twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐక్యూ కు పరీక్షతో...('నాన్నకు ప్రేమతో' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    --సూర్య ప్రకాష్ జోశ్యుల

    ప్రపంచ సినిమాకు సాధారణ ప్రేక్షకుడు సైతం ఎక్సపోజ్ అవుతున్న ఈ సమయంలో తెలుగు సినిమా తనను తాను మార్చుకనే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమాన్ని అందిపుచ్చుకుని సుకుమార్ వంటి దర్శకులు తమ స్టైలిష్ మేకింగ్ తో ముందుకు వస్తున్నారు. అయితే అంతదాకా బాగానే ఉంది కానీ...కథల పరంగా మాత్రం ప్రేక్షకులు తెలుగుతనం ఉట్టిపడేవే ఇష్టపడుతున్నారు. కానీ అది గమనించక వారి ఐక్యూ స్ధాయిని దాటి తెరపై విన్యాసాలు చేస్తే నిర్విర్దంగా తిప్పి కొడుతున్నారు. ఐక్యూకి పరీక్ష పెట్టడం కన్నా...ఇక్యూ(ఎంటర్టైన్మెంట్ కోషియెంట్) మెప్పిస్తే చాలు అంటున్నారు. ఎన్టీఆర్ తనదైన శైలిలో అద్బుతమైన నటనను చూపెట్టాడు. సుకుమార్ కూడా ప్రతీ ఫ్రేమ్ చెక్కినట్లుగా అందంగా తీర్చిదిద్దాడు.

    అలాగే కథ కూడా రొటీన్ రివేంజ్ స్టోరీనే తీసుకున్నాడు...టెక్నికల్ గా అవుట్ స్టాండింగ్ గా ఉండేలా చూసుకున్నాడు. కానీ అన్నీ బాగానే ఉన్నా...నేరేషన్ మాత్రం ... సుకుమార్ గత చిత్రం 1 నేనొక్కడినే స్దాయిలో సాగింది. బటర్ ఫ్లై ఎఫెక్ట్ , ప్రాయిడ్ ధీరీ (అన్ ఫుల్ ఫిల్లిడ్ ఎమోషన్స్), ఎలక్ట్రా కాంప్లేక్స్ వంటి ఐక్యూ స్టఫ్ తో నింపేసాడు. కాబట్టి ఇది ఎన్టీఆర్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మాస్ ని ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేదానిపై విజయం స్ధాయి ఆధారపడి ఉంటుంది.

    లండన్ ఎన్నారై అభిరామ్ (ఎన్టీఆర్) కు తన తండ్రి రమేష్ చంద్రప్రసాద్ (రాజేంద్రప్రసాద్) గురించిన ఓ నిజం తెలుస్తుంది. అయితే ఆ నిజం తెలిసేటప్పటికే ఆయన మృత్యువుకు దగ్గరై రోజులు లెక్కపెడుతూంటాడు. ఆ నిజం ఏమిటంటే...తన తండ్రిని క్లోజ్ ఫ్రెండ్ కౌటిల్య కృష్ణమూర్తి (జగపతిబాబు) మోసం చేసాడని. దాంతో కోపం తెచ్చుకున్న అభిరామ్ తన తండ్రి బ్రతికి ఉండే ఆ కొద్ది రోజుల్లోనే మోసం చేసిన కృష్ణమూర్తిని రోడ్డు మీదకు తీసుకు వచ్చి బుద్ది చెప్పాలనుకుంటాడు. అయితే కృష్ణమూర్తి సామాన్యుడు కాడు...తెలివైన పెద్ద బిజినెస్ మ్యాన్. అతనిదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం. కృష్ణమూర్తిని పడగొట్టడానికి అభిరామ్ ఏం యాక్షన్ ప్లాన్ మొదలెట్టాడు. అందుకు కృష్ణమూర్తి ఎలా రెస్పాండ్ అయ్యి తిప్పికొట్టాడు. మధ్యలో కృష్ణమూర్తి కుమార్తె దేవిక (రకుల్) పాత్ర ఏమిటి... చివరకు ఏం జరిగింది అనేది మైండ్ గేమ్స్ తో సాగే కథ,కథనం.

