twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టేల్ ('సుబ్రమణ్యం ఫర్ సేల్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    భాక్సాఫీస్ ని గెలవాలంటే హరీష్ శంకర్ లాంటి విషయం ఉన్న దర్శకుడుకి కూడా స్టేల్ అయిపోయిన సబ్జెక్ట్ ని తీసుకుని దానికి పరమ రొటీన్ ట్రీట్ మెంట్ ని ఇచ్చుకుంటూ కథ,కథనం రాసుకోవాలని ఎందుకు అనిపిస్తుందో అర్దం కాదు. రొటీన్ కథలు, సీన్స్ వర్కవుట్ అవ్వచ్చు...కానీ కేవలం రొటీన్ కథలే వర్కవుట్ అవుతాయనే ఎక్కడా రూల్ లేదు కదా... ఎందుకిలా జరుగుతోందా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే. బావగారు బాగున్నారా, మొగడు కావాలి మాత్రమే కాక అనేక పాత,కొత్త సినిమాల సీన్స్ కలబోసుకుని ఈ మెగా మేనల్లుడు సినిమా దిగింది.

    ప్రతీ సీన్ ఎక్కడో చూసినట్లు అనిపించటం ప్రత్యేకతగా దర్శకుడు కావాలని డిజైన్ చేసినట్లు ఉంటుంది. అంతెందుకు హీరోయిన్ కంటిన్యూగా చెప్పే డైలాగు కూడా ..'సీతతో అంత ఈజీ కాదు'... ఇంతకు ముందు ఎక్కడో విన్నట్లు ఉంటుంది. అలాగే ప్రధాన పాత్రలన్నిటికి ప్లాష్ బ్యాక్ లు ఉండటం దీని స్పెషాలిటి...నాలుగైదు ప్లాష్ బ్యాక్ లు ఒకే కథలో వస్తున్నప్పుడే దర్శకుడు జాగ్రత్తపడి ఉండాల్సింది. ఏదైనా ఎక్కడా ఫ్రెష్ ఫీల్ అనేది లేని ఈ సినిమా హీరో అభిమానులుకు మాత్రం నచ్చేలా నాలుగు ఫైట్స్, ఆరు ఫైట్స్ తో ఫార్ములాతో వచ్చింది. డిస్కౌంట్ సేల్ కు ఇచ్చినా కూడా కష్టమే అనిపిస్తుంది సినీ లవర్స్ కు.

    సుబ్రమణ్యం(సాయి ధరమ్ తేజ) నిరంతరం డబ్బు సంపాదించాలని తపిస్తూ, తనని తాను అమ్మకానికి పెట్టుకుంటూంటాడు. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తూ తనను, తన సమయాన్ని అమ్ముకుంటూ సంపాదనలో బిజీగా ఉంటూంటాడు. ఆ టైంలోనే సీత(రెజీనా)నా పరిచయం అవుతుంది. ఆమె కు కర్నూల్ లో పెళ్లి ఫిక్సైన సమయంలో ...ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ అమెరికా కుర్రాడితో ప్రేమలో పడి అమెరికా పారిపోయి వచ్చేస్తుంది. అమెరికా వచ్చాక...అతను ఓ మంచివాడు కాదని తెలుసుకున్న సమయంలో సుబ్రమణ్యం పరిచయమై అండగా నిలుస్తాడు. అంతేకాకుండా..ఆమెకు మొగుడు కావాలి సినిమా తరహాలో భర్తగా నటించటానికి డబ్బులు మాట్లాడుకుని ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చాక అక్కడ ఆ ఇంట్లో బావగారు బాగున్నారా టైపు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నాలు మొదలెట్టి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంతకూ సుబ్రమణ్యంకు అంత డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏమిటి...ఆమె సమస్యలను ఎలా పరిష్కరించాడు, వారి ప్రేమ కథ ఎలా ముగింపుకు వచ్చింది వంటి ప్రశ్నలుకు సమాధానం తట్టకపోతే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆ మధ్యన రానా,జెనీలియా కాంబినేషన్ లో 'నా ఇష్టం' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాని గుర్తు చేస్తూ ఎత్తుగడ మొదలైన ఈ సినిమా కథా క్రమంలో చాలా సినిమాల రీమిక్స్ గా తేలుతుంది. మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు మెయిన్ మైనస్ ...స్క్రిప్టు. పక్కా ఫ్రెడిక్టుబుల్ సీన్స్ తో అలవోకగా అల్లేసారు. మొదటి పది సీన్స్ చూడగానే ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తెలిసిపోతుంది. అలాగే...చాలా చోట్ల సీరియస్ నెస్ ఉండాల్సిన సీన్స్ లో కూడా సీరియస్ నెస్ తీసుకురాలేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. వాటితో హీరోకు కాంప్లిక్ట్ సరిగ్గా చూపలేదు. ఫలానా వాళ్లు విలన్స్ అని చెప్పాక...కూడా వారితో హీరో ఎలా తలపడతాడు అనే సీన్స్ ఉండవు. దాంతో నెగిటివ్ పాత్రలైన అజయ్, రావు రమేష్ లు తేలిపోయారు.

