twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇతనో స్వదేశి ('శ్రీమంతుడు' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    3.0/5

    -- సూర్య ప్రకాష్ జోశ్యుల

    'ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగటం' ,'సాటి మనిషికి కష్టం అనేది చూడకపోతే మనము భూమ్మీద సంఘంలో బ్రతకటం ఎందుకు?' అని చెప్తూ, 'శ్రీమంతుడు' వచ్చేసాడు. రెగ్యులర్ రొటీన్ మసాలా కథలకు కాస్త కామా పెట్టి మన చుట్టూ ఉండే వాస్తవ పరిస్ధితులు ముడిపెడ్తూ ఉన్నంతలో మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్ ని సైతం మోసుకొచ్చాడు. కామెడీకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వని ఈ సినిమాలో... ఫస్టాఫ్ మంచి రన్ తో పరిగెట్టి,సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్స్ బీట్స్ తో ప్రెడిక్టుబుల్ క్లైమాక్స్ తో స్లో అయ్యిందనిపించినా మహేష్ ఛార్మ్ తో లాక్కెళ్ళిపోయాడు. అఫ్ కోర్స్ దానికి అద్బుతమైన సినిమాటోగ్రఫీ కూడా సహకరించిందనుకోండి.

    అలాగే మహేష్ ప్రీ క్లైమాక్స్ లో అద్భుతమైన ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శక,రచయిత కొరటాల శివ సైతం ...పంచ్ డైలాగులుకు వెళ్లకుండా...'నా కడుపున పుట్టినందుకు ధాంక్స్ రా నాన్న' వంటి ఎమోషనల్ డైలాగ్స్ తో కథనం స్మూత్ గా రన్ చేసాడు. రెండు గంటల 43 నిముషాలు సమయం...లెంగ్త్ మరీ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది..ఓ పదిహేను ..ఇరవై నిముషాలు ..ట్రిమ్ చేస్తే మరింత బాగుంటుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే... ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశాన్ని మహేష్ వంటి సూపర్ స్టార్ ఎంచుకోవటం, అదీ పరాజయాల్లో ఉన్నప్పుడు గొప్ప విషయం..అందుకు ఆయన్ని అభినందించాలి.

    గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హర్ష వర్ధన్ (మహేష్) చదువుపూర్తి చేసుకుని బిజినెస్ చూసుకోవాలని తండ్రి రవికాంత్(జగపతిబాబు) ఆశపడతాడు. అయితే తనకు అన్నీ ఉన్నా తనకు అనుకున్న సంతోషం దక్కలేదని ఇంకేదో కావాలని వెతుకుతూంటాడు హర్ష. ఆ క్రమంలో అతనికి చారుశీల(శృతిహాసన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తే...ఆమె హర్ష...ఫలానా రవికాంత్ కొడుకు అని తెలుసుకుని రిజెక్టు చేస్తుంది. దానికి కారణం...నీకు నీ సొంత ఊరు కూడా తెలియదు..మీ ఊరుకి ఏమీ చెయ్యలేదు అంటుంది. అప్పుడు తన సొంత ఊరు దేవరకోట అని తెలుసుకుని హర్ష అక్కడి వెళ్లతాడు. ఆ ఊరిలో చారుశీల తండ్రి నారాయణరావు(రాజేంద్రప్రసాద్)తో కలిసి ఆ ఊరుని బాగుచేయటం మొదలెడతాడు. అయితే అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అంతేకాకుండా హర్ష కు ఇంకో షాక్ అయ్యే విషయం తెలుస్తుంది...ఇంతకీ హర్ష తెలుసుకున్న ఆ విషయం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఆమె ప్రేమను ఎలా సాధించాడు. ముఖేష్ రుషి పాత్ర కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇలా సూపర్ స్టార్ ని పెట్టుకుని ఆ ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్లలో తను అనుకున్న మెసేజ్ కప్పడిపోకుండా కథ రెడీ చేయటం కష్టమే. కాలు బ్యాలెన్స్ తప్పకుండా కాలువ మీద తాటిపట్టి మీద నడచి,అవతలి వైపు వెళ్లటం లాంటిది. అలాంటి ఫీట్ ని దాదాపు విజయవంతంగానే పూర్తి చేసాడు కొరటాల శివ.

