twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హే..ఇది ఓల్డ్ యార్.. ( 'హ్యాపీ న్యూ ఇయర్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    కొందరు దొంగలు కలిసి ఓ విలువైన వజ్రం కొట్టేయాలని ప్లాన్ చేయటం...ఆ దొంగతనం వెనక ఓ సెంటిమెంట్ ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి కథలు హాలీవుడ్ భాక్సాఫీస్ కు కొట్టిన పిండే. After The Sunset, Ocean's 13 and Henry's Crime వంటి సినిమాలు గుర్తుకు తెచ్చే, లేదా వాటినుంచి ఎత్తుకు వచ్చినట్లు అనిపించే ఈ కథ అద్బుతమని అనలేం కానీ పైసా వసూల్ అని మాత్రం చెప్పగలం. చెన్నై ఎక్సప్రెస్ తర్వాత షారూఖ్ మరో సారి కమర్షియల్ గా హిట్ కొట్టాలని తనతో గతంలో మైహూనా, ఓం శాంతి ఓం వంటి ఫక్తు కమర్షియల్ చిత్రాలు భారీగా రూపొందించిన తన స్నేహితురాలు ఫరాఖాన్ తో జతకట్టాడు. దాని ఫలితమే...ఫక్తు రొటీన్ ఫార్ములా...భాక్సాఫీస్ సినిమా వచ్చింది. చూస్తున్నంతసేపు ఎక్కడా మన దృష్టి సడలనివ్వకుండా చేసి, థియోటర్ నుంచి బయిటకు వచ్చాక అసలేం చూసామో గుర్తుకురానివ్వకుండా ఉండటమే ఈ సినిమా ప్రత్యేకత. అయితే సెకండాఫ్ లో ఆ దొంగతనం తాలూకు టెన్షన్ ఎలిమెంట్ ని మాత్రం మెయింటైన్ చేయలేకపోయింది. సీన్స్ తర్వాత సీన్స్ అన్నట్లు పేర్చుకుంటూ పోయింది. ఎక్కడా పొరపాటున కూడా థ్రిల్ లు ట్విస్ట్ లు లేకుండా ఈ హీస్ట్ జానర్ స్టోరీని ఉన్నంతలో ఫన్, తనదైన శైలి భారీ పాటలుతో కొట్టుకొచ్చే ప్రయత్నం చేసింది.

    మూడు వందల కోట్ల విలువైన వజ్రాలను ఓ ఇండిస్ట్రియలిస్ట్ చరణ్ గ్రోవర్(జాకీ ష్రాఫ్) నుంచి చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ ఛార్లీ(షారూఖ్) కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తమకు సహకరించే ప్రొఫిషనల్స్ తో కూడిన ఓ టీమ్ కావాల్సి వస్తుంది. ఆ టీమ్ లో ...నందూ భిఢే(అభిషేక్ బచ్చన్),జాక్(సోనూ సూద్), మోహిని(దీపిక),రోహన్(వివాన్ షా), టామీ(బొమన్ ఇరానీ)లను ఎంపిక చేస్తాడు. అక్కడ నుంచి వారందరినీ తీసుకుని తన ప్లాన్ ప్రకారం...దుబాయి లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్ కు వెళ్తాడు. ఆ పోటీ హడావిడిలో అందరూ ఉండగా... ఆ వజ్రాలను లేపేయటానికి స్కెచ్ వేస్తాడు. ఎందుకు చార్లీ ఇలా దొంగతనానికి సిద్దపడ్డాడు..ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి... అనుకున్నట్లుగా అక్కడ వజ్రాలు దొరికియా...వంటి సమధానాలు తెలియాలంటే... 'హ్యాపీ న్యూ ఇయర్‌' చూడాల్సిందే. ఆరుగురు దొంగ డ్యాన్సర్లు చేసే సందడే ఈ చిత్రం.

    హాలీవుడ్ చిత్రాల కథలకు మన కథలకు చాలా తేడా ఉంది. వారి కథలో దొంగతనం ఎలా జరిగిందో ...ఎంత ఆసక్తికరంగా జరిగిందో చూపితే సరిపోతుంది. అదే మన దగ్గరకు వచ్చేసరికి...అంత పెద్ద దొంగతనం జరిగేటప్పుడు విలన్(జాకీషరాఫ్) తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కడో క్లైమాక్స్ దాకా విషయం రివిల్ కాదు. దాంతో విలనిజం నామమాత్రంగా మిగిలిపోయి జాకీషరాఫ్ పాత్ర గెస్ట్ గా మారిపోయింది. అదే విలన్ కు ఫలనా అప్పుడు దొంగతనం జరిగే విషయం తెలియటం అక్కడ నుంచి అతను ఆ దొంగతనాన్ని అడ్డుకోవాలని చూడటం వంటివి ఉంటే చక్కటి ట్విస్ట్ లతో కథనం మరింత పదునెక్కేది. అలా చేయకపోవటంతో చాలా ప్రెడిక్టుబుల్ స్టోరీగా మిగిలిపోయింది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

     ప్లస్ లు చెప్పుకోవాలంటే..

