twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన లో మనిషిని గుర్తుచేసే "మన ఊరి రామాయణం" (రివ్యూ)

    |

    Rating:
    3.0/5

    మళయాలీ సినిమా మరీ పెద్ద ఇండస్ట్రీ ఏం కాదు కానీ కాస్త కొత్తగా ఆలోచించే దర్శకులుంటారు, షట్టర్ అనే సినిమా కథ పెద్దదేం కాదు కానీ కాస్త వేరుగా ఉండే కథ అసలు ఈ పాయింట్ కూడా సినిమాకి పనికి వస్తుందీ అని మామూలుగా ఎవ్వరూ ఊహించని కథ. ఒక వేళ ఏ పత్రికలోనో వస్తే గనక మూడు పేజీలకు మించని సబ్జెక్టు. కానీ ఆ కథని కూడా ప్రేక్షకున్ని కట్టి పడేసే సినిమా చేయవచ్చు అన్న ఆలోచనకే సగం మార్కులు పడిపోతాయి. ఓ ఊరి పెద్ద మ‌ద్యం తాగిన మ‌త్తులో ఓ వేశ్య‌ని ర‌ప్పించుకొంటాడు. మ‌ధ్య‌లో త‌న గౌర‌వం గుర్తొస్తుంది. ఈ సంగ‌తి తెలిస్తే లోకం, ఊరు ఏమ‌నుకొంటుందో అంటూ భ‌యం ప‌ట్టుకొంటుంది. క‌నీసం ముట్టుకోనన్నా ముట్టుకోడు. ఆ వేశ్య‌ని తిరిగిపంపించేద్దాంటే... అనుకోని ఆటంకం వ‌స్తుంది. అందులోంచి ఎలా బ‌య‌ప‌డ్డాడు, త‌న ప‌రువు ఎలా కాప‌డుకొన్నాడు అనేదే షట్టర్ అనే సినిమా.

    ఈ సినిమాని మళయాలం లో తీయటం పెద్ద విషయమేం కాదుగానీ.., స్టార్ రేటెడ్, భారీ బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి కనీసం నాలుగు తయారయ్యే టాలీవుడ్ లో తీయాలనుకోవటం అంతే కలర్ఫుల్ గా ప్రేక్షకున్ని ఓ రెండు గంతల పాటు కూర్చో బెట్టే విధంగా తీయాలనుకోవటం ఒక సాహసమే. మలయాళ షట్ట‌ర్‌ ని తెలుగులో ప్ర‌కాష్‌రాజ్ మ‌న ఊరి రామాయ‌ణం పేరుతో రీమేక్ చేశాడు. ఆ ప్ర‌య‌త్నం ఎలా సాగింది? అసలు ప్రకాశ్ రాజ్ ఎలా తీయగలిగాడు ఆయన ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అయ్యిందీ అనేది ఇప్పుడు చూద్దాం...

     పరువు కోసం తపన పడే వ్యక్తి

    పరువు కోసం తపన పడే వ్యక్తి


    దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించి, తన ఊరిలో స్థిరపడిన వ్యక్తి భుజంగరావు(ప్రకాశ్ రాజ్). పరువు కోసం ఏమైనా చేస్తాడు. భుజంగంపెద్ద కూతురికి బాగా చదువుకోవాలని ఉంటుంది. అయితే భుజంగం అనుమానంతో, పెద్ద కూతురుకి డిగ్రీ పూర్తి కాకముందే పెళ్లి చేసేయాలనుకుంటాడు. ఆటో నడుపుకునే శివ(సత్యదేవ్‌)కు దుబాయ్‌ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకని భుజంగంను పాస్‌పోర్ట్‌ ఇప్పించమని అడుగుతాడు.

     రాత్రి ఎంజాయ్‌ చేయాలనుకుని

    రాత్రి ఎంజాయ్‌ చేయాలనుకుని

    భుజంగం శివకు పాస్‌పోర్ట్‌ ఇప్పిస్తానని మాటలు చెబుతాడు కానీ పాస్‌పోర్ట్‌ ఇప్పించకుండా.., శివను తన స్వంత పనులకు వాడుకుంటూ ఉంటాడు. భుజంగానికి తన ఇంటి పక్కనే ఓ ఖాళీ షాప్ ఉంటుంది. ఆ షాప్‌లోనే తన మిత్రులతో ఎప్పుడూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి భుజంగం తన మందు కొట్టి ఇంటికి వెళుతూ దారిలో ఓ వేశ్య(ప్రియమణి)ని చూస్తాడు. ఆమెతో ఓ రాత్రి ఎంజాయ్‌ చేయాలనుకుని శివ సాయంతో ఆమెతో బేరం కుదుర్చుకుంటాడు. వేశ్యతో బయటెక్కడైనా కనపడితే సమాజంలో తన పరువు పోతుందని భావించి, అమ్మాయితో తన ఖాళీ షాప్‌లోకే వెళతాడు.

