twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైస్ డౌన్...( 'మసాలా' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---జోశ్యుల సూర్య ప్రకాష్

    హిందీలో హిట్ అయిన 'బోల్‌ బచ్చన్‌' రీమేక్ అనగానే...ఎన్నో సార్లు తెరపై చూసిన పాత కథ, సీన్సే కదా...ఇంక కొత్తగా చెప్పేదేముంటుంది...అంతగా బడ్జెట్ పెట్టి ఇద్దరు హీరోలతో చేస్తున్నప్పుడు స్క్రిప్టు సైడ్ మార్పులతో ఏదో మ్యాజిక్ చేసే ఉంటారు...ఏం చేసి ఉంటారనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే రీమేక్ రైట్స్ ని బోలెడు డబ్బు పెట్టి తీసుకున్నాం కదా...దాన్ని మార్చటం ఎందుకు అనుకున్నారేమో...నటీనటుల హావ భావాలు, డ్రస్,లొకేషన్స్, సీన్స్ ఏమీ మార్చకుండా అచ్చుగుద్దినట్లు అన్నీ మూల చిత్రంలో ఉన్నవే ఉంచారు...అనుకరించారు. దానికి తోడు ఎంతో ఆశలు పెట్టుకున్న వెంకటేష్ బట్లర్ ఇంగ్లీష్ కూడా కిక్ ఇవ్వలేకపోయింది. చాలా డైలాగులు..ఇంగ్లీష్ పదాలుకు అర్దాలు తెలియకపోవటంతో అర్దం కాకుండా, లేనివిగా మిగిలిపోయాయి..అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ కావటంతో టైం పాస్ వ్యవహారంగా ఓ చూపు చూద్దామనుకునేవారితో జస్ట్ ఓకే అనిపించుకునే అవకాసం ఉంది.

    ఒక అబద్దం ఆడితే ...ఆ అబద్దం కప్పి పుచ్చుకోవటానికి మరో అబద్దం...దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో అబద్దం ఆడాల్సిన పరిస్ధితి వస్తుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ... కోర్టు కేసులో ఓడిపోయి....ఆ కేసు కోసం ఆస్ధి పోగొట్టుకుని, కేసు ఓడగొట్టినందుకు కోపంలో ఆ లాయిర్ ని కొట్టి ఇరుక్కపోయిన రహమాన్(రామ్) నిరాశలో ఏం చేయలేని స్ధితిలో ఉంటాడు. అప్పుడు తన తండ్రి స్నేహితుడైన నారాయణ(ఎంఎస్ నారాయణ) సహాయంతో అతని అక్క సానియా(అంజలి) పెళ్లి కోసం, కుటుంబ పోషణ కోసం భీమరాజపురం వెళ్తాడు. అక్కడ ఊరి పెద్ద బలరాం(వెంకటేష్). బట్లల్ ఇంగ్లీష్ మాట్లాడే అతనికి అబద్దం ఆడేవాళ్లు అంటే మంట..చంపటానికి సైతం వెనుకాడడు. అయితే ఆ విలేజ్ వెళ్లగానే రహమాన్ కొన్ని తప్పని పరిస్దితుల్లో...అబద్దమాడి తన పేరు రామ్‌గా పేరు మార్చుకుని ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ నుంచి...వరసగా ఒక అబద్దం బయిటపడకుండా దాచటం కోసం..మరొకటి..దాన్ని దాచటానికి మరొకటి..చైన్ లా అబద్దాలు అల్లుకుంటూ ముందుకు వెళ్లాల్సిన స్థితి వస్తుంది. అలాంటి స్ధితిలో బలరామ్ కి నిజం ఎలా తెలిసింది.... రహమాన్ ఎలా బయిటపడ్డాడు..కథలో హీరోయిన్స్ పాత్రేమిటి తెరపై చూడాల్సిన మిగతా కథ.

    వాస్తవానికి 'బోల్‌ బచ్చన్‌' చిత్రం స్టోరీ ఐడియా, ఇందులో సీన్స్ మొదటే చెప్పినట్లు కొత్తేమీ కాదు...అందులోనూ రోహిత్ శెట్టి సినిమాల్లో సీన్స్ చాలా భాగం దక్షిణాది సినిమాలనుంచి ఎత్తేసివే ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని నెక్ట్స్ లెవిల్ కి స్క్రిప్టు సైడ్ తీసుకు వెళ్తే బాగుండేది. రోహిత్ శెట్టి..గోల్ మాల్ ని ... 'బోల్‌ బచ్చన్‌'గా సెటప్ ఎలా మార్చి చేసారో..అలాగే 'బోల్‌ బచ్చన్‌'లో స్క్ర్రీన్ ప్లే మార్చి, సీన్స్ కూడా నేటివిటికి తగ్గట్లు కసరత్తు చేసి కొత్తవి వేసుకుంటే (.దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా మార్చినట్లు) ఖచ్చితంగా మరో మంచి సినిమా అయ్యిండేది. కథలో వచ్చే మలుపు,జోక్ లు చాలా అవుట్ డేటెడ్ గా...ఊహకు అందే విధంగా ఉన్నాయి. సినిమాలో బాగా పేలింది ఏమిటి అంటే...కోవై సరళ ని తల్లిగా పరిచయం చేసేటప్పుడు వరసగా సెటప్ చేసిన తల్లులు దిగటం థియోటర్ లో విజిల్స్ పడ్డాయి. అలాగే లవ్ సీన్స్ కి ప్లేస్ మెంట్ లేకపోవటంతో కేవలం పాటల కోసమే అవి పెట్టినట్లు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్యారెక్టర్స్ లో ఎమోషనల్ డెప్త్ లేదు..క్లైమాక్స్ అయితే హారిబుల్...అదే సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో....

