twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సస్పెన్స్ తో విన్ ...(నాని 'జెంటిల్ మన్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    3.0/5

    మూసలో కొట్టుకుపోకుండా...సినిమా ..సినిమాకీ కొత్త కథలను ఎంచుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో నాని ఆరితేరిపోయాడు. ఓ సారి లవ్ స్టోరీ చేస్తే ఇంకోసారి కామెడీ లవ్ స్టోరీ , మరోసారి థ్రిల్లర్, ఆ రెండో మరోసారి రొమాంటిక్ కామెడీ. ఇలా ఎప్పటికప్పుడు డ్రస్ లు మార్చినట్లు జానర్స్ మార్చుకుంటూ విబిన్న కథలతో అలరిస్తున్న నాని ఈ సారి థ్రిల్లర్ కథాంశంతో ముందుకు వచ్చాడు. అదీ తనను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వరస ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు అవకాసం ఇస్తూ..ఇది మాత్రం జెంటిల్ మెన్ తనమే.

    అలాగే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ...తనను నమ్మిన నానికి తను నమ్మిన కథనంతో థ్రిల్ చేసాడు. నాని ఎప్పటిలా నటనతో అదరకొడితే, దర్శకుడు తను ట్విస్ట్ లతోనూ సినిమాని నిలబెట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు. టోటల్ గా ఇది థ్రిల్లర్ సినిమా ప్రేమికలకు నచ్చే క్లాస్ చిత్రం. నాని నటన ఇష్టపడే అభిమానులకు ఇది కొత్త జానర్ చిత్రం. రొటీన్ కమర్షియల్ సినిమా చూద్దామనుకుని వెళ్లేవారికి మాత్రం ఇది నిరాశపరిచే చిత్రమే.

    లండన్ నుంచి తిరిగి వస్తూ...ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుని ఫ్రెండ్స్ గా మారతారు కేథరిన్‌ (నివేదా థామస్‌),ఐశ్వర్య (సురభి). టైమ్ పాస్ కోసం తమ తమ లవ్ స్టోరీలను ఒకరికొకరు చెప్పుకుంటారు ఈ అమ్మాయిలు. ఆ లవ్ స్టోరీ లు చెప్పుకోవటం పూర్తై, హైదరాబాద్ రాగానే ..అందులో ఒకమ్మాయి కేథరిన్ కు తన బోయ్ ప్రెండ్ గౌతమ్ (నాని) చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఓ జర్నలిస్ట్ ద్వారా అతను చనిపోలేదు..చంపబడ్డాడు అని తెలుసుకుంటుంది.

    మరో ప్రక్క తనకు ప్లైట్ లో పరిచయమైన ఐశ్వర్య ఉడ్ బి జై (నాని)కూడా అదే పోలికలతో ఉండటంతో, అతనే తన బోయ్ ఫ్రెండ్ ని ఏమైనా చేసాడా అనే అనుమానం వస్తుంది. మెల్లిగా ఆ అనుమానం మరింత బలపడి అతనిపై నిఘా పెడుతుంది. ఈ క్రమంలో ...క్యాధరిన్ కు ఆదారాలు దొరకకుండా సాక్ష్యాలు మాయం అవుతూంటాయి. దాంతో క్యాధరిన్ తన బోయ్ ప్రెండ్ గౌతమ్ ని చంపింది జై అని ఫిక్స్ అవుతుంది. ఈ విషయం బయిటి పెట్టాలనుకుంటూండగా ఓ షాకింగ్ నిజం బయిటపడుతుంది. ఆ క్రమంలో ఏం జరిగింది. అసలు చివర్లో బయిటపడ్డ షాకింగ్ నిజం అనేదే మిగతా కథ.

    స్లైడ్ షోలో హైలెట్స్, మైనస్ లు

    గుర్తు వచ్చింది

    గుర్తు వచ్చింది

    సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి అసలు ట్విస్ట్ రివీల్ అవటంతో ఇది ధాయిలాండ్ సినిమా Alone (2007) ని గుర్తుకు తెస్తుంది.

