twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిక్కు తెలియక ....('దిక్కులు చూడకు రామయ్య' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    ఆ రోజు నుంచి సుబ్బారావు అలా చేయటం మానేసాడు వంటి కనువిప్పు కథలు ఈ మధ్యన తెలుగులో రావటం లేదు. ఆ లోటు తీర్చటానికి నేనున్నానంటూ వచ్చిందీ చిత్రం. తప్పటడుగేసిన తండ్రిని దారిలో పెట్టేందుకు తనయుడేం చేశాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఇలాంటి కాన్సెప్ట్ ఈ రోజుల్లో రావటం లేదు కాబట్టి కొత్తగా అనిపించవచ్చేమో కానీ, ట్రీట్ మెంట్ సరిగా చేయకపోవటం, రిపీటెడ్ సీన్స్ రావటంతో కథ ఎక్కడ వేసిన గొంగళి సామెతలా కదలా మెదలాకుండా అలాగే ఉండిపోతుంది. అయితే అజయ్ మీద చేసిన ఫన్ సీన్స్ కొన్ని బాగానే వర్కవుట్ అయ్యాయి. అజయ్ కూడా బాగానే చేసాడు కానీ మొదటి సీన్ లోనే క్లైమాక్స్, ఇంటర్వెల్ ఊహించగలిగేలా కథ,కథనం ఉండటం ఇబ్బందిగానే అనిపిస్తాయి. అలాగే ఈ చిత్రం అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించలేక దిక్కులు చూస్తూ మధ్యలో ఎటు వెళ్లాలో అని నిలబడి చూస్తూంటుంది. కాబట్టి...

    స్టేట్ బ్యాంక్ లో పని చేసే గోపాలకృష్ణ(అజయ్) తప్పనిసరి పరిస్ధితుల్లో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే అతని కల నెరవేకుండా మిగిలిపోతుంది. అయితే ఆ కోరిక వాస్తవ రూపం దాల్చే సమయం...సంహిత(సన మక్బూల్)పరిచయంతో జరుగుతుంది. తన కన్నా సగం వయస్సు ఉన్న ఆమెతో తాను అవివాహితుడునని చెప్పి ప్రేమించటం మొదలెడతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. గోపాల్ కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా ఆమెతోనే ప్రేమలో పడతాడు. ఒకరి విషయం మరొకరికి తెలియక ..ఇద్దరూ ఆమె చుట్టూ ప్రేమిస్తూనంటూ తిరుగుతారు. చివరకు గోపాల కృష్ణకు అసలు విషయం ఎప్పుడు తెలిసింది. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ.

    ఇలాంటి చిన్న సినిమాలకు కథ,కథనమే ప్రాణం. ముఖ్యంగా పాత్రల మధ్య ఉండే కాంప్లిక్ట్ ఏ మేరకు డ్రామాకు దారి తీసింది, ఎంత వరకూ చూసేవారిని భావోద్వేగాలకు గురిచేసిందనేదానిపైనే ఈ కథలు సక్సెస్ అవుతూంటాయి. ఈ చిత్రం స్క్రిప్టు ఆ విషయంలోనే ఫెయిలైందనిపిస్తుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ దశలోనే ఆగినట్లు, ట్రీట్ మెంట్ సరిగా జరగలేదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఏవైతే సీన్స్ వస్తాయో..సెకండాఫ్ లోనూ అవే సీన్స్ మారి,మారి వస్తూంటాయి. తండ్రి,కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయి వెనక పడుతున్నారు..పడుతున్నారు..పడుతున్నారు అంటూ అవే సీన్స్ రిపీట్ గా వస్తూంటాయి.

    పోనీ ఇంటర్వెల్ కు అయినా ఒకరి విషయం మరొకరికి తెలుస్తుందేమో అనుకుంటే టీవి సీరియల్ తరహాలో ఓ ఫేక్ బ్యాంగ్ ఇచ్చి...మళ్లీ సెకండాఫ్ లోనూ అదే నడుపుతూంటారు. దాంతో ఎక్కడా కీ రోల్ అయిన అజయ్ ఎక్కడా సమస్యలో పడినట్లు కనపించదు. అతను సమస్యలో పడ్డాడు..అతను కొడుకుకి తెలిసిపోయింది..ఇంట్రస్ట్ పుట్టింది అనేసరికి సెకండాఫ్ సగం అయ్యిపోయింది. ఇక తన కొడుక్కి అసలు విషయం తెలిసింది అనే విషయం అజయ్ కు తెలిసేసరికి క్లైమాక్స్ వచ్చేసింది. దాంతో అసలు కథలో ఎక్కడా సరైన కాంప్లిక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో కథనం ఆసక్తికరంగా సాగలేదు.

    స్లైడ్ షోలో ... మిగతా రివ్యూ

    అమెరికన్ బ్యూటీ కి దీనికి తేడా

    అమెరికన్ బ్యూటీ కి దీనికి తేడా

    ఈ సినిమాలో American Beauty (1999) చిత్రంలోని గులాబి రేకుల మధ్య హీరోయిన్ ఉండే సీన్ ని యాజటీజ్ వాడారు. అది ప్రక్కన పెడితే ఈ రెండు చిత్రాల కాన్సెప్టు కాస్త దగ్గర పోలిక కనపడుతుంది. American Beauty లో తండ్రి పాత్ర తన కూతురు స్నేహితురాలితో ప్రేమలో పడితే, ఇక్కడ తన కొడుకు లవర్ తో ప్రేమలో పడతాడు. అయితే American Beauty అందమంతా ఆ చిత్రం నేరేషన్, తీసిన విధానంలో వచ్చింది. అది ఇక్కడ కనపడదు.

