twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగం వినోదం...సగం తలపోటు!(పోటుగాడు రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని యంగ్ హీరో మంచు మనోజ్ తాజాగా 'పోటుగాడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకుకొచ్చాడు. కొత్త కథలతో లాభం లేదనుకున్నాడో ఏమో? కానీ కన్నడలో హిట్టయిన సినిమా తెలుగులో 'పోటుగాడు'గా రీమేక్ చేసారు.

    కథ విషయానికొస్తే...
    ప్రేమలో విఫలమైన గోవిందు(మంచు మనోజ్) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ చోటుకు వెళతాడు. అదే చోటుకి వెంకట రత్నం(పోసాని కృష్ణ మురళి) కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. చచ్చేముందు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. గోవిందు తన నాలుగు ప్రేమకథల గరించి మొదలు పెట్టడంతో ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

    సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక విభాగం పనితీరు, విశ్లేషణ స్లైడ్ షోలో....

    పోటుగాడు

    పోటుగాడు

    తొలుత గొవిందు వైదేహి అనే బ్రహ్మాణ అమ్మాయితో ప్రేమలో పడతాడు. వైదేహి(సిమ్రాన్ కౌర్) తండ్రి అడ్డుచెప్పడంతో ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత ముంతాజ్(సాక్షి చౌదరి)తో ప్రేమలో పడతాడు కానీ వర్కౌట్ కాదు. మూడోసారి ఫారిన్ లేడీ స్టేసీ(రేచల్)తో ప్రేమలో పడతాడు....ఈ ప్రేమ కూడా ఫెయిల్ అవుతుంది. నాలుగోసారి మేరీ(అనుప్రియ)తో లవ్ ఎఫైర్ మొదలెడతాడు. మేరీతో జీవితంలో నిమైన ప్రేమ అనుభూతిని పొందుతాడు. కానీ ఈ ప్రేమ కూడా ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. గోవిందు ప్రేమలో ఎందుకు విఫలం అయ్యాడు? ముగింపు ఏమిటనేది థియేటర్లో చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే....మనోజ్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కొన్ని చోట్ల ఓవరాక్షన్ కనిపిస్తుంది. ఫైట్లు, డాన్సులు ఓకే. హీరోయిన్ల విషయానికొస్తే నలుగురివీ చిన్న పాత్రలే. ఒక్కో హీరోయిన్ ఒక్కో పాటకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం అయ్యారు. నలుగురూ జస్ట్ ఓకే. పోసాని తనదైన మ్యానరిజంతో నవ్వించాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే వేగంగా వినోదాత్మకంగా సాగింది. అయితే సెకండాఫ్‌ స్లోఅవడంతో పాటు ఎంటర్టెన్మెంట్ కూడా తగ్గింది. క్లైమాక్స్‌లో రొటీన్ గా ఉండటం నిరాశ పరుస్తుంది. డైలాగులు ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు అందించిన సంగీత సినిమాకు హైలెట్ గా ఉంది. ముఖ్యంగా శింబుతో పాడించిన తెల్ల పిల్ల సాంగ్, మనోజ్ పాడిన ప్యార్ మే పడిపోయామై సాంగ్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎడిటింగ్ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోలేదని స్పష్టం అవుతుంది.

    ఫైనల్ గా...

    ఫైనల్ గా...

    కొన్ని చోట్ల మనోజ్ ఓవరాక్షన్, సెకండాఫ్, క్లైమాక్స్ సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి. అయితే మనోజ్ గత సినిమాలతో పోలిస్తే కాస్త బెటరే. సినిమా చూడాలనుకునే వారు ఫస్టాఫ్‌లో వినోదంతో పాటు...సెకండాఫ్‌లో తలపోటు భరించడానికి సిద్ధంగా ఉండాలి.

    నటీనటులు, సాంకేతిక విభాగం

    నటీనటులు, సాంకేతిక విభాగం


    నటీనటులు : మనోజ్, సిమ్రాన్ కౌర్, సాక్షి చౌదరి, రేచల్, అనుప్రియ, సోసాని కృష్ణ మురళి, అలీ, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు...
    నిర్మాణ సంస్థ : రామలక్ష్మి సినీ క్రియేషన్స్
    సంగీతం : అచ్చు
    మాటలు : శ్రీధర్ సీపాన
    సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్
    ఎడిటింగ్ : ఎంఆర్ వర్మ
    నిర్మాతలు: లగడపాటి శ్రీధర్, శిరీష
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పవన్ ఒడయార్

    English summary
    Pavan Wadeyar debuted as director in Kannada with the movie Govindaya Namaha. Besides wonderful script and direction, his unique marketing strategy made this movie a big hit in the Sandalwood Box Office. After delivering another hit with Googly in Kannada, he is foraying into Tollywood with Potugadu, a remake of his first directorial venture, which is a comedy drama featuring funnyman Komal Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X