    నాని షో

    నాని షో

    ఈ సినిమా ఎప్పటిలాగే నాని వన్ మేన్ షో అనే చెప్పాలి. నాని తప్ప మరొకరు ఈ సినిమా చెయ్యలేరేమో అని ఖచ్చితంగా ఓ నిర్దారణకు వస్తారు.

    ఇంద్రగంటి గొప్పతనం ఇక్కడే

    ఇంద్రగంటి గొప్పతనం ఇక్కడే

    సినిమా టైటిల్ కు తగ్గట్లే ...నాని విలనా, హీరోనా అనే డౌట్ మొదటి నుంచి చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విషయంలో ఇంద్రగంటికి వందకు వెయ్యి మార్కులు పడతాయనటంలో సందేహం లేదు.

    జస్ట్ ఓకే

    జస్ట్ ఓకే

    ఈ సినిమాకు సంగీతం అంటే పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మణిశర్మను కొట్టినవారు లేరు. అది నిజం అని మరోసారి ప్రూవ్ అవుతుంది.

    ఎడిటింగ్, కెమెరా వర్క్, డైలాగులు

    ఎడిటింగ్, కెమెరా వర్క్, డైలాగులు

    కెమెరా వర్క్ బాగుంటే, ఎడిటింగ్ విషయంలో మరిన్ని కత్తెరెలు సెకండాఫ్ లో పడితే బాగుండును అనేంత స్లోగా నడిచింది. డైలాగులు బాగున్నాయి

    కామెడీ

    కామెడీ

    ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలలో మొదటి నుంచి కామెడీ కు ప్రయారిటి ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి కాస్త తక్కువ అంటే బాగా తక్కువే ఇచ్చారు..కథ డిమాండ్ మేరకు. ఇలాంటి కథల్లో కామెడీ ఎక్సపెక్ట్ చేయరనుకున్నారు. అది నిజం కూడా . కొంతలో కొంత వెన్నేల కిషోర్ నవ్వించాడు.

    హీరోయిన్స్ , నిర్మాణ విలువలు , దర్శకత్వ పనితనం

    హీరోయిన్స్ , నిర్మాణ విలువలు , దర్శకత్వ పనితనం

    నివేదిక అద్బుతంగా చేస్తే, సురభి గ్లామర్ తో ఆకట్టుకుంది. దర్శకుడు సినిమాని పూర్తి సస్పెన్స్ తో నడపటంలో సక్సెస్ అయితే, నిర్మాత ఖర్చు, ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడూ, సినిమాలో నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    బ్యానర్ : శ్రీదేవి మూవీస్‌
    చిత్రం: జెంటిల్‌మన్‌
    నటీనటులు: నాని.. సురభి.. నివేదా థామస్‌.. అవసరాల శ్రీనివాస్‌.. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేష్‌.. ఆనంద్‌.. తనికెళ్ల భరణి.. రోహిణి.. ప్రగతి.. రమాప్రభ తదితరులు
    ఛాయాగ్రహణం: పి.జి.విందా
    ఎడిటింగ్: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
    సంగీతం: మణిశర్మ
    ఆర్ట్: ఎస్‌.రవీందర్‌
    కథ: డేవిడ్‌ నాధన్‌
    నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
    మాటలు,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
    విడుదల తేదీ: 17-06-2016

    ఫైనల్ గా సస్పెన్స్ , ఎండ్ ట్విస్ట్ తో కూడిన థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారికి, ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ నానికి అభిమానులు ఎక్కువగా ఉన్న ఫ్యామీలీ చిత్రాలను అబిమానించే ఫ్రేక్షకులకు ఎంతవరకూ ఈ సినిమా నచ్చుతుందీ అంటే ప్రశ్నార్దకమే...ఆ ఎంత వరకూ నచ్చటం మీద భాక్సాఫీస్ విజయం స్ధాయి ఆధారపడి ఉంటుంది.

    English summary
    Nani's Gentleman released today with above average talk. The actor, who is basking in the glory of back to back successes, is expected to come up with yet another promising subject and going by the trailers and the promotions, Gentleman could be that another refreshingly new story from Nani. Did Nani meet the expectations of the audience? Read the review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X