»   » ప్చ్...రొటీనేగా... (లారెన్స్ ‘గంగ’ రివ్యూ )

ప్చ్...రొటీనేగా... (లారెన్స్ ‘గంగ’ రివ్యూ )

Posted by:
Subscribe to Filmibeat Telugu

Rating:
2.0/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

మొదటి నుంచి మాస్ ని టార్గెట్ చేయటంలో లారెన్స్ ముందుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా సెంటిమెంట్,కామెడీ కొద్దిగా ఓవర్ అనిపించినా ఓ వర్గానికి తెగ నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తనే హీరోగా చేస్తున్న హర్రర్ కామెడీలు సీక్వెల్ తో సైతం హిట్ అయ్యి...అతని సత్తా చూపించింది. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ముని సీక్వెల్...కాంచన దమ్ము రేపింది. దాంతో ఈ మూడో ఇన్ స్టాల్ మెంట్ గంగ మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈలోగా తమిళంలో విడుదలై,హిట్ టాక్ తెచ్చుకోవటంతో మంచి ఓపినింగ్స్ కు దారి తీసింది. అయితే తెలుగు ప్రేక్షకులు వేరు,వారి సెన్సిబులిటీస్ పూర్తిగా వేరు అని డబ్బింగ్ సినిమా ఇక్కడ రిలీజైన ప్రతీసారి తమదైన శైలిలో రిజల్ట్ ఇస్తూ చెప్తూనే ఉన్నారు. ఈ సారి కూడా రిపీట్ అవబోతోందనిపిస్తోంది. ఫస్టాఫ్ కామెడీతో బాగున్నా...సెకండాఫ్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చ చేయలేకపోయాడు. దాంతో ఒక్కసారిగా డ్రాప్ అయిన ఫీలింగ్ వచ్చింది. రొటీన్ దెయ్యం కథల మార్క్ రివేంజ్ డ్రామా గా ముగియటం నిరాశకలిగించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కామెడీ బాగా తగ్గిపోవటం, ప్రెడిక్టబుల్ కథనం ఇబ్బంది కలిగించింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Lawrence's Ganga(Muni 3) Movie  review

నిజానికి కథ పైన చెప్పుకున్నట్లు చాలా ప్రెడిక్టుబుల్ గా నడిచినా...ఇందులో కథనమే ప్రధానం. రాఘవ లారెన్స్ ఓ టీవీ ఛానెల్ లో కెమెరామెన్. అతని బాస్ తాప్సీ(చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ). మిగతా టీమ్(మలయ్ సామి, మనోబాల, జింజరి మధుమిత) తో కకలిసి...ఛానెల్ కు టీఆర్పీలు పెంచటం కోసం ఓ హాంటెడ్ హౌస్(తెలుగులో దెయ్యాలు తిరగాడే ఇల్లు) కు వెళ్తారు. అక్కడ మీరు ఊహించినట్లుగానే ఓ హర్రర్ సంఘటన చూడటం జరుగుతుంది. ఇంక చెప్పేదేముంది కొద్ది రోజులు తర్వాత... లారెన్స్ , తాప్సీ ఇద్దరూ కూడా దెయ్యాలచే ఆవహింపబడతారు(కరెక్టు పదమేనా). ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలు..వీళ్లద్దరినీ ఎందుకు పట్టుకున్నాయి...అంటే వాటికో పగ,ప్రతీకారం స్కీమ్ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరూ అంటే నిత్యామీనన్,లారెన్స్(డబుల్). ఇంతకీ ఆ దెయ్యాలు... ఎవరి మీద పగబెట్టుకున్నాయి. ఆ దెయ్యాల జంటకు ఉన్న ప్లాష్ బ్యాక్ ఏమిటి...ఆ పగ ని ఈ దెయ్యాలను వెతుక్కుంటూ వెళ్లిన జంట తీర్చారా అంటే సినిమా చూడాల్సిందే.


