twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ (పికె రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    3.5/5

    హైదరాబాద్: ఓ వైపు నటనలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. మరో వైపు ‘3 ఇడియట్స్' లాంటి ఆల్ టైం హిట్ అందించిన దర్శకుడు. వెరసి వెండితెరపై మరో మాస్టర్ పీస్ లాంటి సినిమా రాబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. ఆ సినిమా మరేదో కాదు...అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పికె'. ఈ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలైంది.

    3 ఇడియట్స్ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మరోసారి తన సత్తా చాటారు. ఈ రోజు విడుదలై ఈచిత్రం సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి, ప్రేక్షకులను ఇంతలా ఎంటర్టెన్ చేయడానికి 80 శాతం కృషి దర్శకుడిదే అని చెప్పక తప్పదు.

    PK Movie Review: Aamir Khan's Best Performance Till Date

    ‘పికె' సినిమాలో అన్ని అంశాలు బాగా కుదిరాయి. మంచి కథ, స్కిప్టు, డెప్త్, బలమైన మెసేజ్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా అంతా నవ్వులు పూయిస్తూ సోషల్ మెసేజ్‌తో సాగింది.

    తారాగణం: అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సౌరబ్ శుక్లా.

    PK Movie Review: Aamir Khan's Best Performance Till Date

    కథ విషయానికొస్తే....
    అమీర్ ఖాన్ ఆసక్తికర ఎంట్రీతో సినిమా మొదలవుతుంది. సినిమాలో సెకండ్ ఎంట్రీ ఇచ్చేది జగత్ జనని అలియాస్ జగ్గా(అనుష్క శర్మ). బెల్జియంలో ఆమె ఒక ఇండియన్ జర్నలిసమ్ స్టూడెంట్. పాకిస్థాన్ బాయ్ సర్ఫరాజ్(సుశాంత్ సింగ్ రాజ్ పుత్)తో ప్రేమలో పడుతుంది. వీరి మతాంతర ప్రేమను ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. దీంతో నిరాశకు గురైన ఆమె ఇండియా వచ్చి ఓ న్యూస్ ఛానల్ కోసం పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె విచిత్రమైన వ్యక్తి ‘పికె' తారస పడతాడు. అతని గురించి తెలుసుకునే క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇంతకీ పికె ఎవరు? అతను చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.

    PK Movie Review: Aamir Khan's Best Performance Till Date

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
    పికె అనేది ఒక డిఫరెంట్ చిత్రం. ఇందులో అమీర్ ఖాన్ తన భిన్నమైన నటనతో ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్ కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చిత్రమని చెప్పొచ్చు. అనుష్క శర్మ, బోమన్ ఇరానీ, తదితరులు బాగా నటించారు.

    PK Movie Review: Aamir Khan's Best Performance Till Date

    దర్శకుడు 2 గంటల 33 నిమాషాల పాటు ఫన్నీగా, డిఫరెంటు కాన్సెప్టుతో సోషల్ మెసేజ్ జోడిస్తూ సినిమా సాగింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన శంతను మిత్రా, అజయ్ -అతుల్, అంకిత్ తివారీ, రామ్ సంపత్ మంచి పని తీరు కనబరిచారు. వారి మ్యూజిక్ స్టోరీలైన్ తో పర్ ఫెక్టుగా సింక్ అయ్యాయి.

    అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ రాసిన డైలాగులు ఫన్నీగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉన్నాయి. స్టోరీ నేరేషన్ కూడా బావుంది.

    ఓవరాల్ గా చెప్పాలంటే పికె పైసా వసూల్ మూవీ. ప్రేక్షకులను సంతృప్తి పరిచే మూవీ.

    English summary
    Woohoo... PK is finally here and boy was I excited to watch this masterpiece on the big screen. After five years of sheer hard-work Rajkumar Hirani presented us with yet another cinematic brilliance, PK. 80% of the credit goes to the director for spinning this innovative concept into such an entertaining movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X