twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిలబస్ సెట్ కాలేదు (నాగ్ 'నిర్మలా కాన్వెంట్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    చాకులాగున్న ఓ కొత్త కుర్రాడు అదీ, ఎంతోకాలంగా సినీ పరిశ్రమలో పాతుకుపోయి, మనందరి అభిమానాలకు పాత్రుడైన శ్రీకాంత్ కుమారుడు లాంచింగ్ చిత్రం అంటే ఆసక్తి ఉంటుంది. అంతేనా నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు దాంతో మరో ఉయ్యాల-జంపాల తరహా సినిమా చూడబోతున్నామని ఆసక్తి రేగుతుంది. ముఖ్యంగా నాగ్ ఈ చిత్రంలో పాట పాడి, నటించి సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్ గా చిన్న సినిమాల హవా నడుస్తోంది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందనే ఆశలు, అంచనాలు రేగుతాయి. మరి వాటిని ఈ కాన్వెంట్ రీచ్ అయ్యిందా అంటే కొంతవరకూ అనే చెప్పాలి, ఎందుకూ, ఏవి ప్లస్ , ఏవి మైనస్, అసలు కథేంటి అనే విషయాలు చర్చిద్దాం.

    నిర్మలా కాన్వెంట్ లో పేదింటి అబ్బాయి శామ్యుల్‌ (రోషన్‌), డబ్బున్న అమ్మాయి శాంతి (శ్రియ శర్మ) చదువుకుంటూంటారు. ఒకే ఊరుకి చెందిన వీళ్లిద్దరూ షరా మూమూలుగా కొన్ని కవ్వించి, నవ్వించి, లవ్వించే సీన్లతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఆ పిల్ల తండ్రి భూపతి రాజు(ఆదిత్య మీనన్) కు తెలిసి మండిపడతాడు. గూండాలలాంటి తన పాలేర్లతో మన హీరో శామ్యూల్ ని కొట్టిస్తాడు. అయినా సరే తన కొడుకు ప్రేమని గెలిపించటం కోసం శ్యాముల్ తండ్రి వెళ్లి , హీరోయిన్ తండ్రి తో నీ కూతురుని ఇచ్చి నా కొడుకుతో పెళ్లి చేయమంటాడు.

    అప్పుడు ఆ రాజు గారు.. ఆ పేద తండ్రికి ఉన్న ఆ ఎకరం పొలం కూడా మోసంతో రాయించుకుని, 'పైసా లేని నువ్వు నా కంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ కీర్తి గడించు. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటాడు. దాంతో డబ్బు సంపాదించడం కోసం శామ్యూల్‌ హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ సినిమా హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తరవాత ఏమైంది? శామ్యూల్‌ డబ్బునీ.. కీర్తినీ ఎలా సంపాదించాడు? తన ప్రేమని ఎలా సాధించాడు? అనేదే ఈ చిత్ర కథ.

    అప్పట్లో ఆస్కార్ అవార్డ్ పొంది, ఘన విజయం సాధించిన 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాకు ఇండియన్ ఇంకా చెప్పాలంటే నాటు తెలుగు సినిమా వెర్షన్ ఇది. అంటే కోట్లు కురిపించే క్విజ్ షో ఎపిసోడ్ కు లవ్ స్టోరీ కలిపి వదిలిన కథ ఇది. ఇంతకు మించి ప్రత్యేకంగా ఈ సినిమా కథ గురించి మాట్లాడటానికి ఏమీలేదు. అయితే ప్రేరణ పొందటం తప్పేమీ కాదు కానీ మరీ నాటుగా,మోటుగా , రొటీన్ గా ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తుంది. అదే బాధేస్తుంది.

    ఈ సినిమాలో అనీల్ కపూర్ పాత్ర తరహా క్యారక్టర్ ని నాగార్జన చేసారు. ఆయన రియల్ లైఫ్ లో చేస్తున్న టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను మళ్లీ చూపించారు. ఆ షో తాలుకూ సీన్లన్నీ 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. క్లైమా్స్ సీన్స్ అందరూ వూహించిన విధంగానే సాగాయి.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ చదవండి

