twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ ఆటే కానీ... ('దొంగాట' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    క్రైమ్ కామెడీలు టాలీవుడ్ కు కొత్తేమీ కాదు దాంతో...వాటి ప్రెజంటేషనే ఎప్పటికప్పుడు మనల్ని సినిమా చివరి దాకా కూర్చోబెట్టగలుగుతుందా లేదా అనేదే ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్ క్రైమ్ కామెడీ 'మనీ' తరహాలో కిడ్నాప్ డ్రామా ఎత్తుకున్నప్పుడు కథ కన్నా కథనం చాలా ఇంపార్టెంట్. 'దొంగాట' కి అదే సరిగ్గా కుదరలేదనిపించింది. సినిమా బాగానే ఉంది కానీ... ఫస్టాఫ్ ని ఎవరైనా కిడ్నాప్ చేసి,ఎంత డబ్బులు ఇచ్చినా వదలకుండా ఉంటే బాగుండునిని అనిపించింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ క్రైమ్ కామెడీలో సరపడిన క్రైమ్ ఉంది కానీ కావాల్సినంత కామెడీ మాత్రం లేదు .

    అప్పటికీ దర్శకుడు ప్రతీ సీన్ లోనూ, ప్రతీ డైలాగులోనూ, ఇంకా చెప్పాలంటే ప్రతీ ఎక్సప్రెషన్ లోనూ కామెడీ పండిద్దామని కృషి చేసాడు. దీన్ని భర్తీ చేయాలనకున్నారో ఏమో సెంటిమెంట్ మాత్రం కాస్త ఎక్కువ డోసే నింపారు. అయితే సినిమాకు యుఎస్ పి గా పెట్టుకున్న స్టోరీ పాయింట్ చాలా చిన్నగా ఉండటం, అది అనుకున్న రేంజిలో పేలలేకపోవటం ఇబ్బందిగా మారింది. కానీ లక్ష్మి మంచు ...ఒకత్తే ఈ సినిమాను అవలీలగా భుజాలపై మోసి...ఓకే అనిపించింది. బ్రహ్మానందం అండతో...ఆకట్టుకునేలా డిజైన్ చేసిన క్లైమాక్స్ తో డైరక్టర్ ఆమెకు సహకరించి సినిమాని గట్టిక్కించాడు దర్శకుడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Manchu Laxmi's Dongata movie  review

    వెంకట్ (అడవి శేషు), విజ్జు (మధు), కాటంరాజు (ప్రబాకర్) కలిసి ... స్టార్ హీరోయిన్ శృతి(మంచు లక్ష్మి)ని కిడ్నాప్ చేసి సెటిలైపోవాలనుకుంటారు. కిడ్నాప్ వరకూ విజయవంతంగా చేసి, ఆమె తల్లి (పవిత్ర) నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా...మధు బాస్... అయిన బ్రహ్మీ (బ్రహ్మానందం) ఇంటిలో ఆమెను సేఫ్ గా పెడతారు. బ్రహ్మీ యుఎస్ ఎ లో ఉంటూంటాడు. అనుకోని విధంగా...బ్రహ్మీ... ప్రెవేట్ డిటెక్టివ్ గా ఎంట్రీ ఇచ్చి... ఈ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి రంగంలోకి దిగుతాడు. ఎప్పుడైతే తన ఇంట్లోనే శృతి ని దాచారని బ్రహ్మికి తెలుస్తుందో అప్పటినుంచే సమస్యలు మొదలవుతాయి. దాంతో ఆ కిడ్నాప్ డ్రామా వీరు అనుకున్నట్లుగా సాగదు. అనుకోని అవాంతరాలు వస్తాయి. తర్వాత ఏమైంది. అసలు కథలో దాగి ఉన్న ఇంకో ట్విస్ట్ ఏమటి...మిగతా కథ.

    సెంకండాఫ్ , క్లైమాక్సే సినిమాకు ప్రాణం అనేది సినీ జీవులు ఎవరూ కాదనిలేని సత్యం. అయితే అక్కడిదాకా జనం ఉండాలి కదా అంటే...ఫస్టాఫ్ బాగుండాలి కదా .. అప్పుడే ..ఇంటర్వెల్ తర్వాత జనం థియోటర్ లోపలకు ధైర్యంగా రాగలగుతారు. అలా కాకుండా... ఎలాగో టిక్కెట్ కొనుక్కుని థియోటర్ కు వచ్చిన వాడు మధ్యలో ఎక్కడికి పోతాడులే అని అంతా సెకండాఫ్ కు ట్విస్ట్ లు , కీలకమైన ఎలిమెంట్స్ దాచి పెట్టుకునే రోజులు పోయాయి. ఎక్కడ సినిమా బాగోపోతే అక్కడే ప్రేక్షకుడు డిస్ కనెక్టు అయ్యి... టైమ్ సేవ్ చేసుకునేందుకు బయిటకు వెళ్లి తన పనులు చేసుకోవటమో, లేక నిద్రపోవటమో, సెల్ లో గేమ్ లు ఆడుకోవటమో చేస్తున్నాడు. అలాంటి పరిస్ధితుల్లో స్క్రిప్టుని చాలా పగడ్బందీగా అల్లాలి. అందుకోసం స్క్రిప్టు లో కాస్తంక సెంటిమెంట్ ని తగ్గించుకుని, కామెడీని పెంచి, ఫస్టాఫ్ లోనూ కాస్తంక కథ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే బాగుండేది.

