twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునర్జన్మలం.. ('మనం' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తూ పెరిగిన మనకి ఆయన చివరి చిత్రం చూడటం అనేది ఖచ్చితంగా భావోద్వేగపూరితమైన అంశమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంతే అందంగా తీర్చి దిద్దాలనే తపనతో ప్రతీ ఫ్రేమ్ నీ చెక్కే ప్రయత్నం చేసారు దర్శకుడు. అయితే స్క్రిప్టుపై సరైన కసరత్తు చేయకపోవటంతో కేవలం నాగేశ్వరరావు గారి నటించిన చివరి సినిమాగా, అక్కినేని అఖిల్ ప్రారంభ చిత్రంగా గుర్తించుకోవాల్సిన పరిస్ధితి కనపడుతోంది. దానికి తోడు నాగేశ్వరరావుగారు నటించారు కదా అనుకుని ఆ కాలం నాటి సినిమాలను గుర్తు చేస్తూ స్లో నేరేషన్ లో చిత్రాన్ని నడిపిట్లునట్లుంది. స్పీడుగా నడిచే కథనాలకు అలవాటు పడిన మనకు అదే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

    అలాగే పునర్జన్మలు,వాటికి సంభంధించిన ప్లాష్ బ్యాక్ లు తప్ప కథ ఏమీ లేకపోయింది. ఫస్టాఫ్ ...ఫన్ తో బాగానే అనిపించినా, సెకండాఫ్ సీన్స్ రిపీట్ చేసుకుంటూ, అర్దాంతరమైన క్లైమాక్స్ తో ముగించారు. ఈ సినిమాలో నాగేశ్వరరావుగారిని, అఖిల్ ని ప్రక్కన పెడితే నాగార్జున మాత్రం ఇప్పటివరకూ ఇంత బాగా ఏ సినిమాలోనూ చేయలేదనిపించే ఫెరఫార్మన్స్ ఇచ్చారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం అని ప్రత్యేకంగా వెళ్ళేవారికి ఆయన పాత్ర సమగ్రంగా కనపడకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కినేని కుటుంబ నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనపడటం ఫ్యాన్స్ ని ఆనందపరిచే అంశం. అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఉన్న ఎమోషనల్ బాండింగ్ మాత్రమే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని నిలబెట్టాలి.

    పెద్ద పారిశ్రామిక వేత్త నాగేశ్వరరావు(నాగార్జున) కి తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అయితే ఓ రోజు అనుకోకండా తన తల్లి(సమంత),తండ్రి (నాగచైతన్య) పోలికలు ఉన్న వాళ్లు తారసపడటంతో వారిని తన పేరెంట్స్ గానే భావించి ఆదరిస్తాడు. అంతేకాక విడివిడిగా వీరిద్దరని కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటిదే మరో కథ సమాంతరంగా జరుగుతుంది. చైతన్య(నాగేశ్వరరావు) కూడా అదే విధంగా తన తల్లి తండ్రులను చిన్న తనంలో కోల్పోతాడు. అయితే ఓ రోజు అనుకోని పరిస్ధితుల్లో తన తల్లి(శ్రియ),తండ్రి(నాగార్జున) పోలికలు ఉన్న వాళ్లు కనపడతారు. దాంతో వీరిని కలపాలనుకుంటారు. ఈ రెండు కథల్లో కామన్ గా ఉండే క్యారెక్టర్ నాగేశ్వరరావు(నాగార్జున). ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్లు సైలెంట్ గా చేస్తూంటారు. ఆ ప్రయత్నాల్లో వారు సఫలమయ్యారా లేదా అన్నది మిగతా కథ. సినిమాలో... అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర పేరు చైతన్య, నాగార్జున పాత్ర పేరు నాగేశ్వరరావు, నాగ చైతన్య పాత్ర పేరు నాగార్జున.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    కొత్తగా చెప్పుకునేదేముంది

    కొత్తగా చెప్పుకునేదేముంది

    అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా త్రాగుడు సన్నివేశాల్లో ఆయన తన ముద్రను కనపరిచి,దేవదాసు ని గుర్తు చేస్తూ నవ్వించారు. ఇటు కొడుకుతో,అటు మనవడుతో నటించటం కలిగించిన ఆనందం ఆ సన్నివేశాల్లో మనం ఆయన కళ్ళల్లో కనపడే మెరుపులో గమనించవచ్చు.

