twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొల్లేరులో... (‘రౌడీ ఫెలో’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    బడ్జెట్ కంట్రోల్లో ఉంచుతూ, కథని నమ్ముతూ,కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్న నారా రోహిత్ కొత్త చిత్రం అంటే సహజంగానే ఆసక్తి. ఈ సారి ఏ కాన్సెప్టు నీ తీసుకున్నాడు...ఏ ఇష్యూని మన ముందు ఉంచబోతున్నాడూ అని...అయితే ఈ సారి నారా రోహిత్ కథని కొత్తగానే ట్రై చేసాడు కానీ తనను తాను మాస్ హీరోగా చూసుకోవాలనుకున్నాడు. అందుకు తగినట్లుగా కొత్త దర్శకుడు డైలాగులతో అదరకొట్టాడు కానీ సెంకడాఫ్ లో బాగా స్లో చేసి, హీరోయిన్ కోసం సైడ్ ట్రాక్ కు వెళ్లిపోతూ తడబడ్డాడు. దానికితోడు ప్రస్తుతం ప్రేక్షుకులు కోరుకుంటున్న ఎంటర్టైన్మెంట్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో మరింత బాగా ఉండాల్సిన కేవలం సినిమా పాస్ మార్కులతో సరిపెట్టుకున్నట్లున్నట్లు అనిపించింది. నారా రోహిత్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ మసాలా సినిమా కాకుండా కాస్త డిఫెరెంట్ గా ప్రయత్నించినందుకు దర్శక,హీరోలను అభినందించాలి.

    కొల్లేరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం దర్శకత్వం, స్క్రీన్ ప్లే ల మీద మరింత కష్టపడితే మంచి అవుట్ ఫుట్ ఖచ్చితంగా వచ్చి ఉండేదనిపిస్తుంది.

    డబ్బుతో పాటు బోలెడంత ఇగో ఉన్న కుర్రాడు రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్). అతని ఈగోని ఎవరన్నా హర్ట్ చేస్తే వారిని తిరిగి దెబ్బకొట్టేడానికి ఎంతదూరం అయినా వెళ్లే రకం. అమెరికానుంచి వచ్చిన రానా కి...ఓ రోజు అనుకోని పరిస్దితిలో ఓ పోలీస్ ఆఫీసర్ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో గొడవపడి ఇగో దెబ్బతింటుంది. దాంతో పోలీస్,పొలిటికల్ పవర్ తో తనను దెబ్బ కొట్టాడని అదే డిపార్టమెంట్ లో చేరి, తిరిగి అతనికి బుద్ది చెప్దామనుకుంటాడు. అందులో భాగంగా ఏలూరు దగ్గరలోని కొల్లేరులో ఉద్యోగం వేయించుకుంటాడు. అయితే అక్కడకి వెళ్లే సరికి సీన్ వేరే రకంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతాన్ని అక్కడ ఎంపి దుర్గా ప్రసాద్(రావు రమేష్) ఏలుతూంటాడు. ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు,అక్కడ జరిగుతున్న అరాచకాలు, జర్నలిస్ట్ మిస్సింగ్ వంటివి చూసిన రానా ఏం చేసాడు... అతను ప్రేమలో పడిన మేఘ(విశాఖ సింగ్) ఎవరు... అతని ఇగో తృప్తి పొందిందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    'నేను సాయిం చెయ్యను...న్యాయం చేస్తాను" , చరిత్ర ఎప్పుడూ చెడ్డవాడినే గుర్తు పెట్టుకుంటుంది" వంటి ఆసక్తికరమైన సంభాషణలతో వచ్చిన ఈ దర్శకుడు తనలోని మాటల రచయితను బాగా వాడుకున్నట్లుగా స్క్రీన్ ప్లే రచయితను వెలికితీయలేదు. దాంతో స్టోరీ పాయింట్ ముఖ్యంగా ఎత్తుగడ ఆసక్తికరంగా ఉన్నా ట్రీట్ మెంట్ సరిగ్గా రాయలేకపోయారు. రానురాను సినిమాని ఎలా స్లో చేసేయాలి అనేదే టార్గెట్ అన్నట్లు స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసారు. దాంతో చాలా చోట్ల విసుగనిపించింది. ముఖ్యంగా విజువల్స్ స్టైలిష్ గా బాగా ఉన్నా దర్శకత్వం ఇమ్మిచ్యూరిటీ కనపడింది. నారా రోహిత్ ఇచ్చిన అవకాసం మరింత హోమ్ వర్క్ చేసి ఉంటే బాగా వినియోగించుకునేవాడనిపించింది.