    Manchu Laxmi's Dongata movie  review

    కొత్త దర్శకుడు అక్కడక్కడా తడబడ్డా...కేవలం లక్ష్మీ మంచు ని మాత్రమే ఎంచుకుని ఆమె చుట్టూ కథ అల్లి ,మెప్పించాలనే ప్రయత్నం మాత్రం హర్షింపదగినదే. అది కూడా జనాలకు నచ్చేలా ఆమెతో ఎలా చేయించవచ్చు...ఏ కథ ఎంచుకోవచ్చు ..ఏ పాత్ర అయితే బెస్ట్ అనే సరైన అవగాహనతోనే వచ్చాడు. దాంతో మినిమం బడ్జెట్ లో మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. మంచు లక్ష్మి కూడా తన పరిచయాలతో ..సినిమాకు గ్లామర్ అద్దే ప్రయత్నం(స్టార్స్ తో పాట, రానా గెస్ట్ రోల్) చేసి, దర్శకుడుకు సహకరించి, సినిమాకు ప్లస్ అయ్యేలా చూసింది. అక్కడి దాకా ఆమె నిర్మాతగానూ సూపర్ సక్సెసే.

    ఈ సినిమాలో మరో గొప్ప విషయం ఏమిటంటే కథ కోసం ఇంటర్వెల్ దాకా సెటప్ చేయకుండా పది నిముషాల్లోనే విషయం ఇదీ అని చెప్పేయటం. అలాగే...సెకండాఫ్ దాకా బ్రహ్మానందాన్ని దాచి పెట్టకుండా ఫస్టాప్ లోనే రివిల్ చేసేసి వాడుకోవటం. అంతేకాకుండా ఏసీపి కనకాంబరంగా ...ధర్టీన్ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ కి కూడా మంచి పాత్ర ఇచ్చి నవ్వులు పుట్టించటం, అడవి శేష్ లోని మరో యాంగిల్ ని చూపించే ప్రయత్నం చేయటం ఇలా చాలా చేసాడు. అలాగే టెక్నిషియన్స్ నుంచి కూడా మంచి అవుట్ ఫుట్ లాగాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ మాత్రం మరింత జాగ్రత్తగా చేయించుకుని ఉంటే బాగుండేది. సెంటిమెంట్ తో వచ్చే సాంగ్ ని తీసేయటం.. బోరింగ్ సాగుతున్న ఫీలింగ్ వచ్చే అవసరం లేని సీన్స్ ని(ముఖ్యంగా అన్నపూర్ణ, గిరిబాబువి) లేపేయటం చేస్తే బాగుండేది. అలాగే కేవలం బ్రహ్మానందం మీదే కాకుండా మిగతా వారి చుట్టూ కామెడీ అల్లి ఫన్ ఎలివేట్ అయ్యేలా చేయటం. డైలాగులు బాగున్నాయి. మంచి లక్ష్మి ఫెరఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు.

    Manchu Laxmi's Dongata movie  review

    ఫైనల్ గా ...వర్మ గత క్రైమ్ కామెడీలను గుర్తు చేసే ఈ సినిమా....ట్రైలర్ లో ఉన్నంత కిక్ ఇవ్వకపోవచ్చు కానీ...బ్రహ్మానందం నవ్వులతో, కొద్దిపాటి థ్రిల్స్,ట్విస్ట్ లతో బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగులో హీరోలు చాలా మంది కలిసి చేసిన సాంగ్ కోసం కూడా ఓ లుక్కేయచ్చు...(టీవిల్లో,టీజర్లలలో చూసేసాం అంటే చేసేదేమీ లేదు). ఈ వేసవిలో థియేటర్ కు కేవలం ఏసి కోసమే కాకుండా కాస్సేపు ఎంగేజ్ అవటానికి కూడా ఈ సినిమాని ఫ్రిఫర్ చేయవచ్చు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    బ్యానర్: మంచు ఎంటర్ టైన్ మెంట్
    నటీనటులు: మంచు లక్ష్మీ ప్రసన్న, అడివి శేష్‌, మధు నందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం తదితరులు
    మాటలు :సాయి మాధవ్ బుర్రా
    సంగీతం: సత్య మహావీర్‌, రఘు కుంచె, సాయికార్తీక్‌.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :ఎన్‌.వంశీకృష్ణ
    నిర్మాత: మంచు లక్ష్మి
    సమర్పణ :విద్యానిర్వాణ
    విడుదల తేదీ: 08, మే 2015 (శుక్రవారం)

    English summary
    Manchu Lakshmi's latest Donagta released today with ok talk. She plays an action heroine in the film and her fight scenes appear pretty natural since she has taken a special training in stunts and kick boxing prior to the film. Lakshmi earned some brownie points with her comic timing though she has to improve a lot on her Telugu diction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X