    టైటిల్ లోనే కానీ...

    టైటిల్ లోనే కానీ...

    టైటిల్ కి తగ్గ రీతిలో సినిమా లేదు. అంతేగాక ఓపినింగ్స్ ని కూడా రాబట్టుకోలేకపోయింది. మసాలా ఘాటు బాగా తక్కువగా ఉంది. ఎంతసేపు దర్శకుడు...పూర్తిగా వెంకటేష్ చేత ఇంగ్లీష్ డైలాగులు చెప్పించి నవ్విద్దాం లేదా..హీరో గే పాత్రలా నవ్విద్దామనే ప్రయత్నమే కానీ...మిగతా ఎలిమెంట్స్ పై శ్రద్ద పెట్టలేదు. తెలుగు సినిమాకు కావాల్సిన దినుసులు సరిగ్గా వేయలేకపోయాడు.

    కాంబినేషన్ ఓకే కాని...

    కాంబినేషన్ ఓకే కాని...

    వెంకటేష్,రామ్ కాంబినేషన్ చూడ్డానికి బాగానే ఉంది కానీ...ఇద్దరికీ పెద్ద స్కోప్ ఉన్న పాత్రలు కావు...ఎక్కడో మనకు సంభంధం లేని పాత్రల్లా కనపడతాయి. అలాగే హీరోల ప్రేమ కథలు కూడా చాలా అర్దాంతరంగా మెదలై..అర్దాంతరంగా ముగుస్తాయి. ముఖ్యంగా డ్రస్ నుంచి హిందీ నేటివిటికి వెళ్లటడం తో బాగా తేడాగా కనపిస్తుంది. మన నేటివిటిలో వెంకటేష్ కు ఇక్కడ ఊరి పెద్ద లుక్ ఇవ్వాల్సింది.

    రామ్...రామ్ లాగ

    రామ్...రామ్ లాగ

    రామ్ ఇందులో రెండు పాత్రలలో నటిస్తూ ఇరుకున పడే సిట్యువేషన్స్ ఉంటాయి. వాటిల్లో రామ్ బాగా చేసాడు. అయితే వేరియేషన్ పెద్దగా కనపడదు.. అలాగే రామ్ పాత్ర ఇరుకున పడినప్పుడు అతను కష్టపడి దాన్నుంచి బయిటకు వచ్చేది కనపడుదు..మిగతా పాత్రలన్ని అతనికి సపోర్ట్ చేసి బయిటు పడేస్తూంటాయి. దాంతో రామ్ కి పెద్ద ఏమీ కనపడదు.

    ఎనర్జీ మిస్...

    ఎనర్జీ మిస్...


    రామ్ సినిమా అంటేనే బోల్డంత ఎనర్జీ ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే చిత్రంగా రామ్ లో అదే మిస్ అయ్యింది. అతను పాత్ర కార్డ్ బోర్డ్ లా కామిక్ పాత్రలా దానంతట వెళ్లిపోతుంది. రామ్ చేసిందేమీ కనపడదు. సీన్ లో కనపడాలి కాబట్టి కనపడుతున్నాడనిపిస్తుంది. ముఖ్యంగా హిందీలో క్లిక్ అయిన గే పాత్ర ఇక్కడ అస్సలు కిక్ ఇవ్వలేదు. అందులో జీవం పొయ్యలేకపోయాడు.

    ప్రయత్నించాడు కానీ..

    ప్రయత్నించాడు కానీ..

    వెంకటేష్..హీరో గా ఇంతకు ముందు వచ్చిన సీతమ్మవాకిట్లో ...అన్నగా కనపించి అలరించారు. కానీ ఇందులో శ్రీహరి ..ఢీ లో వేసిన తరహా పాత్రను..పోషించారు. పాటలు తీసివేస్తే అదే పాత్ర గుర్తుకు వస్తుంది. వెంకటేష్ వచ్చీ రాని ఇంగ్లీష్ తో నవ్విద్దామని ప్రయత్నించాడు కానీ అవి అక్కడక్కడే పండాయి.