     ముందుగా చెప్పుకోవాల్సింది

    ముందుగా చెప్పుకోవాల్సింది

    శ్రీకాంత్, ఊహల కుమారుడు రోషన్ తెలుగు తెరకు పనచియమైన చిత్రం ఇది. ఈ చిత్రం పై భారీ అంచనాలు అయితే లేవు కానీ, ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురూచూసింది. కుర్రాడు ఎలా చేస్తాడు, తండ్రిని దాటతాడా, నాగార్జున ఏం నమ్మి ఈ కుర్రాడుని హీరోగా పెట్టి సినిమాని తీసాడు వంటి అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే అంచనాలను రోషన్ అందుకున్నాడనే చెప్పాలి. ఇన్నోసెంట్ లుక్ లతో రోషన్ ఎక్కడా తడబాటు అనేది లేకుండా ఆకట్టుకున్నాడు

     నాగార్జున ఎంతవరకూ ప్లస్ అయ్యాడు

    నాగార్జున ఎంతవరకూ ప్లస్ అయ్యాడు

    అతిధి పాత్రలో నటించిన నాగార్జన ఈ సినిమాకు ఓపినింగ్స్ తేవటం వరకూ ప్లస్ అయ్యాడు. అందులోనూ తనే నిర్మించటం, పబ్లిసిటీ బాగా చేయటం వంటి అంశాలతో ప్రాడెక్టుని లాంచ్ చేసేదాకా సక్సెస్ అయ్యాడు. అయితే నాగార్జున చెప్పినంత గొప్పగా సినిమా లేదు అలాగే...సినిమాకు ఉన్నంతలో నాగార్జున ప్లస్ అయ్యాడు. నాగార్జున ఉన్న సన్నివేశాలు, ఆయన అభిమానులను అలరిస్తాయటంలో సందేహం లేదు.

    అదే దెబ్బ కొట్టింది

    అదే దెబ్బ కొట్టింది

    శ్రీకాంత్ వారసుడుని పరిచయం చేయాలి, నాగార్జున గెస్ట్ గా చేస్తే బాగుంటుంది వంటి విషయాలన్నీ బాగున్నా, సినిమాకు కీలకంగా నిలవాల్సిన కథను పరమ రొటీన్ గా చేసాడు దర్శకుడు. కథ పాత వాసనలు కొట్టడం మైనస్ అయ్యింది. అలాగే స్లమ్ డాగ్ మిలయనీర్ ఎపిసోడ్ ని నాగార్జున ఉన్న సీన్స్ అన్ని గుర్తు చేయటం పెద్దగా కలిసి రాని వ్యవహారం. ఇదే ఈ సినిమాలో ఉన్న ఫ్రెష్ నెస్ ని పాతేసింది.

    టెంపో పడిపోయింది

    టెంపో పడిపోయింది

    సినిమాలో ఒక్కసారి ప్లాట్ ఇది, కథనం ఇలా నడుస్తోంది అని రివీల్ అయ్యిపోయాక సినిమా టెంపో పూర్తిగా పడిపోయింది. హీరో నెక్ట్స్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడు. సినిమా ఎటు మలుపులు తీసుకోబోతంది. ఎలాంటి సన్నివేశాలు వస్తాయి వంటివి ఊహకు అందిపోయాయి. అంతేకాకుండా కథలో ఎగ్జైంటింగ్ ఫాక్టర్ కొరవడింది. అది సెకండాఫ్ లో ఉన్న నాగార్జున ఎపిసోడ్స్ ని డల్ చేసేసింది.

    డైరక్షన్ ఎలా ఉందంటే...

    డైరక్షన్ ఎలా ఉందంటే...

    కథ,కథనం, బ్యాక్ డ్రాప్ అప్పట్లో వచ్చే దర్శకుడు తేజ సినిమాలైన నువ్వు నేను, జయం వంటి చిత్రాలను గుర్తు చేస్తుంది. అయితే తేజ రాసుకున్నట్లుగా సీన్స్ ని అందంగా రాసుకోలేక తడబడ్డాడు. అలాగే డైరక్షన్ కూడా సోసోగా ఉంది. కామెడీ మిస్సైంది. దర్శకుడు తొలి చిత్రం ఇంతకన్నా బాగా చేస్తేనే ముద్ర వేయగలుగుతాం అనే విషయం దర్శకుడు మర్చిపోయాడు. తనదైన ముద్ర ఎక్కడా లేదు

