twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్ఫూర్తిదాయకం...(‘మేరీ కోమ్’ మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    3.0/5
    హైదరాబాద్: ప్రముఖ ఇండియన్ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేరీ కోమ్'. ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా చాలా కష్ట పడింది. మేరీ కోమ్ పాత్రలో జీవించడానికి స్వయంగా బాక్సింగ్ శిక్షణ తీసుకోవడంతో పాటు, మేరీ కోమ్‌తో పాటు కొన్ని రోజులు ఉండి మెళకువలు నేర్చుకుంది. ఓమంగ్ కుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

    కథలోకి వెళితే...
    మణిపూర్ ప్రాంతంలోని పల్లెటూరుకు చెందిన అమ్మాయి మేరీ కోమ్(ప్రియాంక చోప్రా). బాక్సింగ్ అంటే ఆసక్తి. తాను కూడా గొప్ప బాక్సర్ కావాలని, దేశానికి ఒలంపిక్ మెడల్ సాధించాలని కలలు కంటూ ఉంటుంది. బాక్సింగ్ అంటేనే పురుషాధిప్యం ఉన్న క్రీడ. అలాంటి క్రీడలో అమ్మాయిలు ఎంటరవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో ఇటు ఇంట్లో, అటు సమాజంలోని పరిస్థితులు ఆమెను పూర్తిగా నిరాశకు గురి చేస్తాయి. ఆ క్రీడ వైపు వెళ్లడానికి తండ్రి నిరాకరిస్తాడు. తండ్రిని ఎదురించి బాక్సింగ్ రింగులోకి ఎంటరైన తర్వాత ఎన్నో అవామానాలు, ఆటు పోట్లు. చివరకు ఆమె లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది ఈ చిత్రం.

    మేరీ కోమ్ పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నప్రియాంక చోప్రా తాను తప్ప ఆ పాత్ర మరెవరూ చేయలేరు అనేలా అద్భుతంగా నటించింది. దర్వకుడు ఓమంగ్ కుమార్‌కు ఇది తొలి సినిమానే అయినప్పటికీ....ఫర్వాలేదనిపించాడు. కొన్ని సన్నివేశాలను అద్భుతంగా హాండిల్ చేసాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. మేరీకోమ్ జీవితానికి సంబంధించిన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. స్పూర్తి దాయకంగా ఈచిత్రాన్ని మలిచారు. మొత్తం మీద దర్శకుడి పని తీరు ఫర్వాలేదు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా


    ప్రియాంక చోప్రా తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మేరీ కోమ్ పాత్రలో ఆమె నటించింది అనడం కంటే జీవించింది అనడం కరక్ట్. మేరీ కోమ్ లక్ష్య సాధనలో కీలకం అయిన కోచ్ పాత్రలో సునీల్ థాపా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

    టెక్నికల్

    టెక్నికల్


    సాంకేతిక అంశాల పరంగా పరిశీలిస్తే....కీకో నకహర అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత వన్నె తెచ్చింది. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఆయన సినిమాటోగ్రపీ ఉంది. శశి-శివమ్ అందింన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటల్లో జిద్ది దిల్, సలామ్ ఇండియా, తేరీ బారీ ట్రాక్స్ బావున్నాయి.

    కథ, కథనం...

    కథ, కథనం...


    మేరీ కోమ్ కథ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ఎంతో కొంత అందరికీ తెలిసిందే. అయితే స్క్రీన్ ప్లే వేగంగా నడిపించడంలో దర్శకుడ విఫలం అయ్యాడు. దీంతో కొన్ని చోట్ల ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.

    భావోద్వేగాలు..

    భావోద్వేగాలు..


    సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు భావోద్వేగాలను బాగా పండించాడు.

    ఎంటర్టెన్మెంట్ లోపించింది

    ఎంటర్టెన్మెంట్ లోపించింది


    గతంలో ‘మేరీ కోమ్' తరహాలో ‘భాగ్ మిల్ఖా భాగ్' చిత్రాలు వచ్చాయి. అయితే ఆ సినిమాల్లో ప్రేక్షకుడు నిరాశకు గురి కాకుండా వినోద పరమైన అంశాలు యాడ్ చేసారు. అయితే ‘మరీ కోమ్' చిత్రంలో వినోదం లోపించిందనే చెప్పొచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    ఇదొక మంచి స్పూర్తి దాయక సినిమా. ఎంటర్టెన్మెంట్ కోణంలో కాకుండా మన దేశం పేరు నిలబెట్టిన ఒలంపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా ఒక మంచి ఆఫ్షన్.

    English summary
    Priyanka Chopra who has transformed herself into MC Kom on-screen has the never say never attitude . She is the gritty boxer from Manipur who makes her dream into Olympic medal-winning reality!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X