twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిలే కాదు...కథ,కథనం కూడా అప్పటిదే.. ('మజ్ను' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    --సూర్య ప్రకాష్ జోస్యుల

    'భలే భలే మొగాడివోయ్' చిత్రం తర్వాత నాని మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో కూడిన కామెడీతో సీన్స్ పండిస్తూ హిట్లు కొడుతున్న నాని సినిమా అనగానే అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తోడు.. . 'ఉయ్యాల జంపాల' వంటి ఫ్రెష్ ప్రేమ కథతో హిట్ కొట్టిన విరించి వర్మ..దర్శకుడుగా రెండో చిత్రం నానితో చేస్తూండటంతో అంచనాలు రెట్టింపు అయ్యియి. ఆ అంచనాలను దర్శకుడు అందుకున్నాడా..నాని తన హిట్ ఒరవడిని కంటిన్యూ చేసాడా అంటే ....రివ్యూలోకి వెళ్లాల్సిందే.

    భీమవరం కుర్రాడు ఆదిత్య (నాని) రాజమౌళి దగ్గర బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్.అతను..సుమ(ప్రియా శ్రీ) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడి, తన ప్రేమలో నిజాయితీ నిరూపించుకోవటానికి గతంలో తన సొంత ఊరు భీమవరం లో జరిగిన తన ప్రేమ, బ్రేకప్ తో కూడిన ప్లాష్ బ్యాక్ ఆమెకు చెప్తాడు. దాంతో ఆమె ప్లాటై ప్రేమలో పడుతుంది. కానీ ఈ ప్రేమ కథ చెప్తూ ఆదిత్య తన మనస్సు తన పాత ప్రేయసి కిరణ్ (అను ఇమ్మాన్యుయేల్‌) చుట్టూనే తిరుగుతోందని గమనిస్తాడు.

    ఆమెను కలసి, కన్వీన్స్ చేయాలి అని ఫిక్సైనప్పుడు అతనికో ట్విస్ట్ పడుతుంది. అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...ఆదిత్య ప్రేమ కథ ఎవరితో ముగింపు కు వస్తుంది, ఇక ఆదిత్య తన పాత, కొత్త ప్రేయసిలను ఒకేసారి ఎలా ఫేస్ చేశాడు? చివరికి ఎవరి ప్రేమను దక్కించుకున్నాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    క్రింద సినిమా హైలెట్స్, మైనస్ లు, ఎనాలసిస్

    ప్రెష్ నెస్ లేదు...

    ప్రెష్ నెస్ లేదు...

    దర్శకుడు ద్వితీయ విఘ్నం దాటటానికి రొటీన్ పంధానా ఎంచుకున్నాడు. ఎంత రొటీన్ అంటే సెకండాప్ లో వచ్చే సీన్స్ అన్ని మనకు ఎక్కడో చూసినట్లే అనిపిస్తూంటాయి. అప్పట్లో వచ్చి హిట్టైన అల్లరి మొగుడు తరహా చిత్రా టైప్ లో ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగే హీరో కథలా అనిపిస్తూంటాయి. ఉయ్యాల జంపాల నాటి ఫ్రెష్ నెస్ సినిమాలో కనిపించదు. ఫస్టాఫ్ కొత్త సీన్స్ తో బాగుందనిపించినా, సెకండాఫ్ రొటీన్ రెగ్యులర్ తెలుగు సినిమా ట్రాక్ లోకి వచ్చేసాడు.

    హఠాత్తుగా వచ్చినట్లు ఉంటాయి

    హఠాత్తుగా వచ్చినట్లు ఉంటాయి

    ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ దగ్గర హీరో గతంలో తన ప్రేమ కథ చెప్తూ...ఆమెతో ప్రేమలో ఉన్నానని గ్రహించటం అనేది వినటానికి బాగానే ఉన్నా...తెరపై సరిగ్గా అది ఎగ్జిక్యూట్ కాలేదు. దాంతో అక్కడ హీరో వైపు నుంచి వచ్చే ఎమోషన్, ముఖ్యంగా ఆమె కోసం వెతకటానికి వెళ్లటం అసహజంగా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ లోనూ సెకండ్ హీరోయిన్ లో మార్పు వచ్చే సన్నివేశాలు కూడా చాలా కృతకంగా ఉంటాయి.

    ఎంత లవ్ స్టోరీ అయితే మాత్రం

    ఎంత లవ్ స్టోరీ అయితే మాత్రం

    దాదాపు రొమాంటిక్ కామెడీలు, లవ్ స్టోరీల క్లైమాక్స్ లు ఒకేలా ఉంటూంటాయి. హీరో నో, హీరోయిన్ ఫారినో,మరో చోటకో వెళ్ళిపోతూంటే...ఆ ఎయిర్ పోర్ట్ లోనే, రైల్వే స్టేషన్ లోనే సదరు లవర్స్ వెతుక్కుంటూ వచ్చి తమ వాళ్లను తీసుకు వెల్తారు. ఆ ఫార్ములాని వదలటం ఎందుకు అనుకున్నాడో ఏమో దర్శకుడు దాన్ని యాజటీజ్ ఫాలో అయ్యిపోయాడు. దాంతో చాలా ప్రెడిక్టుబుల్ గా మారింది.

