twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సలీం'..దుమ్ము కొట్టాడు (రివ్యూ)

    By Srikanya
    |
    Saleem
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌-రిలయన్స్‌ బిగ్‌ పిక్చర్స్‌
    నటీనటులు: విష్ణువర్ధన్‌ బాబు, ఇలియానా, మోహన్‌ బాబు, కావేరీ ఝా, వెంకట్‌,
    నెపోలియన్‌, గిరిబాబు, అలీ, జయప్రకాష్‌ రెడ్డి, ప్రగతి, హేమ తదితరులు.
    డైలాగులు: చింతపల్లి రమణ
    స్టోరీ డవలప్ మెంట్: గోపీ మోహన్, బివియస్ రవి
    ఆర్ట్: ఆనంద సాయి
    కెమెరా: సి.రామ్ ప్రసాద్
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    సంగీతం: సందీప్‌ చౌతా
    నిర్మాత: మోహన్‌బాబు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వైవీఎస్‌ చౌదరి
    రిలీజ్ డేట్: డిసెంబర్ 12,2009

    హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు..కానీ ఆ అమ్మాయి వేరే కుర్రాడుని ప్రేమిస్తుంది..అయినా మన హీరో డ్రాప్ అవక నా ప్రేమ గొడవ నాదే..నీది నీదే అని ఆమె వెంటబడి తిరిగి చివరకి ఆమె ప్రేమించిన వాడు సరైన వాడు కాదని డిసైడ్ అయ్యి తిరిగి వచ్చే దాకా కధ నడుపుతాడు. ఆర్య నుంచి ఆర్య-2 దాకా ఇంకా గట్టిగా చెప్పాలంటే నిన్న రిలీజైన వాడే కావాలి వరకూ ఇలాంటి కథలు కోకొల్లలు. తాజాగా అదే ఫార్మేట్ లో వచ్చిన మరో చిత్రం సలీం. అయితే కథ తెలిసున్నదే కదా కథనంలో ట్విస్టులు పెడదామనే ఉత్సాహం కొద్దీ పూర్తి స్ధాయిలో గ్రిప్ కోల్పోయి బోల్తా పడ్డారు. వైవియస్ చౌదరి గత చిత్రం ఒక్క మగాడుకు పోటీగా తయారై రిలీజైంది. ఇక కొద్దోగొప్పో చివరి వరకూ జనం భరించారంటే ఆ క్రెడిట్ ఇలియానాదే అని చెప్పాలి. ఆమె అందచందాలు చూపటమే లక్ష్యమన్నట్లు చాలా చోట్ల సాగింది.

    యూరప్ నుంచి లాంగ్ గ్యాప్ లో స్వదేశానికి వస్తున్న సత్య(ఇలియానా)ని ఫ్యామలీ రైవల్స్ నుంచి మున్నా(విష్ణు) కాపాడతాడు.దాంతో నిన్నే పెళ్లాడతా తరహాలో ఉన్న ఆమె కుటుంబం మున్నాని తమ ఇంటిలో పెట్టుకుంటుంది. రెగ్యులర్ గానే సత్యతో మున్నా లవ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. మొదటి ఒప్పుకోకున్నా ఆ తర్వాత ఆమె ప్రేమలో పడి అతని వెంటబడుతుంది. అలా కొన్ని రీళ్ళు పాటలు,ఫైట్స్ అయ్యాక మున్నాతో ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ సమయంలోనే ఆమె తన బోయ్ ప్రెండ్ క్రిష్ (వెంకట్)ని ఇండియా రప్పించుకుని జంప్ అయిపోతుంది. ఇంతకీ హఠాత్తుగా ఊడిపడ్డ క్రిష్ ఎవరూ అంటే అతను యూరప్ లో ఉన్న ఓజో(మోహన్ బాబు)అనే పెద్ద డాన్ తమ్ముడు. ఇలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో మున్నా ఏం చేసాడు..సత్యను తిరిగి తన వైపుకు తిప్పుకుని ఇండియా ఎలా తెచ్చాడనేది మిగతా కథ.

