twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారని వర్మ స్కీమ్... ('ఐస్ క్రీమ్-2' రివ్యూ)

    By Srikanya
    |

    తక్కువ బడ్జెట్ లో చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ మంది చూసినా నా సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అనే ఐడియాని నమ్మి చేస్తు్న్న వర్మ...తన ఐస్ క్రీమ్ చిత్రాల సీరిస్ లో రెండోది మన ముందుకు వదిలారు వర్మ. అది కరిగిపోయేలోగా(థియోటర్ నుంచి వెళ్లిపోయోలోగా) చూద్దామనకునే వాళ్లు, వర్మ మీద నమ్మకం సడలని వాళ్ళతో ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదట చిత్రం కన్నా బాగుందనిపిస్తుంది. ఆ సినిమా కన్నా కొద్దిగా కథ, ఆర్టిస్టులను పెంచి చేసిన ఈ చిత్రం బడ్జెట్ ని దృష్టిలో (మనది కాదు..సినిమాది) పెట్టుకుని చూసేవారికి బాగానే చేసారనిపిస్తుంది. అలాగే... మొదటి దానికన్నా ఈ రెండోది ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి...భవిష్యత్ లో ఈ సీక్వెల్ వరసలో వచ్చే ఏదో ఒక చిత్రం అద్బుతం జరిగే అవకాసమూ ఉందనిపిస్తుంది. ఏదైమైనా ఇది వర్మ చిత్రం కాబట్టి చూడాలి...మాట్లాడుకోవాలి అదే ఏ కొత్త దర్శకుడో చేస్తే...మొదటి ప్రయత్నమే ఇలా చేసేడేంటని ఆశ్చర్యపోవాలి..అంతే.

    కథ ఏమిటంటే.... కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఓ షార్ట్ ఫిలిం చేయాలని నిర్ణయించుకుంటారు.షూటింగ్ కోసం ఓ అడవికి వెళ్తారు. అక్కడకి వెళ్లి వెళ్లగానే..ఇలాంటి సినిమాల తరహాలో అక్కడ చిత్రమైన, భయపెట్టే సంఘటనలు జరగటం మొదలెడతాయి.అక్కడ నుంచి వారు తప్పించుకుందామని అనుకుంటే..వారు సిక్కా(జెడీ చక్రవర్తి)చేతికి చిక్కుతారు. సిక్కా అతని గ్యాంగ్ బ్యాంక్ దొంగలు..వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేసారన్నమాట. అప్పుడు ఊహించని ట్విస్ట్ పడుతుంది. గ్రూప్ లో ఒక్కొక్కరూ చనిపోవటం మొదలెడతారు. అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారు. ఎవరైనా మిగులుతారా...ఆ షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేసారా తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

    వాస్తవానికి ఇలాంటి సినిమాలు మనకు హాలీవుడ్ లో తారసపడుతూంటాయి. కొంతమంది అడవికి పోవటం,అక్కడ వరస పెట్టి మర్డర్స్ జరగటం..ఎవరో చేస్తున్నారో అన్వేషణ...చివర్లో ఆ మర్డర్స్ వెనక ఉన్న కారణం రివిల్ అవటం...భీభత్సం..క్లైమాక్స్...ఇదే ఇక్కడా ఫాలో అయ్యారు. అయితే సస్పెన్స్ ని చివరి దాకా మెయింటైన్ చేయలేకపోయారు. అలాగే... గత వర్మ హర్రర్ లేదా థ్రిల్లర్ సినిమాల్లో లాగానే... ఎత్తుగడ బాగున్నా తర్వాత ట్రీట్మంట్ సరిగ్గా కుదరలేదు. దాంతో మెల్లి మెల్లిగా థ్రిల్లింగ్ పెరగాల్సింది పోయి..తగ్గటం మొదలైంది. అయితే ఉన్నంతలో ఆర్టిస్టులు బాగానే ట్రై చేసారనిపిస్తుంది. వర్మ దర్శకత్వం గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. ఆయన ప్రయోగాలు చేయటంలో ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూంటారనేది మరోసారి మనకు గుర్తు వస్తుంది.