     పెద్దగా కనపడలేదు

    పెద్దగా కనపడలేదు

    ఇక.. క్యారక్టర్ ఆర్టిస్టు ఎల్బీ శ్రీరాం కనిపించింది కాసేపే అయినా అందులో ఆయన నటన.. డైలాగులు బాగున్నాయి. మిగిలిన వారిలో గుర్తు పెట్టుకోదగిన పాత్రలు పెద్దగా కనిపించవు. మిగతా విషయాల్లో అంత శ్రద్దను తీసుకుంటే బాగుండేది. అలాగే నాగార్జున డైలాగులు, ఆయన ఎంట్రీ కూడా బాగుంది. అయితే డైలాగులు కూడా మరింత సాన పెడితే బాగుండేదనిపిస్తుంది. హీరో ...కొత్త కుర్రాడు మాత్రమే కాక చిన్నవాడు అతని మీద మరీ బరువు ఎక్కువైనట్లు అనిపించింది.

     హైలెట్స్ , మైనస్ లు

    హైలెట్స్ , మైనస్ లు

    ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గానే ఉంది. సాంగ్స్ విషయానికి వస్తే..ఈ సినిమాతో పరిచయం అయిన రోషన్ సాలూరి మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. దాదాపు అన్ని పాటలు యూత్ ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా రహమాన్ కుమారుడు అమీన్ పాడిన కొత్త కొత్త బాష పాట క్యూట్ గా ఉంది. అలాగే నాగార్జున పాడిన కొత్త కొత్త భాష ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే పాటలు కూడా మంచి అందమైన లొకేషన్స్ చక్కగా కొరియోగ్రఫీ చేసి తెరకెక్కించారు. అయితే ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. చాలా చోట్ల స్లో పేస్ అయ్యిపోయింది.

     నిర్మలా కాన్వెంట్ స్టోరీ ఇక్కడే తన్నింది

    నిర్మలా కాన్వెంట్ స్టోరీ ఇక్కడే తన్నింది

    ఫస్టాఫ్ లో ఫ్లాట్ రివీల్ అయ్యేదాకా బాగానే నడించింది. అయితే సెకండాఫ్ లో ఫస్టాఫ్ లో మెయింటైన్ చేసినంతగా టెంపోని నడుపలేకపోయాడు. అలాగే హీరో, విలన్ లు మధ్య థ్రెట్ పేరుకైతే ఉంది కానీ, వారి మధ్య కాంప్లిట్ ని పూర్తిగా వదిలేసాడు. అసలు విలన్, హీరోయిన్ సెకండాఫ్ లో కనపడరు. నాగార్జున పూర్తిగా ఆక్యుపై చేసేసాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ ఇంట్రస్టింగే కానీ,నడుస్తున్న లవ్ స్టోరీనుంచి పూర్తిగా డీవియేట్ అయ్యిపోయింది.

     తెరవెనక, ముందు

    తెరవెనక, ముందు

    బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్, కాన్సెప్ట్ ఫిలిం ప్రొడక్షన్స్
    నటీనటులు: నాగార్జున, రోషన్, శ్రియా శర్మ, ఎల్బీ శ్రీరామ్, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మేనన్‌ తదితరులు.
    సంగీతం: రోషన్‌ సాలూరి
    ఛాయాగ్రహణం: ఎస్వీ. విశ్వేశ్వర్‌
    పాటలు : చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
    సహ నిర్మాత: గీత
    నిర్మాతలు: నాగార్జున.. నిమ్మగడ్డ ప్రసాద్‌
    రచన, దర్శకత్వం: జి.నాగ కోటీశ్వరరావు
    విడుదల: 16-09-2016

    ఫైనల్ గా నిర్మలా కాన్వెంట్ లో సిలబసే గాడి తప్పింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి సౌతిండియా వెర్షన్ తో హిట్ కొడదామని ఆ సీన్స్ మాయలో దర్శకుడు తను అసలు కథకు కీలకమై మొదట్లో ఎత్తుకున్న లవ్ స్టోరీనే పూర్తిగా మర్చిపోయాడు. ఈ సినిమాని నాగ్ అభిమానులే కాక, శ్రీకాంత్ కొడుకు ఎలా ఉన్నాడు, ఎలా నటించాడో చూద్దామని అనుకున్నవాళ్లకే ఆప్షన్.

    English summary
    Nirmala Convent garnered good buzz among the audience when news came out that Nagarjuna is playing an important role with ample screen time in the second half. Roshan Meka has delivered a good performance as Samuel and he will be having a bright future in Tollywood if he selects the right scripts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X