»   » ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ (రివ్యూ)

‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ (రివ్యూ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

Rating:
2.0/5

హైదరాబాద్: వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న కుర్ర హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నేడు విడుదలైంది. టైటిల్ ఓల్డ్ గా ఉన్నా.... ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్లు కొట్టిన హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఉంటూ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాపులో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ విషయానికొస్తే...రామచంద్రాపురంలో హ్యాపీగా, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు శ్రీరామ్(రాజ్ తరుణ్). అతనికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం తన చిన్ననాటి నుండి తాను ఇష్టపడిన సీత(ఆర్తన)ను పెళ్లాడటం. ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతాడు. హీరోది ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేని రేంజి...హీరోయిన్ డాక్టర్ చదువు. సీతును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించే క్రమంలో ఓ క‌రెక్ట్ టైమ్ చూసుకుని త‌న ప్రేమ విష‌యం సీత‌కి తెలియ‌జేస్తాడు రాము. అయితే సీత త‌న ప్రేమ‌ను వెంట‌నే రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన సీత తండ్రి(రాజారవీంద్ర) ఆమె వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ తో చేయాలని డిసైడ్ చేస్తాడు. మరి రాము సీతను ఎలా దక్కించుకున్నాడు? అనేది తర్వాతి కథ.


పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... రాజ్ త‌రుణ్ తనదైన నటనతో పాత్రలో ఇమిడి పోయాడు. సీత పాత్ర‌లో ఆర్తన మెప్పించింది. ఆమెకు ఇది మొదటి సినిమా అయినా పెర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా ఆకట్టుకుంది. శకలక శంకర్ కామెడీ బావుంది. రాజా ర‌వింద్ర‌, సురేఖ‌, ఆద‌ర్ష్ మధునందన్, విజయ్, జోగినాయుడు, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.


టెక్నికల్ గా హైలెట్

ఈ సినిమా బాగా హైలెట్ అయిన టెక్నికల్ అంశాల్లో సినిమాటోగ్రఫీ, సంగీతం. విశ్వ సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరి అందాలను సినిమాలో బాగా చూపించాడు. గోపీసుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా సూటయింది. కథకు తగిన విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకు.


కొత్తదనం లేని కథ

దర్శకుడు ఎంచుకున్న కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. రోటీన్ కాన్సెప్టే. పందంలో హీరోయిన్ ను గెలచుకునే కాన్సెప్టు.


దర్శకత్వం

అయితే అయితే స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టకున్నాడు. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా బాగానే హ్యాండిల్ చేసాడు. అయితే ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


తెరవెనక

తారాగాణం: రాజ్‌తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, ఆదర్ష్, షకలక శంకర్
డైరెక్టర్: శ్రీనివాస్ గవిరెడ్డి
ప్రొడ్యూసర్స్: ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
మ్యూజిక్: గోపీసుందర్


English summary
Seethamma Andalu Ramayya Sitralu review. Seethamma Andalu Ramayya Sitralu movie is a romantic entertainer written and directed by debutant director Srinivas Gavireddy.
Please Wait while comments are loading...