»   » బాగా క్లాస్ పీకాడు (ఆర్పీ పట్నాయిక్ ‘మనలో ఒకడు’ రివ్యూ)

బాగా క్లాస్ పీకాడు (ఆర్పీ పట్నాయిక్ ‘మనలో ఒకడు’ రివ్యూ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

Rating:
2.0/5

మీడియా అంటే మీడియాలో పనిచేసేవారికి తప్ప చాలా మందికి చిన్నచూపే. అంతేకాకుండా మనుష్యుల వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేస్తోందంటూ విమర్శలూ ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ కోసం,టీఆర్పీల కోసం అవసరమైతే న్యూస్ ని క్రియేట్ చేస్తుందని, వక్రీకరిస్తుందని కంప్లైంట్స్ ఉన్నాయి.

అయితే మీడియాలో మంచి జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో మందికి జీవనోపాధి ఉంది. అయితే దాదాపు అందరూ సినిమాల్లో నెగిటివ్ గానే చూపెడుతున్నారు. ఇప్పుడు ఆర్పీ వంతు వచ్చింది. ఆయన తనదైన శైలిలో ఓ స్పీచ్ కూడా రాసుకుని, పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చేసారు.


సంగీత దర్శకుడిగా సక్సెస్ అయిన ఆర్పీ పట్నాయక్‌లో మంచి దర్శకుడు, నటుడు ఉన్నాడు. 'శీను వాసంతి లక్ష్మి', 'బ్రోకర్' చిత్రాలతో ఆ విషయం రుజువైంది. తాజాగా మరోసారి ఆయన మెగాఫోన్‌ పట్టి మీడియా నేపథ్యంలో 'మనలో ఒకడు' తెరకెక్కించారు.


సంచలనాల కోసం, టీఆర్పీలకోసం మీడియా ఏం చేస్తోందో చూపెట్టానంటూ ఆర్పీ పట్నాయక్‌ చెప్పడంతో 'మనలో ఒకడు'పై జనాల్లోనూ ఆసక్తి ఏర్పడింది.వారి అంచనాలు అందుకునేలా ఈ చిత్రం ఉందా ? మీడియా గురించి ఆర్పీ ఏం చూపించారు? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.


కథలో అర్పీ పాత్రేమిటంటే..

నిజాయితీయే ప్రాణంగా భావిస్తూ స్టూడెంట్స్ కు ఫిజిక్స్ భోదిస్తూ జీవిస్తున్న ఫ్రొఫెసర్ కృష్ణమూర్తి(ఆర్పీ పట్నాయిక్) . సింపుల్ గా బ్రతికే అతని భార్య శ్రావణి (అనిత) కూడా అలాంటిదే. ఆవిడ పిల్లలకి సంగీత పాఠాలు చెప్తూంటుంది. ఇల్లూ, కాలేజ్ తప్ప వేరే జీవితం ఎరగని అతని జీవితం ఓ రోజు టీవిలో వచ్చిన ఓ న్యూస్ తో తిరగబడుతుంది.


ఆర్పీ జీవితం తిరగబడే టీవీ న్యూస్

కృష్ణమూర్తి పై కాలేజీలో చదువుకొనే ఓ స్టూడెంట్ తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్‌ ‘కీచకుడు' అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి రోడ్డున పడతాడు


తను అమాయకుడుని ప్రూవ్

తను నిర్దోషిని అని, తనుకు అందలో పాత్ర ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాలని కృష్ణమూర్తి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అంతకు మించి అన్నట్లు వరస్ట్ గా అయ్యిపోతుంది సిట్యువేషన్. దాంతో కృష్ణమూర్తి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు.


ఛానెల్ ఎండీ పాత్ర ఏంటి

నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్‌ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్‌ ఎండీ ప్రతాప్‌ (సాయికుమార్‌) పాత్ర ఏమిటి? ఎలా ఆ సమస్యలు నుంచి బయిటకు వచ్చాడు. తను నిర్దోషిని అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు. తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.