    మెయిన్ మైనస్

    మెయిన్ మైనస్

    పెద్ద పెద్ద సన్నివేశాలులతో కూడిన సినిమా లెంగ్త్. లెంగ్త్ కాస్త తగ్గించి ఉంటే ఇంకాస్త బాగుండేది. అలాగే బ్రహ్మాజీ కామెడీ మాత్రమే కాకుండా మరికొన్ని వినోదాత్మక సన్నివేశాలు పెట్టి ఉంటే ఖచ్చితంగా మరింత మంచి ప్రాజెక్టు అయ్యుండేది. అలాగే బ్రహ్మాజీ పాత్రకు ముగింపు కూడా ఉంటే బాగుండేది.

    సెకండాఫ్ సమస్య

    సెకండాఫ్ సమస్య

    ఫస్టాఫ్ లో కామెడీ తో నడిచిపోయినా సెకండాఫ్ పూర్తిగా సెంటిమెంట్, ఎమోషన్స్ పైనే డిపెండ్ అయ్యారు. అది కొన్నిచోట్ల మరీ ఓవర్ గా టీవి సీరియల్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

    హీరోయిన్ పాత్ర ఏంటో...

    హీరోయిన్ పాత్ర ఏంటో...

    ఈ చిత్రంలో హీరోయిన్ వెళ్లి అజయ్ తో ప్రేమలో పడుతున్నట్లు చెప్తారు. చూసేవాళ్లు తన వయస్సు గల నాగశౌర్య పాత్రతో ఆమె ప్రేమలో పడుతుంది అనుకుంటే ఆమె అంకుల్ వయస్సున్న అజయ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకోవటానికి సిద్దమవుతుంది. దాంతో అజయ్ వైపు నుంచి తనకు పెళ్లి కాలేదు అనే అబద్దం చెప్పటం తప్ప మరొకటి తప్పు కనపడదు. అలాగే అజయ్ కు చిన్నప్పుడే పెళ్లి చేయటంతో అతనికి ప్రేమలో పడాలనే కోరిక తీరలేదు అని పెట్టి మంచివాడ్ని చేసారు. దాంతో నాగ శౌర్య పాత్రే అనవసరంగా ఆ ఇద్దరి లవర్స్ మధ్యా దూరినట్లు కనపడుతుంది. అజయ్ వైపు మన సానుభూతి ఉంటుంది.

    నాగ శౌర్య

    నాగ శౌర్య

    ఇదే బ్యానర్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయమైన నాగ శౌర్య కి ఈ చిత్రంలో నిజంగా చెప్పాలంటే చెయ్యటానికి ఏమీ లేదు. అతని వైపు నుంచి కథ నడవదు. కథలో అతనో ఓ పాత్ర మాత్రమే.

    దర్శకత్వం

    దర్శకత్వం

    ఈ చిత్రంలో రాజమౌళి శిష్యుడైన కోటి దర్శకుడు గా పరిచయమయ్యారు. అయితే ఈ చిత్రం చూస్తుంటే ఆయన సీనియారిటి అంతా ఏమైపోయిందో అనిపిస్తుంది. దానికి తోడు చాలా సీన్స్ ఎనభైల నాటి వాతావరణాన్ని గుర్తు చేస్తూంటాయి. ఈ కాలం యువత మనో భావాలను ఎక్కడా ప్రతిబింబించకుండా హీరో నాగశౌర్య, హీరోయిన్ ల పాత్రలను డిజైన్ చేసారు.

    మిగతా విభాగాలు

    మిగతా విభాగాలు

    చిత్రం లో చెప్పుకోదగ్గ రీతిలో పాటలు మాత్రమే ఉన్నాయి. మిగతా విభాగాలు ఓకే అన్నట్లు ఉన్నాయి. రమేష్ గోపీల మాటలు అద్బుతం కాదు కానీ బాగున్నాయనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో దర్శకుడు మరింత శ్రద్ద తీసుకుని ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ విలువలు బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ సోసోగా ఉంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: వారాహి చలనచిత్రం
    నటీనటులు: అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌, నాగినీడు, అలీ, విశాల్‌, రమేష్‌, హరితేజ, వేణు తదితరులు
    మాటలు: రమేష్‌ - గోపి,
    కూర్పు: తమ్మిరాజు,
    ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్‌రెడ్డి,
    ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌,
    సంగీతం: కీరవాణి.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రికోటి దర్శకుడు.
    నిర్మాత: రజనీకొర్రపాటి
    సమర్పణ : సాయి కొర్రపాటి
    విడుదల తేది: 10,అక్టోబర్ 2014.

    అప్పట్లో మంచి కథలు వచ్చేవి...ఈ మధ్యన రావటం లేదు అంటూ ఎప్పుడూ కేవలం పాత సినిమాలనే మెచ్చుకుంటూ ఉండేవారికి ఈ చిత్రం నచ్చే అవకాసం ఉంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Director Trikoti's latest flick Dikkulu Choodaku Ramayya (DCR), is a romantic family entertainer released today with divide talk. The director, who was earlier an associate with SS Rajamouli, has come me up with the different story-line. Naga Shaurya and Sana Maqbool are playing the lead roles in the movie. The movie has hit the screens today (October 10th).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X