    టెక్నికల్ గా

    టెక్నికల్ గా

    సినిమాటోగ్రఫి చాలా పూర్ గా ఉంది. ఎడిటింగ్ కూడా సోసోగా ఉంది. పాటల విషయానికి వస్తే...అందులో రెగ్యులర్ ధమన్ ట్యూన్స్...ఎనర్జీ మిస్సైన ఫీలింగ్...ఈ సినిమాకు ప్రాణంగా నిలవాల్సిన డైలాగులు అక్కడక్కడ మాత్రమే పేలాయి.

    దర్సకత్వం...

    దర్సకత్వం...

    దర్శకుడుగా విజయ్ భాస్కర్...నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి నాటి ఛామ్ ని కోల్పోయారని పూర్తిగా స్పష్టం అవుతుంది. కాపీ పేస్ట్ అన్నట్లుగా ఆయన క్రియేటివిటీ మచ్చుకైనా లేకుండా సీన్స్ వచ్చిపోతూంటాయి. దాంతో ఫ్రేమ్ లో ఎక్కడా జీవం తొణికిసలాడదు.

    ప్లస్ పాయింట్స్...

    ప్లస్ పాయింట్స్...

    నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. వెంకటేష్ ..ఉన్నంతలో బాగా నవ్చించారు. ముఖ్యంగా కోవై సరళ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం. మిగతా పాత్రల్లో అలీ బాగానే చేసారు. ఎంఎస్ నారాయణ రెగ్యులర్ ఎక్సప్రషన్స్.

    ఫస్టాఫ్ లో...

    ఫస్టాఫ్ లో...

    సినిమా సెకండాఫ్ ..ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంటే మంచి టాక్ బయిటకు వస్తుంది. అలాంటిది ఆ రెండు చోట్లే ఈ సినిమాకు మైనస్ గా మారింది. జయప్రకాష్ రెడ్డి కామెడీ ఫస్టాప్ లో బాగుంది. వెంకటేష్ కాంబినేషన్ లో సీన్స్ బాగున్నాయి.

    బ్రహ్మానందం లేకపోయినా...

    బ్రహ్మానందం లేకపోయినా...



    ఈ సినిమాకు మరో విశేషం..కామెడీ సినిమా అయినా బ్రహ్మానందం లేకపోవటం జరిగింది. ఆ ఖాళీని మిగతా పాత్రలు పూర్తి చేసే ప్రయత్నం చేసాయి. అయితే ఎక్కడా హిలేరియస్ గా ఓ ఐదు నిముషాలు నవ్వించలేకపోయారు.

    సిట్యువేషన్ కామెడీ కాదు..

    సిట్యువేషన్ కామెడీ కాదు..

    కామెడీ సినిమాలకు ప్రాణమైన సిట్యువేషన్ కామెడీ సీన్స్ బాగా రొటీన్ గా ఉండటంతో అవి పండలేదు. డైలాగు కామెడీ మీద బాగా ఆధారపడ్డారు. అవి ఓ వర్గానికే పరిమితం అయ్యాయి. నిర్మాణ విలువలు మాత్రం రిచ్ గా ఉన్నాయి.

    తెర వెనక...

    తెర వెనక...

    నటీనటులు:రామ్, వెంకటేష్, షాజన్‌పదంసి, అంజిలి, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్‌.ఎస్‌.నారాయణ,పోసాని కృష్ణ మురళి, జె.పి, భరత్, కాదంబరి కిరణ్, రామ్‌జగన్, అనంత్, గీతాంజలి, కోవై సరళ, శ్రీలక్ష్మి తదితరులు
    కథ: రోహిత్‌శెట్టి,
    ఛాయాగ్రహణం: ఆండ్రూ,
    కళ: ఏ.ఎస్.ప్రకాష్,
    సంగీతం: తమన్‌
    ఎడిటింగ్: ఎస్.ఆర్.వర్మ,
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య,
    సమర్పణ: డి.సురేష్‌బాబు,
    నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.
    స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కె.విజయభాస్కర్.

    ఫైనల్ గా ఈ సినిమా హిందీలో 'బోల్‌ బచ్చన్‌' చూడని వాళ్లకి నచ్చే అవకాసం ఉంది. అలాగే వెంకటేష్,రామ్ అభిమానులకు నచ్చవచ్చు. మిగతా వాళ్లు ఓ వీకెండ్ లో సరదాగా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్ళచ్చు..

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Venkatesh has done another multi-starrer movie titled Masala, which features young actor Ram alongside him relesed today with average talk. The Victory star, who has already scored two hits like Nuvvu Naku Nachav and Malliswari with K Vijaya Bhaskar, has teamed up again with the director for the third time for this movie, which is the remake of hit Hindi film Bol Bachchan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X