Lawrence's Ganga(Muni 3) Movie  review

కాంచన చిత్రంలో వర్కవుట్ అయ్యింది..ఫ్లాష్ బ్యాక్...ఇక్కడ మైనస్ గా నిలిచింది అదే... తెలుగులో ఇంతకు ముందు టీవీ ఛానెల్ వారు ఓ హాంటెడ్ హౌస్ కు వెళ్లటం అనే ఐడియాతో శివాజీ హీరోగా ఓ చిత్రం వచ్చింది (అఫ్ కోర్స్ అది జనాలకు పెద్ద తెలియదనుకోండి). అలాగే సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ పరమ రొటీన్ గా అనపిస్తుంది...ఇద్దరు ప్రేమించుకోవటం...విలన్ తన కొడుక్కు దెయ్యంగా మారిన హీరోయిన్ ని ఇచ్చి, చేయాలనుకోవటం..ఒప్పుకోకపోవటం..చంపేయటం...తర్వాత దెయ్యమై ఇద్దరూ పగ తీర్చుకోవటం. అందుకు హీరో,హీరోయిన్ల సహాయం తీసుకోవటం. ఇది కనుక కొంచెం కొత్తగా లారెన్స్ అల్లి ఉంటే బాగుండేది. అయితే నిత్యామీనన్ చేసింది కాబట్టే ఆ మాత్రం ఆ కాస్సేపు ఆ ఫ్లాష్ బ్యాక్ చూడగలిగాము. దానికి తోడు లారెన్స్...అడుగడుగునా తన తమిళ అతి, పైత్యం చూపెడుతూనే ఉంటాడు. డబ్బింగ్ కాబట్టి సరిపెట్టుకోవాలి అంతే. క్లైమాక్స్ సైతం కలగాపులగం చేసేసాడు.


Lawrence's Ganga(Muni 3) Movie  review

దర్శకుడుగా లారెన్స్...ద బెస్ట్ అని చెప్పలేం కానీ ..బాగానే చేయించుకున్నాడు అని చెప్పాలి. కానీ కోవై సరళ మరీ ఓవర్ అయ్యిందనిపిస్తుంది. నిత్యామీనన్ ని...అంగవికలురాలిగా చూడటం కాస్త ఇబ్బందే(కన్నడంలో ఓ సినిమాలోనూ ఆ మధ్య ఇలా చూపించారు). తాప్సీ ఎందుకనో ఈ సారి కాస్త నటించింది అందాల ప్రదర్శనకు పరిమితం కాకుండా. లారెన్స్ ...ముని 10 లోకి వెల్లినా అదే క్యారక్టరైజేషన్ కాబట్టి ..పెద్దగా ఎక్సపెక్ట్ చేయలేం. మిగతావాళ్ళు సోసో. క్లైమాక్స్ సినిమాలో పెద్ద మైనస్ (ఊ కొడతారా..ఉలిక్కి పడతారా క్లైమాక్స్ గుర్తుకు వస్తుంది) అలాగే..గ్రాఫిక్స్ కూడా ఏదో కార్టూన్ లు చూస్తున్న ఫీలింగ్ తెచ్చారు.


ఫైనల్ గా ... ఫస్టాఫ్ కామెడీ (అతి అయినా) తో బి,సి సెంటర్లు వర్కవుట్ కావొచ్చేమో అనిపిస్తుంది. కాంచన చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తే నిరాసపడతారు. లారెన్స్...ఈ రెగ్యులర్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ..స్కీమ్ ని ముని 4 లో వదిలేసి,మనని రక్షిస్తాడని ఆశిద్దాం.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


Lawrence's Ganga(Muni 3) Movie  review

పతాకం: శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌
నటీనటులు:రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌ తదితరులు
ఫోటోగ్రఫీ: కిచ్చా,
సంగీతం: థమన్,
సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్,
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు,
కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
విడుదల తేదీ: మే 1, 2015.

English summary
The man that broke the jinx in cinema, bringing in comic horror movie, through 'Muni', is back to the big screen with the next in this genre that he has pioneered. Finally Lawrence master’s “Ganga” (Kanchana 2)came today with divide talk. A part from Lawrence’s direction and acts, glamour of Taapsee and Nitya Menon are going to be a plus. But plot is very predictable.
Please Wait while comments are loading...