కాటమరాయుడు కాంపౌండ్‌లోని పోరాట సన్నివేశాలు అదర గొట్టేశాయి. పవన్ సినిమాల్లో రొటీన్‌గా ఉండే ఫైట్ల మాదిరిగా ఉండకుండా క్లైమాక్స్‌ ఫైట్ బాగా చిత్రీకరించారు.

    మెరుపు లాంటి డైలాగ్స్

    మెరుపు లాంటి డైలాగ్స్

    వీరం కథకు తెలుగు నేటివిటీకి మార్చడంలో రచయిత ఆకుల శివ కీలకంగా వ్యవహరించాడు. వేమారెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిమ్మారెడ్డితో కలిసి ఆకుల శివ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల పవన్ చేత డైలాగ్స్ చెప్పించి మెరుపుల మెరిపించాడు. అయితే ప్రస్తుతం పవన్‌‌కు ఉన్న క్రేజ్‌కు తగినట్టుగా డైలాగ్స్ రాయడంలో కొంత విఫలమయ్యారు.

    పదును తగ్గిన గౌతంరాజు కత్తెర

    పదును తగ్గిన గౌతంరాజు కత్తెర

    ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటర్ గౌతంరాజు తన కత్తెరకు పూర్తిస్థాయిలో పదను పెట్టలేదని అనిపిస్తుంది. సెకండాఫ్‌‌లో ఎడిటింగ్ మరింత స్కోప్ ఉంది. కొన్ని సీన్ల లెంగ్త్ తగ్గిస్తే కొంత సెకండాఫ్‌లో కథనం వేగమందుకునే అవకాశం ఉంది.

    దర్శకుడు డాలీ సక్సెస్

    దర్శకుడు డాలీ సక్సెస్

    తమిళంలో విజయవంతమైన వీరం చిత్రాన్ని తెరకెక్కించే విషయంలో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) సఫలమయ్యాడు. కానీ సెకండాఫ్‌లోనే కొంత తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. ఫస్టాఫ్ పవన్ ఇమేజ్‌ను, కథను బ్యాలన్స్ చేయడంలో ఇబ్బంది పడినట్టు కనిపించింది.

    ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్

    ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్

    కాటమరాయుడును నిర్మాత శరత్ మరార్ చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రతీ సన్నివేశాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. నార్త్‌స్టార్ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో
    పవర్ స్టార్, శృతిహాసన్ కెమిస్ట్రీ
    దుమ్మురేపేలా పాటలు, ఫైట్లు
    పవర్ ఫుల్ డైలాగ్స్

     నెగిటివ్ పాయింట్స్

    నెగిటివ్ పాయింట్స్

    పవన్ పాత సినిమాల్లోని సీన్లు రిపీట్
    విలనిజం
    క్లైమాక్స్

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    చిత్రం: కాట‌మ‌రాయుడు
    బ్యాన‌ర్‌: నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
    న‌టీన‌టులు: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శ్రుతీహాస‌న్‌, నాజ‌ర్‌, ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌, రావు ర‌మేశ్, శివ‌బాలాజీ, ఆలీ, శివ బాలాజీ, కమల్ కామరాజు, అజయ్, వేణు మాధవ్, నాజర్, చైతన్య కృష్ణ, త‌దిత‌రులు
    కళ : బ‌్ర‌హ్మ క‌డలి
    ఫైట్స్‌: రామ్, ల‌క్ష్మ‌ణ్‌
    ఎడిటింగ్‌: గౌతంరాజు
    సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
    మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
    నిర్మాత‌: శ‌ర‌త్ మ‌రార్‌
    ద‌ర్శ‌క‌త్వం: కిషోర్ పార్ధసాని (డాలి)
    సెన్సార్ రిపోర్ట్‌: క‌్లీన్ " యూ "
    నిడివి: 144 నిమిషాలు
    రిలీజ్ డేట్‌: 24 మార్చి, 2017

    English summary
    Pawan Kalyan's Latest movie Katamarayudu Released on March 24. This movie is remake of Tamil remake Veeram. Audio, First look of the movie got good response. With lot of huge expectations this movie is released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X