     ప‌రువు పోతుంద‌ని:

    ప‌రువు పోతుంద‌ని:


    శివ (సత్య) వారిద్దరిని షాపులో వుంచి, తాళం వేసి, గంటలో వస్తానని వెళ్తాడు. వేశ్య‌ని తీసుకొచ్చాడే గానీ.. భుజంగానికి లోలోప‌ల భ‌యం. బ‌య‌ట‌కు తెలిస్తే ప‌రువు పోతుంద‌ని ఒణికిపోతుంటాడు. అలాగ‌ని బ‌య‌ట‌కు పంపేద్దామంటే తాళం వేసి ఉంటుంది. గంట‌లో వ‌స్తానన్న స‌త్య ఎంత‌కీ రాడు.

     చివ‌రికి ఏమైంది?:

    చివ‌రికి ఏమైంది?:


    దాంతో ఆ షాపులో రెండు రోజులు అలా వుండిపోవాల్సి వస్తుంది. మ‌రి చివ‌రికి ఏమైంది? వాళ్లిద్ద‌రూ బ‌య‌ట ప‌డ్డారా, లేదా? శివ ఎక్క‌డ ఉండిపోయాడు? త‌నకి ఎదురైన సినిమా ద‌ర్శ‌కుడు (ఫృథ్వీ) క‌థేంటి?? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే.. మ‌న ఊరి రామాయ‌ణం చూడాల్సిందే.

     విశ్లేషన:

    విశ్లేషన:

    పరువూ పరువూ అంటూ తిరిగే ఒక ఊరి పెద్దమనిషి, పాతకాలం సాంప్రదాయాలని పాటించాలనీ, ఆడవాళ్ళంటే తక్కువ అభిప్రాయం ఉన్న ఒక మనిషి తాత్కాలిక సుఖం కోసం త‌ప్పు చేయాల‌ని అనుకొని, అది త‌ప్పు అని తెలుసుకొని, అందులోంచి బ‌య‌ప ప‌డ‌డానికి అతనుప‌డిన పాట్లు, ఆ క్రమంలో తనకి తాను కొన్ని సత్యాలని తెలుసుకొనే క్రమం లో పుట్టిందే ఈ మన ఊరి రామాయణం క‌థ‌.

     హార్ట్ ట‌చింగ్ ఫినిష్:

    హార్ట్ ట‌చింగ్ ఫినిష్:


    చిన్న పాయింట్ కి కాస్త వినోదం, థ్రిల్లింగ్ అంశాలు జోడించి చివ‌రికి హార్ట్ ట‌చింగ్ ఫినిష్ తో మనల్ని కట్టి పడేసే సినిమా గా మార్చటం లో పూర్తి సక్సెస్ అయ్యాడు ద్ఫర్శకుడు. ఇది మళయాల రీమేక్ అయినా ఎక్కడా ఆ చాయలు కనిపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఇక వినోదం కోసం ఫృద్వీ చేసిన "గ‌రుడ‌" క్యారెక్ట‌ర్ క‌థ‌లో ఉంటూనే వినోదం పండిస్తుంటుంది. డైలాగుల్లో పంచ్ లేక‌పోయినా, ఆయా సంభాషణలని నిజాయితీగా మలిచటం తో పాటు వాటిని పలికిన ఫృద్వీ స్టైల్ క‌ల‌సి ఆయా సంభాష‌ణ‌ల్ని పండించాయి.

     ఎక్కువ స‌మ‌యం తీసుకొన్నాడు:

    ఎక్కువ స‌మ‌యం తీసుకొన్నాడు:


    పాత్రల స్వభావాలతో సహా చూపించాలన్న ప్రయత్నమే కాస్త సాగదీత ఎక్కువ అయ్యింది .పాత్ర‌ల ప‌రిచ‌యానికి ద‌ర్శ‌కుడు ఎక్కువ స‌మ‌యం తీసుకొన్నాడు. అయితే వాటిని ముగించిన విధానం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రియ‌మ‌ణి, ఫృథ్వీ క్యారెక్ట‌ర్ల‌కు స‌రైన జ‌స్టిఫికేష‌న్ చేస్తే బాగుండేది. భుజంగం మారాడా, లేదా? అనేదీ క్లారిటీగా చూపించ‌లేదు. తొలి స‌గంతో పోలిస్తే ద్వితీయార్థం నెమ్మ‌దిగా సాగిన‌ట్టు, సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంది. ప‌తాక సన్నివేశంలో ద‌ర్శ‌కుడు చూపించాల‌నుకొన్న ఫీల్ ఎంత మందికి అర్థం అవుతుందో? ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. దాన్ని ఎండ్ టైటిల్స్‌లో వాడారు.