    అక్కినేని అఖిల్

    అక్కినేని అఖిల్

    నాగార్జున మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్న అంశం..ఈ సినిమాలో అక్కినేని అఖిల్ లేడు అనేదే. ఈ విషయాన్ని ఆయన సినిమా చివర్లో సర్పైజ్ గా ఉంచాలనుకున్నారు. ఈ అంతర్జాల యుగంలో అది సాధ్యమయ్యే పనికాదన్నట్లు ముందే విషయం బయిటకు వచ్చేసింది. అయితే ఖండనల ద్వారా క్యూరియాసిటీ నిలబెట్టే ప్రయత్నం చేసారు. అఖిల్ ఎంట్రీ బాగుంది. ఆ ఎంట్రీకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది.

    నాగార్జున

    నాగార్జున

    పైన చెప్పుకున్నట్లు నాగార్జున చేత మంచి నటన రాబట్టుకోగలిగారు దర్శకుడు. ఇన్నాళ్లు నాగార్జునని మిగతా డైరక్టర్స్ సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. అవును నాగార్జున వయస్సుని ఎలా దాచి మ్యానేజ్ చెయ్యగలుగుతున్నారు, ఆయన మన్మధుడుగా ఎలా కంటిన్యూ అవుతున్నాడు ...అని మరోసారి ఈ చిత్రం చూస్తే సందేహం కలగటం ఖాయం.

    నాగచైతన్య

    నాగచైతన్య

    నాగచైతన్య మాత్రం ఈ చిత్రంలో తన తండ్రి,తాత ముందు తేలిపోయారనే చెప్పాలి. అలాగే సమంత తో సైతం పెద్దగా కెమిస్ట్రీ పండించలేకపోయారు.

    ముగ్గరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో..

    ముగ్గరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో..

    ఎఎన్నార్, నాగచైతన్య, నాగార్జున ఇలా ఈ మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనపడటం, ఒకరిపై ఒకరు సరదా సెటైర్స్ వేసుకోవటం సినిమా హైలెట్స్ లో చెప్పుకోవాల్సిన అంశం. ఇది అక్కినేని అభిమానులకు అమితానందం కలిగించే అంశం.

    కథ,స్క్రీన్ ప్లే

    కథ,స్క్రీన్ ప్లే

    ఓ రకంగా ఈ కథ అల్లటం, అదీ కన్ఫూజ్ కాకుండా అనేది కత్తిమీద సామే. అయితే కథకుడు తానే అయిన దర్శకుడు ఆ విషయంలో పూర్తి విజయం సాథించ లేకపోయారు. ఎక్కడా తికమకలు లేకుండా విషయం అర్దమయ్యేలా కథ,కథనం రాసుకున్నాడు కానీ...కథ కేవలం ప్లాష్ బ్యాక్ లే అంటే ఎలా... ప్లాష్ బ్యాక్ లు అయ్యి, నాగేశ్వరరావుకి, నాగార్జునకి టార్గెట్లు సెట్ అయ్యాక(తమ తల్లితండ్రులను కలిపాలని) వాటివైపుగా ప్రయాణం పెట్టుకునే సీన్స్ ఏమీ లేవు. దాంతో కథలో డ్రామా మొదలు కాకుండా మెలోడ్రామా రాజ్యం ఏలింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూంటే వచ్చే ఫన్ బాగుండేది. ఎందుకనో దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేకపోయారు.

    అలాగే...

    అలాగే...

    ఫస్టాఫ్ లోనే నాగ చైతన్య ప్లాష్ బ్యాక్ చెప్పినట్లుగానే, నాగార్జున ఫ్లాష్ బ్యాక్ సైతం వచ్చేసి ఉంటే.. ఇంట్రవెల్ కరెర్టు ప్లేస్ లో వచ్చేది. నాగేశ్వరరావు ని చూపగానే ఇంటర్వెల్ వేయాలని ఫిక్స్ అయ్యినట్లున్నారు. దాంతో ఫస్టాఫ్ లో కథ లేక అవే సీన్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. అదే ఇంటర్వెల్ కు ఫ్లాష్ బ్యాక్ లు పూర్తి చేసేసి, అటు నాగాశ్వరరావుకి, ఇటు నాగార్జున కి తమ తల్లి,తండ్రులను కలిపే కార్యక్రమం సెట్ చేసి ఉంటే సెకండాఫ్ లో కూడా సీన్స్ ఫెరఫెక్ట్ గా వచ్చేవి. అంతేకాకుండా నాగచైతన్యకు, సమంతకు తాము పునర్జన్మ ఎత్తామనే విషయం గుర్తుకు రావటం అనే అంశం కూడా కథలో కలవలేదు. ముగింపు కోసం చక్కగా సాగిపోతున్న కథనాన్ని దర్శకుడు పునర్జన్మ వైపు మళ్లించి క్లైమాక్స్ తేల్చేసాడని అనిపించింది.

