twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో రొటీన్ కథ కోసం.... ('ఒక లైలా కోసం' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    మూస ఎప్పుడూ ప్రమదమే...అయితే ఫార్ములా ఎప్పుడూ సేఫే. ఈ రెండింటికీ చాలా థిన్ లైన్ తేడా ఉంటుందనిపిస్తుంది. అయితే అనవసరమైన రిస్క్ ఎందుకని సేఫ్ జర్నీ కోసం ఫార్ములా లోకి వెళ్ళి రొటీన్, మూస అనిపించుకోవటం చాలా సార్లు జరుగుతూంటూంది. అయితే ఆ ఫార్ములాలోనూ కొత్త పాత్రలు, కొత్త సంఘటనలు, కొత్త ఆలోచనలు జోడిస్తే తిరుగు ఉండదని మన స్టార్ డైరక్టర్స్ మరో ప్రక్క ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోతన గత హిట్ గుండె జారి గల్లంతైంది తరహాలో ప్యూర్ రొమాంటిక్ కామెడీ చేసి హిట్ కొడదామన్న ఐడియాతో పూర్తి రొటీన్ కథ,కథనం తో దిగాడీ దర్శకుడు. ముఖ్యంగా సినిమా విజయానిక కీలకంగా నిలచే సెకండాఫ్ లో సీన్స్ లో ఎమోషన్ మిస్సైంది. క్లైమాక్స సైతం చాలా వీక్ గా ముగించారు. దీనికంతటికీ కారణం ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ ఇమడని అంతకన్నా ప్రెడక్టుబుల్ పాత్రలు...పాయింటాఫ్ ఇంట్రస్ట్ లేని కథనం. అయితే నాగ చైతన్య ఈ చిత్రం హీరో కాబట్టి కొంత లో కొంత ఓకే అనిపిస్తుంది.

    జాబ్ వద్దనుకుని టూర్ కి బయిలు దేరిన కార్తీక్ (నాగ చైతన్య) కి నందన(పూజా హేగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఫిక్సైతాడు కార్తీక్. అయితే ఆమె మాత్రం అతన్ని కొన్ని విచిత్రమరైన పరిస్దితుల్లో అతన్ని దూరం నుంచి చూసి తనకు తాను వేరే విధంగా ఊహించుకని... ద్వేషం పెంచుకుంటుంది. ఇది తెలియని కార్తీక్ తర్వాత లవ్ ప్రపోజ్ చేసి దెబ్బతింటాడు. ఈ లోగా వీరిద్దరి ఇంట్లో వాళ్ళు వీరికి పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తారు. ఆమె పై ప్రేమతో కార్తీక్, తండ్రి మాట కాదనలేక నందన పెళ్ళికి ఒప్పుకుంటారు. అప్పుడు కార్తీక్ ఓ నిర్ణయం తీసుకుంటాడు ఈ పెళ్లి అయ్యేలోగా ఎలాగైనా ఆమెను తన ప్రేమలో పడేయాలని...అలాగే నందన కూడా ఓ నిర్ణయం తీసుకుంటుంది...ఎలగైనా ఈ పెళ్లి ఆపాలి అని...వీరిద్దరిలో ఎవరి ప్రయత్నం ఫలించింది...చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

    విజయవంతమైన రొమాంటిక్ కామెడీలు ప్రపంచవ్యాప్తంగా... కలవటం,విడిపోవటం, పొందటం అనే స్కీన్ ప్లేను ఫాలో అవుతూ జనాలను ఆకట్టుకుంటూటాయి. స్వీట్ పెయిన్ మీదే వాటి సక్సెస్ రేంజి ఆధారపడి ఉంటుంది. చూసేవాళ్ళకు వీరిద్దరూ కలిస్తే బాగుండును అనిపించాలి. అలాగే...మొదట్లో ఎత్తుకున్న సమస్య పెరుగుతూ పోవాలి. అయితే అక్కడక్కడే తిరగకూడదు. వీటిన్నటినీ బ్రేక్ చేయటానికే ఈ సినిమా తీసినట్లు అనిపస్తుంది. అయితే రూల్స్ ని బ్రేక్ చేయాలనుకోవటం ఎప్పుడూ మంచి ఆలోచనే...అభినందించాల్సిన విషయమే. కానీ బ్రేక్ చేసే విషయం...కథని , అందులోని పాత్రలను మన నుంచి బ్రేక్ చేసే విధంగా ఉండకూడదు. ఈ సినిమాకు అలాంటిదే జరిగందనిపస్తోంది.

