twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొటీన్ క్రైమ్ థ్రిల్లర్.... (‘ఎటాక్’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5
    హైదరాబాద్: క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చెయ్యి. తాజాగా ఆయన నుండి వచ్చిన మరో క్రౌమ్ థ్రిల్లర్ 'ఎటాక్' ఈ రోజు రిలీజైంది. మంచు మనోజ్ హీరోగా నటించడం, ప్రకాష్ రాజ్, జగపతిబాబులు ముఖ్య పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్స్ తరచూ వస్తూనే ఉంటాయి. కానీ వర్మ సినిమా అంటే మాత్రం ఏదో తెలియని ఆసక్తి. అందుకు కారణం రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కాస్త డిఫరెంటుగా ఉండటమే. నేరేషన్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ 'ఎటాక్'తో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

     RGV's Attack movie review

    కథ విషయానికొస్తే...
    గురురాజ్(ప్రకాష్ రాజ్) హైదరాబాద్‌లో పెద్ద రౌడీ. సెటిల్మెంట్లు, దందాలు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం తర్వాత కుటుంబం కోసం అన్నీ వదిలేసి బిజినెస్ చేస్తూ జీవిస్తుంటాడు. రౌడీయిజం వదిలేసినా ప్రమాదమే. ఈ విషయం గురురాజ్ కు కూడా తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తానుంటాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఎటాక్ లో గురురాజ్ చనిపోతాడు. ల్యాండ్ డీలింగ్ గొడవ వల్లే నరసింహులు అనే వ్యక్తి గురురాజ్ మీద అటాక్ చేసి చంపేస్తాడని అంతా అనుకుంటారు. గురురాజ్ పెద్ద కొడుకు కాళీ(జగపతి బాబు) తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. రెండో కొడుకు గోపీ(వడ్డే నవీన్) ఇప్పటికైనా గొడవలు వద్దంటూ వారిస్తుంటారు. ముందు నుండీ ఈ గొడవలకు దూరంగా ఉండే రాధ మత్రం తండ్రి మరణంతో కాళి అన్నకు అండగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే దురదృష్ట వశాత్తు....నరసింహులు కోసం వెళ్లిన కాళి కూడా ఎటాక్ జరిగి చనిపోతాడు. అసలు గురురాజ్, కాళిలను చంపింది ఎవరు? తండ్రిని, అన్నను చంపిన వారిని రాధ ఎలా కనిపెట్టాడు, వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
    ఇప్పటి వరకు మంచు మనోజ్ తెరపై కనిపించిన తీరు... 'ఎటాక్' మూవీలో తెరపై కనిపించిన తీరు చాలా డిపరెంటుగా ఉంది. సీరియస్ పాత్రలో అందుకు తగిన ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు...అదరగొట్టారంతే. వడ్డే నవీన్ ఒకే. హీరోయిన్ గా సురభి అందం, పర్ఫార్మెన్స్ పరంగా ఓకే. విలన్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో పూనమ్ కౌర్ ఆకట్టుకుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల పరిధిమేరకు రాణించారు.

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే....క్రైమ్ థ్రిల్లర్స్ మూవీల్లో సీన్లు బాగా ఎలివేట్ కావాలంటే కెమెరావర్క్ అందుకు తగిన విధంగా ఉండాలి. సినిమాలో ఇది బాగానే వర్కౌట్ అయింది. నేపథ్యం సంగీతం కూడా ఓకే. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. వర్మ తనదైన మార్కు స్క్రీన్ ప్లే చూపించారు. డైలాగ్స్ కూడా ఓకే. ఇలాంటి అంశాలు ఎంత బావున్నా తొలిసారి అయితే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ వర్మ గత క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఇదే విధంగా తీసాడు. అవి చూసిన వారికి ఈ సినిమా పెద్దగా రుచించదు. సినిమాలో మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు అని చెప్పకొచ్చు.

    ఓవరాల్ గా చెప్పాలంటే.... 'ఎటాక్' రామ్ గోపాల్ వర్మ నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదు.

    English summary
    Attack is a 2016 Tollywood action, thriller Movie which is directed by Ram Gopal Varma. It is produced by C. Kalyan under the banner of CK Entertainments. The Film features Manchu Manoj, Surabhi and Poonam Kaur in a lead roles and Jagapati Babu and Prakash Raj in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X