     ఏమార్కూ పడని యాక్టర్:

    ఏమార్కూ పడని యాక్టర్:


    ఈ సినిమాకు మొట్తమొదటి మేజర్ ప్లస్ పాయింట్ ప్రకాష్ రాజ్ నటన. అంత:పురం లో ఒకప్పుడు నరసింహం గా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ఈ నటుడు కేవలం ఏమార్కూ పడని యాక్టర్ గా ఎలా ఉందగలిగాడో ఈ పాత్ర లో ప్రకాశ్ రాజ్ నటన చూసి చెప్పేయవచ్చు. ముఖ్యంగా తన పరువును కాపాడుకునే వ్యక్తిత్వం గల పాత్రలో అధ్బుతమైన నటనను పండించారు. వేశ్య పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. ప్రియమణి-ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి.

     క్లారిటీ లేదు:

    క్లారిటీ లేదు:

    అయితే పాయింట్ చిన్నది కావటం తో సినిమాలో కొన్ని సీన్లు సాగతీసినట్టుగా అనిపిస్తాయి. చివరలో కొన్ని విషయాల మీద ఒక క్లారిటీకి వచ్చిన భుజంగ రావు పాత్ర మారిపోతుంది. చివర్లో భుజంగం మనస్తత్వం మారిపోతుంది కూతురిని బాగా చదువుకోమంటాడు. ఇంట్లో భార్యపై కోపం చూపించడు. కానీ శివకు పాస్‌పోర్ట్‌ ఇప్పించే ప్రయత్నం ఏ మాత్రం చేశాడనే దానిపై ,... భుజంగం కూతురుకి, భుజంగం రూంలో లాక్‌ అయిపోయాడనే సంగతి ఎలా తెలుస్తుందనే దానిపై కూడా క్లారిటీ లేదు.

     సినిమాకు ప్రాణం:

    సినిమాకు ప్రాణం:


    ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నించే దర్శకుడి పాత్రలో పృద్వీ బాగా నటించాడు. ఆటో డ్రైవర్ శివ పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. దర్శకుడిగా ప్రకాష్ రాజ్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. సింపుల్ స్టొరీ లైన్ కు అద్భుతమైన స్క్రీన్ ప్లేను డిజైన్ చేసి ప్రకాష్ రాజ్ అధ్బుతంగా ప్రజెంట్ చేశారు. అలాగే దర్శకుడిగా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకొని, ప్రకాష్ రాజ్ మరో మెట్టు ఎదిగాడని చెప్పుకోవచ్చు. ప్రముఖ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన పాటలు, రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

     సినిమా చూడవచ్చు:

    సినిమా చూడవచ్చు:


    మాస్‌ ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా అనేది పక్కనపెడితే, ఇష్టంతో కూర్చుంటే ఫలితం ఓకే. పిల్లలకు చదువెలా ఉందనే దానిపై ‘ధోని' మూవీ, ఓల్డేజ్‌ లవ్‌ అనే కాన్సెప్ట్‌‌లో ‘ఉలవచారు బిర్యాని' తెరకెక్కించిన ప్రకాష్‌‌రాజ్‌.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉండాలనే ఎమోషనల్‌ పంథాలో ‘మనవూరి రామాయణం' ద్వారా చెప్పాడు. ఇది పూర్తిగా ప్రకాష్‌రాజ్ ‘మనవూరి రామాయణం'. ఇప్పుడున్న కమర్షియల్‌ ఫార్ములాకి భిన్నంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు చక్కగా పూర్తి సంతృప్తి తో టికెట్ కొనుక్కొని ఈ సినిమా చూడవచ్చు. పెట్టిన ప్రతీ పైసాకీ న్యాయం చేసాడు ప్రకాశ్ రాజ్..

    English summary
    As the film Mana Oori Ramayanam does not belong to either the commercial or art cinema zone But such interesting subjects made with a very honest and decent approach should be Deserve appreciation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X