    ఈ చిత్రం చూస్తూంటే ఆ పైన చెప్పుకున్న రొమాంటిక్ కామెడీ జానర్ స్క్రీన్ ప్లేని కూడా ఫాలో అయినట్లు కనపడదు. పోన్లెండీ వదిలేయండి. కథగా చూస్తే...హీరోని హీరోయిన్... కొన్ని సిల్లీ రీజన్స్(అనవచ్చా) తో ద్వేషించటం మొదలెట్టి, నిజాలేమిటో తెలుసుకోకుండా అలా ద్వేషం పెంచుకుంటూ పోతుంది. అయితే క్లైమాక్స కు వచ్చే సమయానిక ఇంక బాగోదు..టైం అయిపోతుందని...హీరో లోని పాజిటివ్ ఏంగిల్ ని హడావిడిగా గమనించి, ఆపై తను అపోహపడ్డానని పశ్చాత్తాపపడి, తనని ఇంతలా ప్రేమించేవాడు మరొకడు దొరకడు అని అమాంతం హీరోకు దగ్గర అవుతుంది. అయితే బాగానే ఉందిగా...తెలుగు సినిమాకి తగ్గ హిట్ స్టోరీ లైనేగా అనిపించవచ్చు. అయితే ఇప్పుడున్న యూత్ ప్రేక్షకులను ఈ తరహా స్టోరీలైన్ ఎంతవరకూ హిట్ ఎక్కించగలగో చూడాలి...(ఇక్కడ ఎక్కించదు అని చెప్పటం లేదు)

    హీరోయిన్ అపోహపడ్డ లేదా..ద్వేషించటానిక కారణాలు కాస్త స్ట్రాంగ్ గా ఉండాలిగా..అలాగే..అదే కథ అయితే ఎలా..వాళ్లిద్దరూ ప్రేమలో పడటానికి అది సరిపోతాయి కానీ...అదే సినిమా అంతా చూపుతానంటే కష్టం కదా...ఇంటర్వెల్ దగ్గరకు అలాంటి అపోహలు తొలిగి ఇద్దరూ ఒకటయ్యే సమయానికి మరో బలమైన సంఘటనతో విడిపోతే అప్పుడు సెకంఢాఫ్ ఖచ్చితంగా ఇంత ప్రెడిక్టుబుల్ గా ఉండేది మాత్రం కాదు. సీన్స్ కూడా రొటీన్ గా రావు...మరీ స్లోగా సినిమా తయారు కాద
    మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

    క్లారిటీ మిస్సైంది

    క్లారిటీ మిస్సైంది

    ప్రాంభం నుంచి సినిమా చివరి దాకా..హీరోయిన్ ద్వేషిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు దానిక రీజన్ బలంగా ఉండాలి. అంటే హీరోయిన్ పాయింటాఫ్ వ్యూ కరెక్టు గా ఉండాలి.. అయితే ఆమె పాత్ర సరైన క్లారిటీతో ముందుకెళ్లదు. రొమాంటిక్ కామెడీలకు హీరో,హీరోయిన్ వ్యక్తిత్వాలను,బలాలను,బలహీనలతను సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే కాంప్లిక్ట్ రాదు.

    నాగ చైతన్య

    నాగ చైతన్య

    మనం తర్వాత నాగచైతన్య నటుడుగా ఇంకో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. అది ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో స్పష్టంగా కనిపస్తుంది. ముఖ్యంగా ఏమి మాయ చేసావే నాటి నాగ చైతన్య కొన్ని సీన్స్ లో కనిపిస్తాడు. అలాగే డాన్స్ లలో కూడా నాగ చైతన్య యువత అభిరుచికి దగ్గరగా ఉండేలా శ్రమించి చేసాడు. అయితే కామెడీ టైమింగే నాగ చైతన్యకు ఇంకా అలవడలేదేమో అనిపిస్తుంది.