    దానికి తోడు ఈ మధ్య కాలంలో గ్లోబులైజేషన్ నేపధ్యంలో మారుతున్న పల్లెటూరుని చూపే, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలు అరుదైపోయాయి. అడపా దడపా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చినా అవన్నీ వంశీ పల్లెటూరులో అప్పట్లో తీసిన సినిమాలను అనుకరిస్తూ వచ్చినవే..వస్తున్నవే.లేదా ఏ తమిళ సినిమాలో పల్లెటూరో ఉన్నట్లు లొకేషన్స్, క్యారెక్టర్స్ ఉంటున్నాయి. అంతేకానీ ఇప్పటి మన పల్లెని, గ్రామాలని అక్కడ కష్టాలని, ఆనందాలని,సమస్యలను చూపటం లేదు. అవన్నీ చూపటం మొదలెడితే అది మై విలేజ్ అని ఏదో డాక్యుమెంటరీ తీసినట్లు,చూసినట్లు తయారవుతున్నాయి. దాంతో దర్శక,రచయితలు ఇప్పుడొస్తున్న కథలన్నిటినీ అర్బన్ బ్యాక్ డ్రాప్ లోనే రాసేసి తెరకెక్కిస్తున్నారు.

    ఈ సమయంలో గో బ్యాక్ టు విలేజెస్ అనే నినాదం మనస్సులో పెట్టుకుని సిని ప్రపంచానికి దూరమైపోతున్న విలేజ్ ని తెరపై ఆవిష్కరించాడు కొరటాల శివ. అదే సమయంలో గతంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ చేసిన అతడు చిత్రం ఛాయలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మహేష్ సైతం తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలన్న తపనతో చేసినట్లు కనపడుతుంది. జగపతిబాబు పాత్ర సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచేలా డిజైన్ చేసారు. అయితే మహేష్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కొత్తగానూ అదే సమయంలో ఎమేషన్ సీన్స్ బేస్ గా నడవటంతో కాస్త డల్ గానూ అనిపిస్తుంది.

    స్ర్రిప్టు పరంగా ఫస్టాఫ్ లో మరింత త్వరగా కథలోకి వచ్చి..ఎంటర్ట్నైమెంట్ ని పెంచాల్సింది. అలాగే మరి రొటీన్ గా స్టోరీ ట్రీట్ మెంట్ చేయటంతో రాబోయే పదో సీన్లో ఏం జరుగుతుందో కూడా ముందే తెలిసేలా కథనం రెడీ అయ్యింది. దాన్ని కొన్ని థ్రిల్స్ కలిపి, అధిగమిస్తే బాగుండేది.

    స్లైడ్ షోలో... మిగతా రివ్యూ

    ఎప్పటిలాగే

    ఎప్పటిలాగే

    మహేష్ ఎప్పటిలాగే తన ఫెరఫార్మెన్స్ లోనూ,లుక్ లోనూ తనే సూపర్ అనిపించుకున్నాడు. హర్ష పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా టీ షర్ట్ వేసినప్పుడు, జగపతిబాబుతో వచ్చే సీన్ లో, క్లైమాక్స్ లో విలేజ్ ఫైట్ లోనూ మహేష్ ఈజ్ బెస్ట్ అనకుండా ఉండలేం.

    శృతి మించకుండా...

    శృతి మించకుండా...

    ఈ సినిమాలో శృతి రోల్ తక్కువైనా చారుశీల పాత్రలో ఆమె రొమాన్స్ ని పండించింది. పాటల్లో ఆమె అందాలుకు.. ఆమె ఫెరఫెక్ట్ షేప్ కోసం తీసుకునే శ్రద్ద ముచ్చటవేస్తుంది.