    RGV's  Ice Cream 2   review

    ఇక వర్మ సినిమాలు అంటే ఒకప్పుడు ఉండే క్రేజ్ వేరు. ఆయన పేరు చెపితే థియోటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్ లు పడేవి. పరిస్ధితి మారింది. సీన్ రివర్స్ అయ్యింది. ఆయన తనకు నచ్చిన సినిమాలు తనకోసమే అన్నట్లు తీస్తున్నారు(అది ఆయన ఇష్టం అనుకోండి). దాంతో హిట్ టాక్ స్ప్రెడ్ అయితే కాని జనం అటు వైపు వెళ్లటానికి ఆలోచనలో పడుతున్నారు. అందులోనూ టిక్కెట్ రేట్లు అనూహ్యంగా పెరిగిన నేపధ్యంలో ఆయన నో బడ్జెట్ లో తీస్తున్న సినిమాలను అంతెంత డబ్బు పెట్టి చూడ్డానికి ఆలోచిస్తున్నారు. దానికి తగినట్లే ఉంటున్నాయి ఆయన సినిమాలు కూడా. అయితే మొదటే చెప్పుకున్నిట్లుగా ఐస్ క్రీమ్ కన్నా ఈ సీక్వెల్ కొద్దిగా మెరుగు. ముఖ్యంగా జెడి చక్రవర్తి ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది. అతని గెటప్..అతని ద్వారా వచ్చే ఫన్ సినిమాలో బాగుంది.

    మిగతా డిపార్టమెంట్ లు ,సాంకేతికంగా మాట్లాడుకోవాలంటే వర్మ సినిమాల్లో హోల్ అండ్ సోల్ గా ఆయనే అన్నిటిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూంటారు...ఆయన ముద్ర ఉంటుంది కాబట్టి మంచైనా చెడైనా పెద్ద చెప్పుకోవటానికీ ఏమీ లేదు.

    కాకపోతే వర్మ లాంటి దర్శకుడు కూడా ఛీప్ గిమ్మిక్స్ మీద వల్గర్ సాంగ్స్ మీద ఆధారపడటమే దురదృష్టం అనిపిస్తుంది. అలాగే ఎప్పటిలాగే క్లైమాక్స్ ని సైతం ఎవరో తరుముకు వస్తున్నట్లు...టైమ్ అయిపోయిందని ముందే తెలిసిపోయినట్లు హడావిడిగా ముగించేసారు.

    ఫైనల్ గా తొలి ఐస్ క్రీమ్ సినిమా నచ్చిన వారికి ఈ సీక్వెల్ సినిమా అద్బుతంగా అనిపించవచ్చు...మిగతా వారికి... ఈ సినిమా కథలో షార్ట్ ఫిలిం చేయటానికి వెళ్లిన వాళ్లు చివరకు చేసిన షార్ట్ ఫిలిం ఈ సినిమానేమో అనిపించినా ఆశ్చర్యం లేదు.

    సంస్ధ : భీమవరం టాకీస్‌ పతాకం
    నటీనటులు :జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రి తదితరులు.
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ - టి భరత్ కుమార్,
    సంగీతం : సత్య కాశ్యప్
    ఎడిటర్: ప్రతాప్ కుమార్ సంగ
    కెమెరా: అంజి
    బడ్జెట్: Rs.2,00,000
    నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,
    కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!
    విడుదల తేదీ: 21,నవంబర్ 2014.

    English summary
    Ram Gopal Varma's second film in Ice Cream series, Ice Cream 2 released today(November 21st). Naveena, J.D.Chakravarthi, Nandu, Dhanraj, Bhupal etc acted in this film. The film has been produced on Bhimavaram Talkies banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X