    వన్ అండ్ ఓన్లీ నాని

    వన్ అండ్ ఓన్లీ నాని

    ఈ సినిమాకు ప్లస్ నాని అనే దాని కన్నా నాని లేకపోతే ఈ సినిమా లేదు అనటం మేలు. ఎందుకంటే కేవలం నాని తన నటనతో ,కామెడీతో , డైలాగు విరుపుతో చాలా భాగం లాక్కొచ్చాడు. సీన్స్ లో బలం లేక తేలిపోయే చోట కూడా మ్యానేజ్ చేసాడు. కాబట్టి ఇది నాని వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.

    పాత కథే ..మరీ పాత గా అయ్యిపోయింది

    పాత కథే ..మరీ పాత గా అయ్యిపోయింది

    సినిమా ట్రైలర్స్, ఫస్ట్ లుక్ చూసి, నాని ఈ కథను ఒప్పుకున్నాడంటే ఏదో కొత్తగా చెప్పే ట్రెండీ లవ్ స్టోరీ ఉంటుదంని భావిస్తాం. కానీ రెగ్యులర్ గా వచ్చే ఇద్ద‌ర‌మ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించటం, అబ్బాయి మాత్రం ఒక అమ్మాయినే ప్రేమిచటం, . ఆ అమ్మాయికేమో వేరే వారితో నిశ్చితార్థం జ‌రుగి, పెళ్లి దాకా వెళ్లటం. చివ‌ర‌కు హీరో అమ్మాయిని ఎలా ద‌క్కించుకుంటాడ‌నేదే క‌థ‌నే చెప్పారు.

    ఆ సీన్స్ వర్కవుట్ కాలేదు

    ఆ సీన్స్ వర్కవుట్ కాలేదు

    ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫ్రెండ్ గురించి హీరోయిన్ తో విడిపోయే సీన్స్ అయితే దారుణం అనిపిస్తాయి. హఠాత్తుగా అలా వచ్చి అలా వెళ్లిపోతాయి. సెకండాఫ్ లో మళ్లీ ఆ సీన్స్ కు కంక్లూజన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసారు. ఫ్రెండ్ తో నానికి అంత రిలేషన్ ఎక్కడా చూపెట్టకుండా ప్రెండ్ ని వదిలేయమందని, ఆమెతోనే బ్రేకప్ చేసుకున్నాను అని చెప్పటం కన్విసింగ్ గా అనిపించదు. మరింత బలంగా ఆ సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది.

    సినిమాకు అవే ప్లస్ లు

    సినిమాకు అవే ప్లస్ లు

    నానికి హీరోయిన్స్ తో వచ్చే కెమెస్ట్రీ బాగా పడింది. వాళ్లతో డైలాగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్స్ తో వచ్చే సీక్వెన్స్ లు రొటీన్ గా అనిపించినా, డైలాగులతో కూర్చో బెట్టాడు. అయితే సీరియస్ గా వచ్చే సీన్స్ లో డైలాగ్స్ మాత్రం తేలిపోయాయి. డెప్త్ మిస్తైంది. దాంతో నాని ఇద్దరి హీరోయిన్స్ ఎవరితోనూ పెద్దగా ప్రేమలో లేడేమో అనే సందేహం వచ్చేస్తుంది.

    ఎగ్జాట్ రీజన్ చెప్పలేదు

    ఎగ్జాట్ రీజన్ చెప్పలేదు

    సినిమా అంతా చూసినా నానితో మొయిన్ హీరోయిన్ బ్రేకప్ కు కారణం తెలియదు. సినిమాలో ఏదో కారణం చెప్తారు కానీ అది అంత పెద్ద కారణం అనిపించదు. కావాలని అప్పటికప్పుడు బ్రేకప్ కోసం పోర్సెడ్ గా హీరో చేసే చేస్టలులా కనిపిస్తాయి. దాంతో సినిమాకు కీలకమైన ఆ సీన్స్ లో బలం లేకపోవటంతో సినిమా సోసో గా అనిపిస్తుంది.

    చిరంజీవి సాంగ్ తో వచ్చే సీన్

    చిరంజీవి సాంగ్ తో వచ్చే సీన్

    సినిమాలో కొన్ని సీన్స్ మటకు దర్శకుడు చాలా బాగా డీల్ చేసాడు. ముఖ్యంగా ఆటో రిక్షాలో హీరోయిన్ తో కలిసి హీరో వెళ్తూంటే ..బ్యాక్ గ్రౌండ్ లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సాంగ్ రావటం. అలాగే.. హీరోయిన్ బెడ్ రూంలో ఆమె బర్తడేని సెలబ్రేట్ చేసే సీన్ బాగున్నాయి.

    తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నాలు ఏవి

    తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నాలు ఏవి

    ప్రేమ కథలకు కీలకంగా నిలవాల్సిన ఎమోషన్స్ సీన్స్ సినిమాలో మిస్సయ్యాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్ ప్రోగ్రషన్ కనపడదు. హీరో తన ప్రేమని తిరిగి గెలిపించుకోవటానికి చేసే ప్రయత్నాలు అసలు లేవు. దాంతో కథ కేవలం ఇద్దరి పెళ్లాల ముద్దలు పోలీస్ లాగ ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగే కుర్రాడు కథ అయ్యిపోయింది.

    సినిమా సాంకేతిక విభాగంలో...

    సినిమా సాంకేతిక విభాగంలో...

    టెక్నికల్ విబాగానికి వస్తే... సినిమాలో హైలెట్ క్రెడిట్ సినిమాటోగ్రఫర్ జ్ఞాన శంకర్ కు వెళుతుంది. ముఖ్యంగా భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించాడు. అలాగే గోపి సుందర్ అందించిన పాటల సంగీతం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది.

    బ్రహ్మానందంలా యాజటీజ్ చేసాడు

    బ్రహ్మానందంలా యాజటీజ్ చేసాడు

    కామెడీ విషయానికి వస్తే ....హీరో నాని ప్రెండ్ పాత్రలో సత్య అక్కడక్కడ నవ్వించటానికి ప్రయత్నించాడు. ఫస్టాఫ్ లో నవ్వించే భాధ్యత నానినే తీసుకున్నాడు. సెకండాఫ్ లో మాత్రం తెలుగు రాని క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో వెన్నెల కిషోర్ కామెడి నవ్వించింది. చాలా సినిమాల్లో చేసిన బ్ర‌హ్మానందం రోల్‌ను వెన్నెల‌కిషోర్ చేసిన‌ట్టు తెలిసిపోతుంది.

    రాజమౌళి సినిమాకు కలిసొచ్చారా

    రాజమౌళి సినిమాకు కలిసొచ్చారా

    ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమా మొదట్లో , అలాగే చివర్లో కూడా రెండు స‌న్నివేశాల్లో కనిపించారు. అయితే సినిమా కు ఆయన ప్లస్సా , మైనస్సా అంటే అసలు ఆయన సీన్స్ కు సినిమాకు అసలు సంభందం లేదు. అలాగే బాహుబలి లో వేషం కోసం రౌడీలు పడే తాపత్రయం సీన్స్ కూడా పెద్దగా నవ్వించలేదు. సోసో గా ఉన్నాయి.

    రాజ్ తరుణ్ కు కథలో ఏంటి

    రాజ్ తరుణ్ కు కథలో ఏంటి

    ఈ దర్శకుడు విరించి వర్మ తొలి చిత్రం ఉయ్యాల జంపాల లో హీరో రాజ్ తరుణ్. అదే అభిమానంతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించినట్లున్నాడు. కానీ పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్ర. ఆ సీన్స్ లో ఎవరు ఉన్నా ఒకటే. సినిమాకి, కానీ రాజ్ తరుణ్ కి కలిసొచ్చే క్యారక్టర్ కాదు. ఎందుకంటే ఆ క్యారక్టరే తెలుగు సినిమాల్లో స్టాక్ క్యారక్టర్.

    టీమ్ ఇదే...

    టీమ్ ఇదే...

    బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, కేవా మూవీస్‌
    తారాగ‌ణం: నాని, అను ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు
    సంగీతం: గోపీసుందర్‌
    కూర్పు :ప్రవీణ్ పూడి
    ఛాయాగ్ర‌హ‌ణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్
    నిర్మాత‌లు: పి.కిర‌ణ్‌, గీతా గోళ్ళ‌
    దర్శకత్వం: విరించి వర్మ ​
    విడుదల: 23-09-2016

    ఫైనల్ గా టైటిల్ కు తగ్గట్లే స్టోరీ లైన్ ను సైతం పాతదే ఎంచుకోవటంతో సినిమాలో చాలా సీన్స్ రొటీన్ గా అనిపించాయి. మనం రెగ్యులర్ గా చూసే సినిమాలు ఏమన్నా కొత్త కథలా, అన్ని రొటీనే కదా అనుకుంటే , హ్యాపీగా ఈ సినిమాకు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవచ్చు.

    English summary
    Actor Nani is gearing up for the third release of the year, Majnu. Directed by Uyyala Jampala fame Virinchi Varma, Majnu stars newbies Priya Shri and Anu Emanuel as the female leads released today with average talk. Anandi Arts,Keva Movies together produced the film which has hit the screens worldwide this Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X