    పోస్టర్స్ పై మోహన్ బాబుని చూడటంతో ఆయన పాత్ర డాన్ గా హీరోకు ఎదురు నిలబడి అదరకొడతుంది అని ఆశించి వెళతాం. అయితే సెకెండాఫ్ లో వచ్చే మోహన్ బాబు క్యారెక్టర్ కు అంత సీనుండదు. హిందీ చిత్రం తషాన్ నుంచి లిప్ట్ చేసిన అనిల్ కపూర్ ట్రాక్ దర్శనమిస్తుంది. కావేరీ ఝా అనే కుర్ర టీచర్ ని ఇంగ్లీష్ నేర్పటానికి పెట్టుకుని ఆమె ప్రేమలో మునిగితేలే పాత్ర ఇది. కథకూ,ఈ పాత్రకూ ఎక్కడా లింక్ ఉండదు.అలాగని కామిడీకీ పనికిరాదు. చివరలో అంత పెద్ద డాన్ కి ప్రేమ గొప్పతనం చెప్పటానికి అతన్నీ ప్రేమలో దించే స్కీమ్ ఇది అని తేల్చేసారు. అలాగే విష్ణు లావు తగ్గిన తర్వాత కన్నా ముందే బాగున్నాడని ఈ చిత్రంలో చూసిన వారంతా ఏకగ్రీవంగా అంటున్నమాట. మరి వైవియస్ చౌదరి దర్శకత్వ పనితనం లేదా అంటే సినిమా మొత్తం ఇలియానా బొడ్డుని ఎక్సపోజ్ చేయటం మీదే కాన్సర్టేషన్ ఉంది. వీటికి తోడు మోహన్ బాబు,కావేరీ ఝా ల మధ్య ఓ రీమిక్స్ సాంగ్ వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క అలీ ..గఫర్ ఖాన్ ..కొరియోగ్రాఫర్ అంటూ నవ్వించే ప్రయత్నం చేస్తూంటాడు.అన్నటితో పాటు పంచ్ లు పేలని డైలాగులు, ఆకట్టుకోని పాటలు వెంబడిస్తూంటాయి. అయితే కెమెరా పనితనం బావుంది.

    కథ విషయానికి వస్తే హిందీ నమస్తే లండన్ నుంచి ఎత్తారా అన్నట్లున్నా ఇలాంటి కథలు మనకి కొత్తేం కాదు. మొన్నా మధ్య అల్లరి రవిబాబు సోగ్గాడు నుంచి నిన్న వాడే కావాలి దాకా ఇదే కాన్సెప్టు. అయితే ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ మెయింటైన్ చేసే ప్రాసెస్ లో హీరో ఐడెంటటీ దొరకకుండా చేసారు.దాంతో హీరోయిన్ ని చూసీ చూడగానే ఐలవ్ యూ అని చెప్పటం వంటివి చాలా విచిత్రంగా అనిపించాయి. అలాగే ఇంటర్వెల్ వరకూ ట్విస్ట్(ఇలియానాకు బోయ్ ప్రెండ్ ఉన్నాడని) రివిల్ చేయలేదు. దాంతో ఇంటర్వెల్ వరకూ ఏ కాంప్లిక్టూ లేకుండా సాఫీగా జరిగి బోర్ గా తయారైంది. పోనీ ఇంటర్వెల్ తర్వాత ఆమె ..హీరో వైపు తలొగ్గటానికి అనుకున్న సీన్స్ అయినా ఫెరఫెక్టుగా అనుకోలేదు. అదే నమస్తే లండన్ లో అయితే హీరో పాత్ర..అమాయికత్వం కలగలపి ఉండటంతో అతనిపై జాలి కలిగి అతని ప్రేమ సక్సెస్ కావాలనిపిస్తుంది. అదే సలీం దగ్గరకు వచ్చేసరికి హీరో పాత్ర యూరప్ లో ఓ మాఫియా వ్యక్తి అని రివల్ అవగానే ఆశ్చర్యం వేస్తుంది. మాఫియా వాళ్ళు ఇలా ప్రేమకోసం ఇండియా వచ్చేసి పనులన్నీ మానుకుని డ్రామాలు అడతారా అనే డౌట్ వచ్చేస్తుంది.

    ఫైనల్ గా ఈ సినిమా కేవలం ఇలియానా కోసం చూడాలంతే. అయితే ఆమె కోసం అనవసర సన్నివేశాలన్నీ భరించాలంటే కష్టమనిపిస్తుందనేది వేరే సంగతి.ఇక శ్రీవారు మావారు(1973) చిత్రంలోని పూలు గుసగుస లాడేనని..సాంగ్ రీమిక్స్ చేసి మోహన్ బాబు,కావేరీ ఝా మీద చిత్రీకరించారు. అయితే ఆ పాట పేలలేదు. అదే ఏ పాత మోహన్ బాబు సూపర్ హిట్ సాంగో రీమిక్స్ చేసుంటే ఆయన అభిమానలుకు మరింత ఆనందం అనిపించేది. ఏదైమైనా దాదాపు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా అంతే స్ధాయిలో భారీగా తలనొప్పిని కలిగిస్తుంది.మొత్తానికి సలీం దుమ్ము రేపలేదు..దుమ్ము కొట్టి పోయాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X