    ఇక హీరో, హీరోయిన్ మధ్య సెకండాఫ్ లో ఏర్పడాల్సిన కెమిస్ట్రీపై దృష్టి పెట్టకుండా బ్రహ్మానందంపై కామెడీ చేసే పనిలో పడ్డారు. ఆ కామెడి అయినా కొత్తగా ఉందా అదీ లేదు. ఇక తాగుబోతు రమేష్, కోట శ్రీనివాస రావు మద్య పెట్టిన సీన్ అయితే ఎందుకు పెట్టారో అనిపిస్తుంది. పోనీ హీరో ఫ్లాష్ బ్యాక్ అయినా స్ట్రాంగ్ గా ఉందా అదీ లేదు.

    ఆ మాత్రం అయినా చివరి వరకూ కూర్చోగలిగాము అంటే హరీష్ శంకర్ పెన్ పవర్ అక్కడక్కడా పేలి నిలబెట్టింది. అలాగే హీరో ఉండే ఈజ్. ఈ రెండు సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యాయి. ఇక సెకండాఫ్ లో పేలిన కొన్ని జోక్స్ మాత్రమే.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

    అప్పుడే పద్దతి కాదేమో

    అప్పుడే పద్దతి కాదేమో

    హీరో కు సుప్రీమ్ స్టార్ అనే బిరుదు ఇస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇది కొంచెం మెగాభిమానులకు కోపం కలిగించే విషయమే. అప్పుడే ఈ బిరుదు ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.

    దర్శకుడే దారి తప్పాడు

    దర్శకుడే దారి తప్పాడు

    దర్శకుడు హరీష్ శంకర్ ..రామయ్యా వస్తావయ్య తర్వాత తీసిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే స్టేల్ అయిపోయిన స్క్రిప్టు తో రావటమే ఇబ్బంది కలిగించింది.

    ఓవర్ డోస్

    ఓవర్ డోస్

    సెంటిమెంట్ సీన్స్ సినిమాలో ఓవర్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ చూస్తూంటే ...అరవైల నాటి కథ మళ్లీ చూస్తున్నామా అనిపిస్తుంది.

    ఎందుకిలా

    ఎందుకిలా

    హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ ఆద శర్మ. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆమె చేసిన పాత్ర, ఆమెకు జోడిగా పెట్టిన వారిని చూస్తే...ఎందుకిలా చేసారు... అని డౌట్ వస్తుంది.

    హైలెట్

    హైలెట్

    "అబద్దానికి తోడు కావాలి, నిజానికి నీడ కూడా అవసరం లేదు ", "నేను డబ్బు కోసం దిగిపోతా దిగజారిపోను ", పరువు గురించి ఆలోచించని పిల్ ఎప్పుడైనా బరువే , "బాటిల్ మొయ్యాలి అనిపించే బురువు, మందు తాగాలి అనిపించే బాధ్యత " వంటి డైలాగులు బాగున్నాయి.

    టెక్నికల్ గా

    టెక్నికల్ గా

    ఈ చిత్రం సాంకితికంగా ఉన్నతంగానే ఉందని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో మరింత షార్ప్ గా చేయించుకుంటే బావుండేదనిపిస్తుంది

    పాటలు, నేపధ్య సంగీతం

    పాటలు, నేపధ్య సంగీతం

    ఈ సినిమాకు మిక్కీజే మేయర్ అందించిన పాటల్లో రెండు ఇప్పటికే హిట్. నేపధ్య సంగీతం కూడా బాగుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    నటీనటులు : సాయిధరమ్‌తేజ్‌.రెజీన కసాండ్ర , సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు
    సంగీతం: మిక్కీ జే. మేయర్‌,
    ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌,
    ఎడిటింగ్‌: గౌతంరాజు,
    స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌,
    సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌,
    నిర్మాత: దిల్‌ రాజు,
    కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌
    విడుదల తేదీ : 24 సెప్టెంబర్, 2015

    ఫైనల్ గా... అప్పట్లో వచ్చిన బావగారు బావున్నారా, మెగుడు కావాలి, ఈ మధ్య వచ్చిన నా ఇష్టం వంటి చిత్రాలు మిస్సైన వారికి ఈ సినిమా కొత్తగా కనిపిస్తుంది. వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Subramanyam for Sale film released today with divide talk. Subramanyam for Sale Movie Story is Inspired From the Mega Star Chiru Biggest Block Buster Films Like ‘Mogudu Kavali’ and ‘Bavagaru Bagunara’,and Guvva Gorinka Song Remake Song is Main Highlight For the Movie to Attract the Families to the Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X