twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓల్టేజ్ డ్రాప్... ('కరెంట్‌ తీగ' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    సాధారణంగా రీమేక్ చేసేటప్పుడు ఒరిజనల్ కథని మరింత బూస్ట్ చేయటానికి ప్రయత్నిస్తారు. అదేంటో ఈ చిత్రంలో రివర్స్ లో ఉన్న దాన్ని చెడకొట్టిన ఫీలింగ్ వస్తుంది. లైటర్ వీన్ లో నడిచే తమిళ చిత్రం ‘వరుత్తపడాద వాలిబర్‌ సంగం' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో హీరోయిజం పెంచటానికి చేసిన అనవసర ప్రయత్నాలే విసుగు తెప్పిస్తాయి. సంభంధం లేని విలన్ ట్రాక్ ని కలిపి.. సింపుల్ గా ఉన్న ఒరిజనల్ కథని కాంప్లికేట్ చేసినట్లు అనిపిస్తుంది. అసలే థిన్ లైన్ ...దాన్ని హీరోయిన్ ని ఎక్సపోజ్ చేయించటం, హీరో కి ఫైట్స్ పెట్టడం వంటి వాటితో మాస్ మాసాలా చేద్దామని ఏదేదో చేసేసారు. అయితే మంచు మనోజ్ మాత్రం తన ఎనర్జీని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా గతంలో ఉన్న తన లోపాలు దిద్దుకుని టోన్ ని,బాడీని ఒకే రిధమ్ లో ఉంచుతూ సీన్స్ లో నటిస్తూ స్క్రీన్ ప్రెజెన్స్ ని రక్తికట్టించాడు. దర్శకుడుగా మాత్రం నాగేశ్వరరెడ్డి బాగా నిరాశపరిచాడు. ఆయన నుంచి ఎక్సపెక్ట్ చేసే కామెడీ ఈ సినిమా కాగడా పెట్టి వెతికినా కనపడదు. చాలా ప్రెడిక్టుబుల్ ప్రేమ కథను..మరింత ప్రెడిక్టుబల్ సీన్స్ తో అలా అలా నడింపించేసారు. ఉన్నంతలో ఫస్టాఫ్ ఓకే అనిపించినా, సెకండాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ బాగా నీరసంగా ఉండి...చూసేవారికీ అదే ఫీల్ తీసుకువచ్చేయి. మనోజ్ దృష్టి మొత్తం ఫైట్స్ మీదే పెట్టినట్లున్నాడు...అవి మాత్రం బాగా కుదిరాయి. ట్విస్ట్ ఏమిటంటే..క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగతా ఫైట్స్ అన్నీ క్లైమాక్స్ లాగ ఉంటాయి.

    చదువుకుని ఆవారాగా తిరిగే రాజు(మంచు మనోజ్) తన ఊళ్లో ఉండే లెక్చరర్ సన్ని (సన్నిలియోన్)కి లైన్ వేస్తూంటాడు. అందుకోసం అదే కాలేజీలో చదువుతూ సన్ని స్టూడెంట్ అయిన కవిత(రకుల్ ప్రీతి సింగ్)ని కొరియర్ లాగ వాడుకోవాలని చూస్తాడు. అయితే సన్ని ఓ రోజు తన వెడ్డింగ్ కార్డుతో షాక్ ఇస్తే నిరాశపడిన అతనికి కవిత రూపంలో అతనికి నిజమైన ప్రేమ కనిపిస్తుంది. ఆమె వెనక పడి ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అంతేకాక అప్పటికే సెటిలైన ఆమెకు ఇష్టంలేని వివాహం చెడకొట్టి...ఆమెని పడేస్తాడు. అయితే కవిత తండ్రి, ఆ ఊరి పెద్ద మనిషి, ఎప్పుడూ తుపాకి పట్టుకుని తిరిగే... శివరామరాజు(జగపతిబాబు)కు రాజు అంటే పడదు. తన కూతురుని రాజు ప్రేమలో పడిందని తెలిసిన శివరామరాజు ఎలా రియాక్టయాడు...రాజు అప్పుడేం చేసి తన ప్రేమను గెలిపించుకున్నాడనేది మిగతా కథ.

