»   » పూరీ బ్యాడ్...వరుణ్ తేజ్ గుడ్! (లోఫర్ రివ్యూ)

పూరీ బ్యాడ్...వరుణ్ తేజ్ గుడ్! (లోఫర్ రివ్యూ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

Rating:
2.0/5

హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయాడు. హిట్టు సినిమాల కంటే చెత్త సినిమాలే ఎక్కువగా తీసినా.... హిట్టు సినిమాల ప్రభావమే జనాల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఆయన నుండి సినిమా వస్తుందంటే ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది అందరిలో! ఈ సారి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరో కావడం, ఇటీవల ‘కంచె' సినిమాతో వరుణ్ పై మంచి అంచనాలు ఉండటంతో....‘లోఫర్' మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కథలోకి వెళితే.... లోఫర్ పనులు, దొంగతనాలు చేసే కృష్ణ (పోసాని కృష్ణమురళి) భార్య లక్ష్మమ్మ (రేవతి)తో పుట్టింటి నుండి ఆస్తి తేవాలని గొడవ పడతాడు. లక్ష్మమ్మ అందుకు ఒప్పుకోక పోవడంతో నెలల వయసున్న తనకొడుకు రాజా (వరుణ్‌తేజ్‌)ని కూడా తీసుకుని జోద్ పూర్ వచ్చేస్తాడు. ‘నీ చిన్నప్పుడే అమ్మ పచ్చ కామెర్లొచ్చి చచ్చిపోయింది' అంటూ నమ్మిస్తాడు. కొడుకును తనంటే లోఫర్ గా, దొంగగా పెంచి పెద్దచేస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఇంట్లోంచి పారిపోయి జోథ్‌పూర్‌ వస్తుంది పారిజాతం (దిశాపటాని). ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు రాజా. ఈ క్రమంలో పారిజాతం సొంత మరదలేనని, ఆమె తన సొంత మేనమామ (ముఖేష్‌రుషి) కూతురేనని, తన అమ్మ బతికే ఉందన్న నిజం పారిజాతం ద్వారా తెలుసుకొంటాడు రాజా. ఈలోగా తన మామ మనసుషులు పారిజాతాన్ని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఏం జరిగింది? రాజా తన మరదలిని ఎలా దక్కించుకున్నాడు? అమ్మకు ఎలా దగ్గరయ్యాడు అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
పెర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ తేజ్ అరదగొట్టాడు. తన గత రెండు సినిమాల కంటే డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించడంతో పాటు మరింత మెచ్యూర్డ్ గా నటించాడు. వరుణ్ తేజ్ తొలి రెండు సినిమాలతో క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తే ఈ సారి పక్కా మాస్ గెపట్ లో మాస్ ఆడియన్స్ చేత సూపర్బ్ అనిపించుకున్నాడు.

హీరోయిన్ దిశా పటాని పెర్ఫార్మెన్స్ బావుంది. అందం పరంగా ఆకట్టుకుంది. తెరపై అచ్చం హీరోయిన్ ఇలియానాను చూసినట్లే ఉంది. ఇక తల్లి పాత్రలో నటి రేవతి పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. పోసారి క్యారెక్టరైజేషన్ బావుండమే కాదు ఆయన ఆ పాత్రలో జీవించారు కూడా. అలీ, బ్రహ్మానందం కాస్త నవ్వించారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్...
వరుణ్ తేజ్ తో పాటు, రేవతి పెర్ఫార్మెన్స్, పోసాని పాత్రను మలిచిన తీరు సినిమా ప్రధాన ఆకర్షణ. సినిమాలో చూపిన లొకేషన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. విలన్ గ్యాంగ్ గెటప్స్ ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ సెట్ బావుంది, ఆర్ట్ డైరెక్షన్ ఓకే, సినిమాటోగ్రఫీ గుడ్.
మైనస్ పాయింట్స్
సినిమాకు అతి పెద్ద మైనస్ స్క్రిప్టు. పాతికేళ్ల కిందటి స్టోరీ లా ఉంది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు. సినిమాలోని కొన్ని హింసాత్మక సీన్లు....ఇబ్బందిగా ఉన్నాయి.

సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా యావరేజ్ గా ఉంది. ఇక సెకండాప్ మలిచిన తీరు బిలో యావరేజ్ గా ఉంది. అయితే తల్లి కొడుకుల మధ్య భావోద్వేగాలు పండించిన తీరు బావుంది. స్టోరీ పెద్దగా ఆకట్టుకోక పోయినా ఆయన టేకింగ్, హీరోను చూపించిన తీరు, ఫైట్స్ ప్రేక్షకులు పారిపోకుండా సీట్లోనే ఉండేలా చేసాయి.

ఫైనల్ గా....
పూరి సినిమా అనగానే ప్రేక్షకులు భారీగా ఊహించుకుని వెళతారు. చాలా సార్లు నిరాశ పరిచినట్లే ఈ సారి కూడా పూరి మెజారిటీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాడు. ప్రతి సారి ఆశగా వెళ్లడం, నచ్చని వారు ‘పూరి... నీ సినిమాకో దండం' అంటూ థియేటర్ బయటకు వచ్చి కాస్త డిసప్పాయింట్ అవ్వడం లాంటివి కనిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్


ముకుంద, కంచె చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన వరుణ్‌తేజ్‌ ‘లోఫర్' ద్వారా తాను మాస్‌ పాత్రలు కూడా బాగా చేయగలను అని నిరూపించుకున్నాడు.

మెగా ఫ్యామిలీ హీరో


మోగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరోను వరుణ్ తేజ్ రూపంలో భవిష్యత్తులో చూడబోతున్నాం అనే పీల్ కలిగించాడు.

దిశా పటాని


హీరోయిన్ దిశా పటాని అందం పరంగా, పెర్పార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది. మంచి భవిష్యత్ ఉంటుంది.

కెమిస్ట్రీ


సినిమాలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ చిన్నదే అయినా ఉన్నంతలో కెమిస్ట్రీ బాగా పండించాడు పూరి.

ఫస్టాఫ్ వరస్ట్


లోఫర్ మూవీ ఫస్టాఫ్ చాలా వరస్ట్ గా ఉంది. పూరి లాంటి దర్శకుడు కూడా ఇలా చేయడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.

మదర్ సెంటిమెంట్


సినిమాలో పూరి మదర్ సెంటిమెంట్ బాగా పండించాడు.

ఫైనల్ గా..


దర్శకుడు పూరి ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాడు.

English summary
Puri Jagannadh is here again to treat you with his third offering for the year, Loafer, while Varun Tej is venturing out to test the waters as a mass hero. Read the review to know if the duo has succeeded in delivering a promising film.
Please Wait while comments are loading...