    హీరోయిన్స్, మిగతా ఆర్టిస్టులు

    హీరోయిన్స్, మిగతా ఆర్టిస్టులు

    సమంత,శ్రియ తమ పరిధులో ఎక్కడా వంక పెట్టలేని విధంగా చేసారు. అలీ, పోసాని, ఎమ్ ఎస్ నారాయణ,జెపి పెద్దగా నవ్వించలేకపోయారు. కామెడీ ప్యాడింగ్ అన్నట్లుగా ఉంది. గెస్ట్ లుగా కనిపించిన అమితాబ్ గెస్టే.

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం

    ఈ మధ్యన చాలా పెద్ద సినిమాల విజయాల్లో మేజర్ షేర్ గా నిలుస్తున్న బ్రహ్మానందం ని ఈ చిత్రంలో ఎందుకునో పెద్దగా పట్టించుకోలేదు. ఆ పాత్ర లేకపోయినా ఓకే అనిపించేది అన్నట్లు ఉంది.

    పాటలు

    పాటలు

    పాటలు విన్నప్పడు కంటే చూస్తున్నప్పుడే బాగున్నాయి. లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అనూప్ పూర్తి మార్కులు వేయించుకున్నారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    దర్శకుడు విక్రమ్ కుమార్ గత రెండు చిత్రాలు (ఇష్క్, 13 బి) సినిమాటోగ్రఫీ విషయంలో అద్బుతంగా ఉంటూనే వస్తున్నాయి. ఈ సారి కూడా దర్శకుడు విజన్ ని ఫెరఫెక్ట్ గా తెరపై చూపించారు. ఎడిటింగ్ మరింత కట్ చేసి లెంగ్త్ తొలిగించవచ్చు అనిపించింది. కొన్ని చోట్ల రిపీట్ సీన్లతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. హర్షవర్ధన్ రాసిన మాటలు పెద్దగా పంచ్ లు లేకపోయినా నాచురల్ గా సినిమా హైలెట్స్ లో ఒకరుగా నిలిచాయి. ముఖ్యంగా ఐలవ్యూ అనే దాన్ని వేరే రకంగా వాడి ఫన్ చేయటం, లేడీస్ ఫస్ట్ అనేదాన్ని కామెడీ చేయటం బాగున్నాయి.

    ఎవరెవరు

    ఎవరెవరు

    నటీనటులు : అక్కినేని,నాగార్జున, చైతన్య , సమంత, శ్రెయ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే తదితరులు.
    మాటలు : హర్షవర్ధన్,
    పాటలు : చంద్రబోస్, వనమాలి,
    డాన్స్ : బృంద,
    ఫైట్స్ : విజయ్,
    కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్,
    ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్,
    సంగీతం : అనూప్ రూబెన్స్,
    ఆర్ట్ :రాజీవన్,
    ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ,
    నిర్మాత : నాగార్జున అక్కినేని,
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    ఏది ఎలా ఉన్నా ఇది అక్కినేని చివరి చిత్రం కావటంతో ఆ భావోద్వేగం చాలా వరకూ భాక్సాఫీస్ వద్ద పనిచేసే అవకాసం ఉంది. మల్టిప్లెక్స్ లకు టార్గెట్ చేసి తీసినట్లు ఉన్న ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులుకు పడితే మాత్రం ఉయ్యాల జంపాల మాదిరిగా సైలెంట్ గా అన్ని సెంటర్లలోనూ సక్సెస్ ని సాధిస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Akkineni family's 'Manam' movie released today with average talk. Manam is legendary actor Late Akkineni Nageshwara Rao's last film. It also stars Nagarjuna and Naga Chaitanya. Being directed by Vikram Kumar of Ishq and 13 B, Manam has Samantha and Shriya as heroines. Harsha Vardhan is providing the dialogue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X