twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిలేరియస్ ... ( 'లవర్స్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    కొన్ని కామెడీ సీన్స్, ఒక కమిడియన్ కరెక్టుగా వర్కవుట్ అవుతే సినిమా హిట్టవుతుందా... అవుతుంది అని మీకు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. కామెడీ ఉంటే చాలు కనకవర్షం అనేది తెలుగు సినిమా ప్రస్తుత పరిస్ధితి. దాన్ని పూర్తిగా అర్దం చేసుకుని మారుతి సినిమాలు చేస్తున్నారు...రాస్తున్నారు(అఫ్ కోర్స్ అవి ఒక్కోసారి వికటిస్తున్నాయనుకోండి) . ముఖ్యంగా కమిడియన్ సప్తగిరి లోని పూర్తి స్టామినాని వాడుకుని చేసిన ఈ చిత్రం సెకండాఫ్ లో మంచి నవ్వులు కురిపించి నిలబెట్టింది. కథ,కథనాలు వంటి మొహమాటాలు పెట్టుకోకండా కేవలం కామెడీనే నమ్ముకుని చేసిన ఈ చిత్రం పైసా వసూల్ గా ఫ్యామిలీలకు అనిపిస్తుంది...కనిపిస్తుంది. హీరో సంగతేమో కానీ సప్తగిరి కి మాత్రం మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం.

    చిత్ర బాల సుబ్రమణ్యం(నందిత) సిగ్నండ్ ప్రాయిడ్ భక్తురాలు....ఆమెకు మగాళ్లంటే పడదు. ఈ కాలం యూత్ సైజాలజి బాగా తెలుసు అని నమ్ముతూ, అబ్బాయిలకు ప్లర్ట్ చేయటం తప్ప...ప్రేమించటం రాదు అని బలంగా నమ్మి , వాటిని తన స్నేహితురాళ్ల ప్రేమలకు అప్లై చేస్తూ సక్సెస్ ఫుల్ గా బ్రేకప్ అప్ చేస్తూంటుంది. అలా ఆ ఓ రెండు ప్రేమ కథలకు బలైపోయిన సిద్దు(సుమంత్ అశ్విన్)ఆమే తన ప్రేమ కథలకు విలన్ అని తెలియక ఆమెను ఓ పట్టులంగాలో చూసి పీకలలోతు ప్రేమలో పడిపోతాడు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న సిద్దు ...ఆడవాళ్ళంటే మండిపడే సప్తగిరి సాయింతో తన ప్రేమ కథను ఎలా సాధించుకున్నాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

    హైలెట్స్

    హైలెట్స్

    ఫస్టాఫ్ లో వచ్చే నల్ల వేణు సీను కామెడీ బాగా పండించింది. అలాగే సాయి లవ్ స్టోరీ...దాన్ని హీరోయిన్ బ్రేక్ చేసే విధానం బాగున్నాయి. సెకండాఫ్ లో మొదటే చెప్పుకున్నట్లుగా...సప్తగిరి భుజాన మోసుకుని వెళ్ళిపోయాడు.

    ప్రేమ కధా చిత్రం ఇంపాక్ట్

    ప్రేమ కధా చిత్రం ఇంపాక్ట్

    మారుతి గత హిట్ చిత్రం ప్రేమ కధా చిత్రమ్ ని గుర్తు చేస్తూ... ఈ చిత్రంలో సప్తగిరి ..హీరోయిన్ ని చూడటం... అప్పటి సీన్స్... ఫ్లాష్ కట్ లో చూపటం హిలేయిస్ గా ఎంజాయ్ చేసేలా చేసాయి. అలాగే విక్రమార్కుడులో ఆడవాళ్లు సీన్ ని మగధీరకు ఎడాప్ట్ చేయటం బాగుంది.

    పాటలు, కెమెరా వర్క్, ఎడిటింగ్

    పాటలు, కెమెరా వర్క్, ఎడిటింగ్

    పాటలు బాగున్నాయి. వాటిని బాగా పిక్చరైజ్ చేసారు. సినిమాలో కెమెరా వర్క్ కూడా ఓ ప్లస్ గామారి, కలర్ ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగా చేసారు. సూటిగా సుత్తి లేకుండా సినిమాని నీట్ గా తీసుకెళ్లటంలో సాయిం చేసింది.

    దర్శకత్వం

    దర్శకత్వం

    మారుతి కథా,కథనాన్ని దర్శకుడు చక్కగా, జనాలుకు నచ్చేలా తెరకెక్కించాడు. కామెడీపై తనకి గ్రిప్ ఉందని, ఎంటర్టైన్మెంట్ సినిమాని హ్యాండిల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

    హీరో,హీరోయిన్స్

    హీరో,హీరోయిన్స్

    ఇద్దరూ చక్కగా ఫెరఫార్మెన్స్ చేసారు. మరో లీడ్ రోల్ లో కనిపించిన చాందిని, తేజస్విని,షామిలి కూడా బాగా చేసారు. బస్టాఫ్ లో తన కామెడీలో పండించిన సాయి ఈ సినిమాలో కూడా అదరకొట్టాడు.

    డైలాగులు

    డైలాగులు

    పంచ్ లు లేకుండా పకపకా నవ్వించే డైలాగులు ఈ సినిమాలో చూడవచ్చు. సింపులు కథ కి చక్కటి స్క్రీన్ ప్లేతో నవ్వించటంలో మారుతి సక్సెస్ అయ్యాడు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    నటీనటులు :సుమంత్‌ అశ్విన్‌, నందిత, షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు
    కెమెరా:మల్హర్ భట్ జోషి,
    సంగీతం:జె.బి.,
    ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి.,
    నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి.,
    కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సమర్పణ:మారుతి,
    రచన, దర్శకత్వం:హరి.
    విడుదల తేది: 15, ఆగస్టు 2014.

    మారుతి బ్రాండ్ సినిమా గా వచ్చిన చిత్రంలో బూతు లేకపోవటం విశేషం. కాబట్టి నవ్వుకోవటానికి కాలక్షేప చిత్రంగా ఫ్యామిలీస్ కు మంచి ఆప్షన్.

    English summary
    
 Sumanth Ashwin has paired up with 'Premakatha Chitram' fame Nanditha for the movie, 'Lovers' released today with positive note. Maruthi has provided the screenplay and dialogues for this movie and Hari is the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X