    ప్రేమించిన అమ్మాయి తండ్రి గన్ పట్టుకుని గరుత్ముంతుడులా ఎప్పుడూ తన వెనకే తిరుతూంటే...అప్పుడు ఆ ప్రేమికుడు పరిస్ధితి ఏమిటి ...అనే సింపుల్ లైన్ తో వచ్చిన ఈ సినిమా అంతే సింపుల్ గా ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడికక్కడి సీన్స్ తోటే తమిళంలో డీల్ చేసారు. అలాగే అక్కడ బాగా వర్కవుట్ అయ్యింది... బేవార్స్ గా తిరిగే హీరో స్ధాపించే సంఘం చుట్టూ తిరిగే కథనం. (అందుకే అక్కడ టైటిల్ సైతం ‘వరుత్తపడాద వాలిబర్‌ సంగం' అని పెట్టారు) అయితే తెలుగులో ఆ సంఘం అనే కాన్సెప్టుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు..అసలు ఎస్టాబ్లిష్ చేయలేదు ..కానీ తమిళ సీన్స్ యాజటీజ్ వాడటంతో కీలకమైన మలుపులు వద్ద సంఘం ప్రస్దావన వస్తుంది...అలాంటప్పుడు మధ్యలో ఈ సంఘం గోలేంటి అనిపిస్తుంది. ఇక తెలుగులో హీరోయిజం లేపటానికి ప్రక్కనుంచి విలన్ ని తీసుకొచ్చి(తమిళంలో లేదు) ఫైట్స్ పెట్టారు కానీ...కథలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్...జగపతిబాబు వైపు నుంచి కాంప్లిక్ట్ తీసుకోలేదు. దాంతో హీరో పక్కా ప్యాసివ్ క్యారెక్టర్ గా హీరో మిగిలిపోయాడు. అదే తమిళంలోకి వచ్చేసరికి అక్కడ హీరోయిజం కి తాపత్రయపడలేదు కాబట్టి...యాక్టివ్,ప్యాసివ్ సమస్య రాలేదు. ఇది స్వయంగా స్క్రిప్టులో కొని తెచ్చుకున్న సమస్యే.

    అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగు విలేజ్ లు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అది దర్శకుడు గుర్తించినట్లు లేరు. అక్కడ కూడా టెక్నాలిజీ బాగా దూసుకువచ్చేసింది. అది గమనించకుండా ఇంకా ఎనభైలు,తొంభైల నాటి విలేజ్ నే చూపెట్టడానికి ప్రయత్నం చేసారు. దాంతో కనెక్టు అవటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే...జగపతిబాబు పాత్రను సైతం తమిళంలో సత్యరాజ్ ని యాజటీజ్ అనుకరించినట్లు చేయించారు కాని మన నేటివిటీ టచ్ ఇవ్వలేదు. అలాగే హీరోయిన్ పాత్ర కాలేజీకు వేసుకుళ్లే డ్రస్ చూస్తే మనకు ఆమె ఏ ఏడవ తరగతో లేదో తొమ్మిదో తరగతో చదువుతున్నట్లు డౌట్ వస్తుంది కానీ కాలేజీకు వెళ్తున్నట్లు అనిపించదు. అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

    స్లైడ్ షో లో మిగతా రివ్యూ...

    హైలెట్ ..

    హైలెట్ ..

    రీసెంట్ గా లౌక్యం సినిమాలో అదరకొట్టిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఈ సినిమాలోనూ బాగా నవ్వించారు. దాదాపు నాలుగు సార్లు వ్చచే ప్రతి ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది.

    సన్నిలియోన్, సంపూర్ణేష్ బాబు

    సన్నిలియోన్, సంపూర్ణేష్ బాబు

    ఈ సినిమా ప్రారంభం నుంచి సన్నిలియోన్ గురించి ఊదరకొట్టారు. అయితే సినిమాలో ఓ పాటలో హాట్ గా కనిపించినా పబ్లిసిటీ చేసినంత సీన్ లేదనే చెప్పాలి. ఇక ఆమె ఉడ్ బి గా చేసిన సంపూర్ణేష్ బాబు ఉన్నది కొద్ది క్షణాలే కానీ..హృదయం కాలేయం డైలాగులు చెప్పి నవ్వించారు.