    స్లైడ్ షో లో మిగతా రివ్యూ...

    ఆ మూడింటే మీదే దృష్టి

    ఆ మూడింటే మీదే దృష్టి

    సినిమా ఇంట్రడక్షన్, ఇంట్రెవెల్, క్లైమాక్స్ ఈ మూడింటి మధ్య జరిగే కథ అనుకున్నారో ఏమో కానీ వీటిని మాత్రం బాగా రాసుకున్నారు దర్శకుడు.

    సాగతీత ఎక్కువ...

    సాగతీత ఎక్కువ...


    చిన్న విషయాన్ని ఎక్కువ సేపు సాగతీయటం వల్ల బోర్ వచ్చేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో స్క్రిప్టుపై మరింత దృష్టి పెట్టాల్సింది.

    సిల్క్ బాబు...

    సిల్క్ బాబు...

    సినిమాలో కాస్త రిలీఫ్ పార్ట్..అదే ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే అది సిల్క్ బాబు గా పోసాని చేసిందే. ఆ డైలాగులు బాగానే పండాయి.

    ఇదేం లవ్వు...

    ఇదేం లవ్వు...

    కథంతా రాసుకున్నాక చివర్లో లవ్ ట్రాక్ కలిపినట్లు ఉంది. ఎందుకంటే ఎక్కడా కథలో కలవదు సరికదా అదే అడ్డం అవుతూంటుంది. తప్పదు కాబట్టి పెట్టినట్లుంది. దాన్ని కూడా కథలో కలిపేలా సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది.

    ఎప్పటిలాగే వీక్..

    ఎప్పటిలాగే వీక్..

    ఈ మధ్యన సినిమాల్లో ఎడిటింగ్ విభాగమే చాలా వీక్ గా ఉంటోంది. దానికి కారణం...దర్శకుడు తను రాసుకున్న సీన్స్ పై మమకారమో ఏమో. ఈ సినిమాల్లో నూ బోర్ సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. అలాగే సంగీతం కూడా అప్ టు ది మార్క్ లేదు.

    హైలెట్స్...

    హైలెట్స్...

    సినిమాటోగ్రఫీ బాగుంది.. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. అయితే ప్రతీ డైలాగులో ఏదో చెప్పాలన్న తాపత్రయమే కనపడింది. పంచ్ డైలాగులాగ..ఇది సందేశాత్మక డైలాగులు అన్నమాట. నారా రోహిత్ ఎప్పటిలాగే డైలాగులు బాగా చెప్పారు.

    పోటా పోటీగా...

    పోటా పోటీగా...


    సినిమాలో నారా రోహిత్ కు పోటా పోటీగా నటించిన నటుడు రావు రమేష్ మాత్రమే. ఆయన తన తండ్రి లాగ నెగిటివ్స్ రోల్స్ కు ఫెరఫెక్ట్ అన్నట్లు దూసుకుపోతున్నారు. ఈ సినిమాలోనూ టైలర్ మేడ్ క్యారెక్టర్ లాగ సెట్ అయ్యింది.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    సంస్ధ: సినిమా5, మూవీ మిరాకిల్‌
    నటీనటులు: నారా రోహిత్, విశాఖా సింగ్, రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య తదితరులు.
    కెమెరా: ఓం,
    ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌.
    సంగీతం: సన్ని
    కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణచైతన్య
    నిర్మాత: ప్రకాష్ రెడ్డి
    విడుదల తేదీ: 21,నవంబర్ 2014.

    ఏదైమైనా కొత్త దర్శకులు కేవలం విజువల్స్,డైలాగ్స్ మీదే కాకుండా స్క్రిప్టు ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఈ కాలం ప్రేక్షకులు రేసీ గా ఉండే థ్రిల్లర్స్ చూడటానికి అలవాటు పడ్డవారు..వారిని స్లో నేరేషన్ తో ఎక్కువ సేపు సస్టెన్ చేయటం కష్టం. ఎంతో అవసరం ఉండి, ఫీల్ కోసం తప్ప స్లో నేరేషన్ కు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Rowdy Fellow released today with average talk. The film narrates the story of a rich and egoistic young man Nara Rohit), who decides to become a police officer for personal reasons. However, in the process, he changes as a person and finds happiness in simple things. Directed by Krishna Chaitanya, the film's music has been scored by Sunny.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X