    ఇలా తండ్రిని మోసం చేసినవారిపై కొడుకు పగ తీర్చుకునే రివేంజ్ కథలు తెలుగు సినీ ప్రేక్షకలకు ఇంకా చెప్పాలంటే ఏ భాషలోనూ కొత్తేం కాదు. అయితే అది ఎఫెక్టివ్ గా చెప్పాము అన్నదానిపై ప్రతీ సారి సక్సెస్ అవుతూ వస్తున్నారు దర్శకులు. సుకుమార్ అయితే ఈ సారి టెక్నికల్ గా టాప్ గా చూపి, స్టైలిష్ గా విలన్, హీరో లని చూపి కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేసాడు. అయితే స్ర్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా నడుస్తూ చాలా సార్లు మన ఐక్యూ కు పరీక్ష పెడుతూ సాగుతుంది. దానికి తోడు తనకు తెలిసిన సైన్స్, మాధ్స్ థీరిలను మిక్స్ చేసే ప్రయత్నం చేసాడు. దాంతో కథకన్నా వీటిపై దృష్టి ఎక్కువ అయ్యింది. వీటితో దర్శకుడుగా తెలివైన వాడు అనిపించుకోగలుగుతాడేమోనీ ప్రేక్షకుడుకి ఇవ్వాల్సినవి, రంజింప చేయాల్సినవి అందచేయలేదనిపిస్తుంది.

    ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ,క్లైమాక్స్ లు ముందు రాసుకుని మిగతా కథనాన్ని అల్లినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అవి రెండే పూర్తి ఎమోషన్ తో కనెక్ట్ చేస్తాయి. కాకపోతే సినిమాలో రక్తపాతం లేకుండా చెప్పాలనుకోవటం మంచి విషయం. అయితే ఇలాంటి కథలనుంచి ఎక్సపెక్ట్ చేసే థ్రిల్లింగ్ నేరేషన్ మాత్రం చాలా వరకూ మిస్సైంది. ఉన్న రెండు మూడు థ్రిల్స్ కూడా ఊహించేలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో నుంచి ఇలా మైండ్ గేమ్స్ తో ఫిజికల్ యాక్షన్ బాగా తక్కువ చూపుతూ..కథ నడుస్తూండటం కష్టమే అనిపిస్తుంది. రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమాకు భిన్నమే అయినా ఎన్టీఆర్ సినిమా అంటే ఇలాగైనా ఉండాలి అనుకునేవారికి ఇది ఇబ్బందికరమే. అయితే ఎన్టీఆర్ మాత్రం తన ఫెరఫార్మెన్స్ లో పీక్స్ కు వెళ్లాడనే చెప్పాలి. అంత బాగా చేసాడు. కొన్ని సీన్స్ లో ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన అంతర్జాతీయ స్ధాయిలో సాగింది. నటనలో ఎన్టీఆర్ కు ఇది లాండ్ మార్క్.

    మిగతా రివ్యూ..స్లైడ్ షోలో...

    ఇంట్రస్టింగ్

    ఇంట్రస్టింగ్

    కథ మొత్తం..."Changing one Thing. Change Everything" అంటూ సాగే.. బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ (గతంలో కమల్ దశావతారంలోనూ చూపారు) ధీరిని బేస్ చేసుకుని సాగుతుంది. ఆ ధీరిని చాలా సమర్ధవంతంగా అర్దమయ్యేలా చెప్పారు. ఇంట్రస్టింగ్ ఉన్న ఈ ధీరి ఎంత వరకూ కథకు ఉపయోగపడుతుంది అనేది ప్రక్కన పెడితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసారు.

    రకుల్ హాట్ ...బట్

    రకుల్ హాట్ ...బట్

    సినిమాలో రకల్ ప్రీతి సింగ్ చాలా హాట్ గా ఉంది. అయితే ఆమె డబ్బింగ్ వేరే వారు చెప్తే బాగుండేదని మాత్రం అనిపించింది. సినిమాలో ఆమె ఉన్నంతసేపూ ఎనర్జీతో పాత్ర సాగింది.