    వాడుకోలేదు

    వాడుకోలేదు

    సినిమాలో సీజనల్ కమిడియన్స్ వెన్నెల కిషోర్, ధన్ రాజు, తాగుబోతు రమేష్ లను పెట్టుకున్నారు కానీ వారిని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. వారిచేత చేయించిన కామెడీ పెద్దగా పేలలేదు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    ఈ చిత్రం టెక్నికల్ గా అంటే కెమెరా పరంగా బాగుంది. విలేజ్ ఎట్మాస్ఫియర్ ని బాగానే క్రియేట్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో ఉన్నంత షార్ప్ ..సెకండాఫ్ లో మిస్సైంది. అయితే అందుకు తగ్గ సీన్స్ కూడా లేవు. కాబట్టి ఆ విభాగాన్ని కూడా అనటానికి లేదు. డైలాగులు ఓకే..కొన్ని బాగానే పేలినా...మిగతావి సోసోగా ఉన్నాయి.

    దర్శకత్వం...

    దర్శకత్వం...

    దర్శకుడుగా నాగేశ్వరరెడ్డి కెరీర్ మొదటి నుంచీ కామెడీ కి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అయితే ఇందులో ఎందుకో ఆయన మ్యాజిక్ మిస్సైంది. అలాగే స్క్రిప్టు కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా ఉంది. దానికి అల్లుకున్న స్క్రీన్ ప్లే సైతం చాలా ప్లాట్ గా ఉండటం మరో మైనస్. అయితే కొన్ని సీన్స్ లో ఒరిజనల్ తమిళ సినిమా కన్నా మంచి ఫెరఫార్మెన్స్ లు హీరో,హీరోయిన్స్ నుంచి తీసుకున్నారు.

    హీరో,హీరోయిన్స్ ఎలా..

    హీరో,హీరోయిన్స్ ఎలా..

    మంచు మనోజ్...ఎప్పుడు ఏదో ఒకటి విభిన్నంగా చేసి గుర్తింపు పొందాలని చూస్తూంటాడు. అది ఈ సినిమాలోనూ కనపడుతుంది. అయితే రొటీన్ స్టోరీ లైన్ అతనికి పెద్దగా అతనికా అవకాసం ఇవ్వలేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే..ఆమె గత రెండు చిత్రాలు కన్నా ఇందులో చాలా మెరుగైన ఫెరపార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి.

    అనవసరం..

    అనవసరం..

    సినిమాలో ప్రముఖంగా కనపడేవి సినిమాకు సంభంధం లేని కొన్ని అనవసర పాత్రలు, అలాగే హీరో చేత అనవసరంగా చెప్పించే అడల్ట్ కంటెంట్ డైలాగులు, కథకు పొరపాటున కూడా సంభంధం లేని ఫైట్స్.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
    నటీనటులు: మంచు మనోజ్, రకుల్ ప్రీతి సింగ్, సన్నిలియోన్, జగపతిబాబు, సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు
    కెమెరా: సతీష్ ముత్యాల,
    మాటలు:కిశోర్ తిరుమల,
    ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్,
    పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి,
    నిర్మాత:విష్ణు మంచు,
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.
    సమర్పణ: డా.ఎమ్.మోహన్ బాబు
    విడుదల తేదీ: 31, అక్టోబర్ 2014.

    ఫైనల్ గా ...ఈ మాత్రం కథ కోసం తమిళంకి వెళ్ళాలా అనే డౌట్ రావచ్చు... అది ప్రక్కన పెడితే...ఈ చిత్రం తమిళ ఒరిజనల్ చూడని వారికి ఫరవాలేదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ కామెడీని బాగాఎంజాయ్ చేసాం కదా పోనీలే అని సెకండాఫ్ ని క్షమించేస్తే సినిమా బాగుందనిపిస్తుంది. అలాగే ఫైట్స్ ఇష్టపడేవారిని కూడా అలరింపచేస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Current Teega is a remake verison of Tamil movie Varutha Padatha Valibar Sangam released today with divide talk. Manoj Manchu and Rakul Preet Singh playing the main lead roles along with Jagapati Babu in yet another powerfull role. Bollywood actress Sunny Leone playing a special role as school teacher in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X