twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సో..సో..సోలో (రివ్యూ)

    By జోశ్యుల సూర్య ప్రకాష్
    |

    నటీనటులు:నారా రోహిత్‌, నిషా అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీ షిండే, ఎమ్మెస్‌ నారాయణ, అలీ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    ఆర్ట్: రఘు కులకర్ణి
    స్టైలింగ్: అర్చన పరశురామ్
    అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య
    నిర్మాణం: ఎస్వీకే సినిమా.
    నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌
    దర్శకత్వం: పరశురామ్‌

    'మంచి మొగుడు దొరికితే గుడిలో దేముడ్ని కూడా మరిచిపోతారు మా ఆడవాళ్లు",'పోయేటప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది కానీ... పుట్టినప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది"వంటి సెంటిమెంట్ డైలాగులను వెంటేసుకుని మరీ సోలో చిత్రం ధియోటర్లో దిగింది.బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ రెండో చిత్రమైన ఈ సోలో ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా,సెకండాఫ్ రన్ అవటానికి కీలకమైన కీ సీన్ మెలిక కృతకంగా ఉండటంతో ఎంత పిండినా చాలా చోట్ల అవి పేలవంగా మారాయి.దానికితోడు ముఖ్యంగా చాలా ముఖ్యమైన సన్నివేశాల్లో నారా రోహిత్ ఎక్సప్రెషన్స్ లేకుండా డైలాగులు చెప్తూండటం మైనస్ గా మారింది.అయితే దర్శకుడు పరసరామ్ మాత్రం తన గత రెండు చిత్రాల కన్నా మంచి చిత్రమే ఇచ్చాడని చెప్పాలి.

    సాలిడ్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో గౌతమ్(నారా రోహిత్)ఓ అనాధ.అతనికి ఒకటే జీవితాశయం.అదేమిటంటే అనాధ అయిన తాను గత పాతికేళ్లుగా సోలో బ్రతకు వెళ్లదీస్తున్నాడు కాబట్టి తను ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లిచేసుకుని వాళ్ళ కుటుంబంలో ఒకడై తన సోలో లైప్ కి బై చెప్పాలని.అందుకు తగినట్లు ప్రయత్నాలు చేస్తూంటే అతనికి డాక్టర్ కోర్సు చదువుతున్న వైష్ణవి(నిషా అగర్వాల్)పరిచమవుతుంది.రకరకాల కామిడీ ప్రయత్నాలతో ఆమెకు దగ్గరైన గౌతమ్ ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్)ని కలుస్తాడు.అయితే ఆమె తండ్రికి గౌతమ్ లాగే ఓ జీవితాశయం.అదేమిటంటే..తన కూతురుకి ఎట్టి పరిస్దితుల్లోనూ అనాధలకు ఇవ్వకూడదని,ఉమ్మడి కుటుంబంలోనే ఇవ్వాలని.ఎందుకంటే ఆయన అక్క(జయసుధ)ఓ అనాధని ప్రేమించి పెళ్లి చేసుకుని,కుటుంబం లేకుండా చేసుకుందని.అలా ఇద్దరూ ఉమ్మడి కుటుంబాలే కోరుకోవంటంతో ఈ ప్రేమ సఫలం కాదు...గౌతమ్ ని రిజెక్టు చేస్తాడు.అంతేగాక ఆమెకు విశ్వనాధం(షాయీజీ షిండే)కో మ్యారేజి నిశ్చయిస్తాడు.అప్పుడు గౌతమ్ సోలో గా ఏమి చేసి ఆమెను దక్కించుకున్నాడనేది మిగతా కథ.

    బొమ్మరిల్లు కథని పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుందో..అచ్చం సోలో అలా ఉంటుందంటూ ఈ సినిమా గురించి ఓ పాజిటివ్ టాక్ ని రిలీజ్ కు ముందే తేవటానికి ప్రయత్నించారు దర్శక,నిర్మాతలు.సినిమాలో డైలాగులు,సెకండాఫ్ లో వచ్చే ముమైయిత్ డాన్స్ వరకూ అదే నిజమే అనిపిస్తాయి.అయితే హీరో సెకండాఫ్ లో ఏమీ చేయలేక నిస్సహాయ స్ధితిలో హీరోయిన్ పెళ్లి చూస్తూ ఉండిపోయి తన మంచితనంతో ఆమె కుటుంబ సభ్యుల ప్రేమని గెలవాలని ఎదురు మాత్రం సిద్దు ప్రమ్ శ్రీకాకుళం గుర్తుకు తెస్తుంది.అలాగే హీరో అనాధ..అతను ప్రేమించిన అమ్మాయిది ఉమ్మడి కుటుంబం..అనేది మాత్రం వంశీ ప్రేమ అండ్ కో అనే చిత్రం గుర్తుకు తెస్తుంది.సర్లే ప్రపంచంలో ఉన్నవి ఏడే కథలు కదా..అని సరిపెట్టుకుని ముందుకెళితే ఫస్టాఫ్ హీరో ప్రేమ,కామిడీతో రన్ చాలా స్పీడుగా వెళ్లిపోయింది.