    పూజ హేడ్గే

    పూజ హేడ్గే

    తమిళ దర్శకుడు మిస్కిన్ ....మాస్క్ చిత్రంతో పరిచయమైన పూజ హేడ్గే కి ఇది మలి చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరసగా యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనిపిస్తోంది. స్క్రిప్టు ఎలా ఉన్నా తన వరకూ తను బాగనే చేసుకుంటూ పోయింది.

    దర్శకుడు గా అదే మిస్

    దర్శకుడు గా అదే మిస్

    దర్శకుడు కొండా విజయ్ కుమార్ తన గత చిత్రం గుండె జారి గల్లంతైందిలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీద ఆధారపడ్డారు. కానీ ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది. మరింత ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఖచ్చితంగా ఇంతకంటే బాగుండేది.

    ఇదే పాడు చేసింది

    ఇదే పాడు చేసింది

    సినిమా కంటెంట్ లో ఎమోషన్ బిల్డప్ లేదు కానీ దర్శకుడు క్లైమాక్స్ మాత్రం ఓవర్ ఎమోషన్ ని గుప్పించే ప్రయత్నం చేసాడు. డ్రామా కాస్తా మితి మీరిన మెలో డ్రామా గా మారిన ఫీలింగ్ వచ్చింది.

    రీమిక్స్ బాగుంది కానీ...

    రీమిక్స్ బాగుంది కానీ...

    వాస్తవానికి అనూప్ మెల్లిమెల్లిగా తన మ్యాజిక్ కోల్పోతున్నాడేమో అని డౌట్ వచ్చేస్తోంది. ఈ చిత్రంలో పాటలకన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోరే బాగుంది. కొన్ని సీన్స్ కేవలం బి.జి తోనే ఎలివేట్ అయ్యాయి. టైటిల్ సాంగ్ రీమిక్స్ బయిట వింటానికి బాగున్నా తెరపై చిత్రీకరణ బాగోలేదు

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    ఆండ్రూ కెమెరా వర్క్ ...రొమాంటిక్ కామెడీలు డిమాండ్ చేసే కలర్ ని ,జోష్ ని తెరపై నింపింది. ప్రతీ ఫ్రేమ్ తన శక్తి వంచన లేకుండా అందంగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపస్తుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
    నటీనటులు: నాగ చైతన్య, పూజ హేడ్గే, అలీ, సాయాజీ షిండే, రోహిణి,

    సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ,

    శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి

    తదితరులు
    కెమెరా: ఐ.ఆండ్రూ,
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి,
    ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌,
    నిర్మాత: అక్కినేని నాగార్జున,
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.
    విడుదల తేదీ : 17,అక్టోబర్ 2014.

    పూర్తిగా ఎ సెంటర్లు, మల్టిప్లెక్స్ లు టార్గెట్ చేసినట్లున్న ఈ చిత్రం ....ఈవారం మార్కెట్లో మరో సినిమా పోటీ లేకపోవటం తో కలిసి వచ్చే అవకాసం కనిపస్తోంది. అలాగే ...నాగ చైతన్య కొత్త చిత్రం వచ్చింది అని క్యాజువల్ గా చూద్దామని ఫిక్స్ అయ్యి వెళ్లేవారిని అయితే నిరాశపరచదు కానీ.. గుండెజారి గల్లంతైంది దర్శకుడు తదుపరి చిత్రం కదా అని చాలా ఎక్సపెక్ట్ చేసి వెళ్తే కష్టమనిపస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Director Vijay Kumar Konda's new flick Oka Laila Kosam is a romantic entertainer which has been creating good ripples in social media for a long time. Naga Chaitanya and actress Pooja Hegde are playing the lead roles in the movie, which has hit the marquee today (October 17) with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X