నేచురల్ గా ఉంది

నిజానికి ఆర్పీ పట్నాయిక్ ఈ కథ కోసం తీసుకున్న నేపధ్యం, సంఘటనలు చాలా నాచురల్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా కథని సెటప్ చేస్తూ వెళ్లిపోయారు. ముఖ్యంగా విద్యార్థుల గౌరవాభిమానాల్ని చూరగొన్న లెక్చరర్ కృష్ణమూర్తిపై లైంగిక వేధింపుల అభియోగం రావడం ప్రేక్షకుడిని వెంటనే కథలో లీనం చేస్తుంది. అయితేనేం ఆ తర్వాత అంత పగడ్బందీగా కథని నడపలేకపోయారు.


సాగుతున్నట్లు..స్లోగా

ఇలాంటి సినిమాలు పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి. సమాజాన్ని ప్రశ్నించే విధానం నచ్చుతుంది. అంతేకానీ మెల్లిగా అదే పాయింట్ చుట్టూ అదే సీన్స్ రిపీట్ అవుతూంటే ఇబ్బందిగా ఉంటుంది. మనలో ఒకడు..అదే సమస్యను ఎదుర్కొంది. సినిమా ఫస్ట్ టర్న్ తీసుకున్న వద్దనుంచి క్లైమాక్స్ వరకూ ఒకే రకంగా ఎరౌండ్ బుష్ అన్నట్లు సాగుతుంది.


తెలిసినా...

ముఖ్యంగా తప్పు ఎక్కడ జరిగింది... అసలు తప్పు ఎవరు చేశారన్నది అందరికీ ముందే తెలిసినప్పటికీ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చివరిదాకా చేయకపోవడమనేది విసిగిస్తుంది. మన కథా సౌలభ్యం కోసం సీన్స్ అల్లుకుంటూ విషయం ట్రాక్ తప్పించినట్లు అనిపిస్తుంది. కథ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది.


మీడియాకు సందేశం...

ఇక ఈ సినిమాలో ప్రి క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకి కీలకం. నాజర్‌, సాయికుమార్‌ల మధ్య సన్నివేశాలు సినిమాని అప్పటిదాకా ఉన్న వాటినుంచి మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఊహించని విధంగా చివర్లో .. ఆర్పీ పట్నాయక్‌ వచ్చి మీడియాకి సందేశాన్ని ఇవ్వడం మొదలుపెడతాడు. అదంతా క్లాస్‌ తీసుకొన్నట్టు అనిపిస్తాయి.


సినిమాలో బాగా పేలినవి..

మూడో కన్ను ఛానల్‌ ప్రతాప్‌ పాత్రలో సాయికుమార్‌ నటన సినిమాకి హైలెట్ గా నిలిచంది. అలాగే పబ్లిసిటీనే మెయిన్ గా .. కనీస అవగాహన లేకుండా ఛానళ్లలో కూర్చుని మాట్లాడే శతావతారం పాత్రలో జయప్రకాష్‌రెడ్డి నవ్విస్తారు.


సినిమాకు పనిచేసింది వీరే

బ్యానర్ : యూనిక్రాఫ్ట్ మూవీ
నటీనటులు: ఆర్పీ పట్నాయక్‌, సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీముఖి, రఘుబాబు, బెనర్జి, గొల్లపూడి మారుతీరావు, రాజా రవీంద్ర, 'జెమిని' సురేశ్, దువ్వాసి మోహన్, సందేశ్, గిరిధర్, వరుణ్, గుండు సుదర్శన్, కృష్ణవేణి, 'జబర్దస్త్' రాకేశ్ తదితరులు
ఛాయాగ్రహణం: ఎస్‌.జె.సిద్ధార్థ్‌
సంభాషణలు: తిరుమల్‌నాగ్‌
కూర్పు: ఎస్‌.బి.ఉద్ధవ్‌
నిర్మాత: గురుజాల జగన్మోహన్‌
కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఆర్‌.పి.పట్నాయక్‌
విడుదల తేదీ: 4-11-2016


English summary
R P Patanaik’s Manalo Okadu on media’s wrong doings released today with divide talk. Starring Anita as the female lead,Let’s see how it is.
Please Wait while comments are loading...