    సెకండాఫ్ కి వచ్చేసరికి హీరోయిన్ ఇంట్లో హీరో ఉండాలి కాబట్టి..హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోయే కుర్రాడి తండ్రి ఓ విచిత్రమైన కండీషన్ పెడతాడని ట్విస్ట్ ఇచ్చారు.అదేమిటంటే..తన కొడుకు చేసుకోబోయే అమ్మాయికి లవ్ ఎఫైర్ ఉంది కాబట్టి..ఆమెను ప్రేమించివాడు ఎదురుగానే ఆమెకు పెళ్లి చేస్తే రేపు ఎలాంటి సమస్యలు రావు అని నమ్మి..హీరోని పెళ్లయ్యే వరకూ అక్కడే పెళ్లిలో ఉండాలని షరతు పెడతాడు.అప్పటివరకూ సహజంగా జరుగుతోందనుకున్న కథ ఈ మలుపుతో కృతకంగా మారిపోతుంది.ఎందుకుంటే ఎంత సినిమా కథ అయినా ..తన కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ..లవర్ పిలిచి పెళ్లిలో ఉండాలని ఎవరూ కండిషన్ పెట్టరు కదా.దాంతో సకెండాఫ్ లో హీరో చేయటానకి ఏమీ లేక ఎప్పటికైనా తన మంచితనం బయిటపడకపోతుందా..తనకే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకబోతారా అని ఎదురుచూస్తూండిపోతాడు.దాంతో సెకండాఫ్ లో హీరో ఉండే సీన్స్ అరుదైపోయి,అలీ కామిడీ,ప్రకాష్ రాజ్,జయసుధ సీన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యిపోయాయి.

    స్క్రిప్టు సంగతి ప్రక్కన పెడితే దర్శకుడే డైలాగు రైటర్ కావటంతో చాలా చోట్ల టప్పట్లు కొట్టించే డైలాగులు పడ్డాయి.కామిడీ సీన్స్ సైతం బాగానే పండాయి.ఇక నారా రోహిత్ నటన విషయానికి వస్తే బాణంలోనే బాగున్నాడనిపిస్తుంది.చాలా చోట్ల ఎక్సప్రెషన్స్ కరువయ్యాయి.ఎంతో ఎమోషన్ ల్ గా డైలాగు చెప్తాడనుకున్న చోట మొక్కుబడికి పాఠం అప్పచెప్పినట్లు డైలాగ్స్ చెప్పేసాడు.నిషా అగర్వాల్ మాత్రం అద్బతం కాకపోయినా తన పరిధి మేరకు బాగానే చేసింది.మణిశర్మ సంగీతం మెల్లిగా ఎక్కేటట్లు ఉంది.ఎడిటింగ్,కెమెరా ఓకే.ప్రకాష్ రాజ్,జయసుధ నటన ఎప్పటిలాగే వంకపెట్టలేని విధంగా సాగింది.అయితే ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ సినిమాలో ముమైత్ డాన్స్ పెట్టడమే ఆశ్చర్యం అనిపిస్తుంది.సెకండాఫ్ లో అలీ..లండన్ నుంచి వచ్చిన షాయీజీ షిండే కూర్చోబెట్టి తన లవ్ స్టోరీ అంటూ ఒక్కడు,ఖుషీ,సింహాద్రి వంటి కథలు చెప్పటం మాత్రం బాగా నవ్విస్తుంది.

    ఫైనల్ గా పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం ఆయన సినిమాల్లో లాగానే ఎంటర్టైన్మెంట్ కు లోటు రానివ్వదు.హింస,అసభ్యత వంటివి లేకుండా జాగ్రత్తపడ్డారు కాబట్టి ఫ్యామిలీలు కూడా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు.అయితే రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు వస్తున్నాయి.సరిగ్గా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోని ఈ చిత్రం మౌత్ టాక్ వచ్చి ఫ్యామిలీలు వెళ్ళితేనే సక్సెస్ అవుతుంది.

    English summary
    Nara Rohit starrer Solo with a tagline Solid Love Story is hitting the big screens on 24th November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X