    జిగ్గూభాయ్

    జిగ్గూభాయ్

    సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు అదరకొడుతున్నారు. రూత్ లెస్ బిజినెస్ మ్యాన్ గా తనదైన స్టైల్ తో సినిమాకు మూల స్దంబమై నిలిచారు.

    ఎందుకిలా

    ఎందుకిలా

    సినిమాలో ఎంతో మేధావి అయిన బిజినెస్ మ్యాన్ రాజేంద్రప్రసాద్ ఎలా మోసపోయాడనేది మాత్రం స్ఫష్టంగా చెప్పలేకపోయాడు. సినిమాకు కీలకమైన ఎపిసోడ్ విషయంలో మరింత శ్రధ్ద పెట్టాల్సిందేమో అనిపిస్తుంది.

    టెక్నికల్ గా ...

    టెక్నికల్ గా ...


    విజయ్ సి చక్రవర్తి కెమెరా వర్క్ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్లింది. ఓ విజువల్ ఫీస్ట్ లా ఇంటర్నేషనల్ స్ట్రాడర్డ్స్ ఉన్న ప్రాజెక్టులా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లోని ఛేజ్ ని అద్బుతంగా తన షాట్స్ తో డిజైన్ చేసారు.

    సోసోగా..

    సోసోగా..

    ఇప్పటికే హిట్టైన ఐ వన్నాటు ఫాలో ఫాలో అంటూ సాగే పాట తప్ప మిగతావి ఆ స్ధాయిలో ఆకట్టుకోవు. దానికి తోడు పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్స్ గా ఉన్నాయి. అంతేకాదు ఎందుకనో ...బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవి ఫెయిలయ్యాడనిపిస్తుంది.

    కేక

    కేక


    కాస్ట్యూమ్స్ మాత్రం సినిమాలో కేక పెట్టించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సైతం సినిమాకు రిచ్ లుక్ ని తెచ్చిపెట్టాయి. రివేంజ్ డ్రామాకు ఓ ఇంటలెక్చువల్ లుక్ ని తీసుకు వచ్చాయని చెప్పాలి. అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ గడ్డం, హెయిర్ స్టైల్ ఓ రేంజిలో జనాలని రీచ్ అయ్యాయి.

    ఎవరెవరు...

    ఎవరెవరు...



    బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
    నటీనటులు: ఎన్టీఆర్‌ , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు
    సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,
    ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి,
    ఆర్ట్‌: రవీందర్‌,
    ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌,
    ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,
    పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌,
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌,
    నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌,
    సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.
    విడుదల తేదీ: 13,జనవరి 2016.

    ఫైనల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' కన్నా చాలా విషయాల్లో బెస్ట్ అనిపించే ఈ తండ్రి-కొడుకు ఎమోషన్ చిత్రం ఎంటర్ట్రైన్ మెంట్ విషయంలో మాత్రం చాలా దూరాన నిలబడింది. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా ఆడుతున్నాయనే విషయం ప్రక్కన పెడితే.. సినిమా అంటే కేవలం ఎంటర్నైమెంట్ మాత్రమే కాదు..స్లోగా ఉన్నా క్లాస్ గా ఉన్నా అదో విభిన్న చిత్రం అనుకుని చూసే వారికి ఈ సినిమా బాగుందనిపిస్తుంది. హీరో, దర్శకుడు తమ టార్గెట్ ఆ ప్రేక్షకులే అనుకుంటే వారి ఆకాంక్ష నెరవేరుతుంది. అలాంటి ప్రేక్షకులు ఎంత శాతం ఉన్నారు అనేదానిపై ఈ చిత్రం విజయం స్ధాయి ఆధారపడుతుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Nanaku Prematho Is one of The Most Awaited Movie In 2016, and released today(13th January 2016) with divide talk. “Naannaku Prematho” is a typical Sukumar film but with exceptional clarity and brilliance of performances.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X