    కెమిస్ట్రీ...కాలేజ్ సీన్స్

    కెమిస్ట్రీ...కాలేజ్ సీన్స్

    లీడ్ రోల్ .. మహేష్ బాబు, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే వీరిద్దరి మధ్యా వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ ట్రాక్ అదిరిందనే చెప్పాలి.

    డల్ అయ్యి ఒక్కసారి లేచింది

    డల్ అయ్యి ఒక్కసారి లేచింది

    ఇంటర్వెల్ కు ముందు కాస్సేపు పూర్తిగా పడిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ బాగుందనిపించింది.

    సెకండాఫ్ లో ...

    సెకండాఫ్ లో ...

    సెకండాఫ్ లో మామిడి తోటలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్, ప్రీ క్లైమాక్స్ హైలెట్స్

    ఫుల్-నిల్

    ఫుల్-నిల్

    ఎమోషన్ ఫుల్-ఎంటర్టైన్మెంట్ నిల్ అనే స్కీమ్ తో ఈ సినిమా సాగింది. అది మహేష్ నుంచి కొద్దిగా సరదాని, ఫన్ ని ఆశించే అభిమానులకు కొంచెం నిరాశపరిచే అంశంమే.

    ఓకే..కానీ

    ఓకే..కానీ

    దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతంలో పాటలు మొదట పెద్దగా ఎక్కకపోయినా సినిమాలో చూస్తుంటే బాగున్నాయనిపిస్తుంది. ఇక నుంచి ఈ పాటలు మరింతగా జనాల్లోకి వెళ్తాయి. రీరికార్డింగ్ కూడా చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది.

    స్టైల్ కే ..

    స్టైల్ కే ..

    కొరటాల శివ ఈ సినిమాలో తన మొదటి చిత్రం మిర్చి తరహాలోనే స్టైల్ కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాగని ఎమోషన్ సన్నివేశాల్లో స్టైల్ ...డామినేట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే సెకండాఫ్ ని మరింత స్పీడ్ గా రన్ చేస్తే బాగుండేది.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    సినిమాలో సినిమాటోగ్రఫీ..ప్రతీసీన్ ని ఓ పెయింట్ లాగ డిజైన్ చేసినట్లుంది. లొకేషన్స్ ని అద్బుతంగా చూపించి సినిమాని మరో మెట్టుకు తీసుకు వెళ్లింది. అలాగే ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తపడితే బాగుండేది.

    ('శ్రీమంతుడు' రివ్యూ)

    ('శ్రీమంతుడు' రివ్యూ)

    బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
    నటీనటులు: మహేష్ బాబు, శ్రుతి హాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన తదితరులు
    పాటలు: రామజోగయ్యశాస్త్రి,
    డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు,
    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,
    ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌,
    కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి,
    నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.
    విడుదల తేదీ: ఆగస్టు 7, 2015.

    ఫైనల్ గా 'శ్రీమంతుడు' చిత్రం..బ్రతుకుతెరవు కోసం పుట్టిన ఊరుని వదిలేసి వచ్చి ఎదిగిన తర్వాత మీరు మీ పుట్టిన ఊరుకి కూడా ఏదో ఒకటి చేయాలనే సందేశం ఇచ్చిన ఈ సినిమా చూసిన తర్వాత మనకూ మన ఊరు వెళ్లి ఏదో ఒకటి చేయాలనిపిస్తే దర్శకుడు,హీరో,నిర్మాత నిజమైన సక్సెస్ పొందినట్లే. అలాగే సందేశం వినే మూడ్ లో మీరు ఉంటే...మీ డబ్బులు గిట్టుబాటు అయినట్లే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Srimanthudu film lacks great pace it managed to keep you engaged for 2 hours 43 minutes with it's share of moments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X