    ప్లస్ లు చెప్పుకోవాలంటే..

    'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' తర్వాత షారుఖ్‌, దీపికా జోడీ కట్టారు. మరో ప్రక్క షారుఖ్‌తో ఇప్పటికే 'మై హూనా', 'ఓం శాంతి ఓం' తీసిన ఫరా ఖాన్‌ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు అంశాలు భాక్సాఫీస్ వద్ద ఓపింనింగ్స్ ని ఆశ్చర్యపరిచే రీతిలో తెచ్చే అంశాలే.

    ఇండియన్ మేకప్

    ఇండియన్ మేకప్

    జీవితంలో ఓటమిని ఎదుర్కొని విజయం సాధించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఆరుగురు వ్యక్తుల కథ ఇది. వీళ్లంతా 'టీమ్‌ డైమండ్స్‌'గా ఏర్పడి డ్యాన్స్‌ షోలో పాల్గొంటారు. అసలు ఆలోచన మాత్రం ఓ వజ్రం దొంగిలించడం. మరి ఈ ప్రయత్నం ఫలించిందా? అదే కదా కథ!ఇది ...జార్జి క్లూనీ ప్రధాన పాత్రలో రూపొందిన ఆంగ్ల చిత్రం 'ఓషియన్స్‌ ఎల్‌వన్‌'ను ఈ చిత్రకథ పోలి ఉంటుంది. దానికి ఇండియన్ ప్లాష్ బ్యాక్,కామెడీ అద్దింది దర్శకురాలు.

    అబ్బా...ఇదో సమస్య

    అబ్బా...ఇదో సమస్య

    ఈ సినిమా మూడు గంటలు పైగా ఉండటం కూడా విసుగిస్తుంది. లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ గా నడిచే కథనంతో మనం ఊహించగలిగే సీన్స్ తో ఉండటంతో లెంగ్త్ మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.

    విజువల్ గా...

    విజువల్ గా...

    నిజానికి ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు అన్నివిభాగాలలోనూ నెంబర్ వన్ లు పనిచేస్తారు. కాబట్టి మిగతావేమీ వంక పెట్టే వీలు లేని విధంగా నే ఉంటాయి. లొకేషన్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. అయితే అంతకు తగ్గ రేంజిలో సీన్స్ ఉన్నాయా అనేదే ఈ సినిమాలో డౌట్ వచ్చే అంశం.

    స్క్రిప్టు ప్లాబ్లం

    స్క్రిప్టు ప్లాబ్లం

    మాస్ ప్రేక్షకులను అలరించే సీన్స్ తీసే దర్శకురాలిగా ఫరా ఖాన్ కు మంచి పేరుంది. అందులోనూ ఆమె నృత్య దర్శకురాలు కావటంతో మరింత గ్రిప్ గా పాటలు సైతం తీసి అలరిస్తుంది. అయితే ఆమెకు కెరీర్ ప్రారంభం నుంచి స్క్రిప్టులే చాలా ప్లాట్ గా ఉంటూ వస్తున్నాయి. రొటీన్ కథకు తోడు రొటీన్ స్క్రీన్ ప్లేను అద్దుతుంది ఆమె.

     గెస్టు లు బోలెడు...

    గెస్టు లు బోలెడు...

    ఫరా ఖాన్‌ సినిమాలంటే ప్రత్యేక పాత్రలకు కొదవుండదు అంటారు. ఆమె ప్రతి సినిమాలోనూ కొంతమంది అలా మెరిసి వెళ్లిపోతుంటారు. ఇందులోనూ మలైకా అరోరా, ప్రభుదేవా, డినో మోరియా, సారా జేన్‌ డయాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, విశాల్‌ దద్లాని, సాజిద్‌ ఖాన్‌, అనుపమ్‌ ఖేర్‌ లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. షారుఖ్‌ సతీమణి గౌరీఖాన్‌, చిన్న కొడుకు అబ్రామ్‌ చిత్రంలో తళుకున్న మెరిసారు.

    ఫ్యాన్స్ కు పండుగ

    ఫ్యాన్స్ కు పండుగ

    సినిమాలో షారుఖ్‌ ఎనిమిది పలకల దేహంతో కనిపిస్తాడు. జుత్తుకి కాస్త తెల్లరంగుతో షారుఖ్‌ కొత్తగా కనిపిస్తాడు. దీంతోపాటు ఇందులో షారుక్‌ రా.వన్‌ గెటప్‌లో కనిపిస్తాడు. అవన్నీ ఫ్యాన్స్ ని కిర్రిక్కించే అంశాలే.

    సంగీతం..

    సంగీతం..

    షారుఖ్‌, దీపికాలపై చిత్రీకరించిన 'మన్వాలాగే..' పాట రిలీజ్ కు ముందే పెద్ద హిట్టైంది. శ్రేయాఘోషల్‌ గాత్రం, పాట చిత్రీకరించిన విధానం రెండూ ఆకట్టుకున్నాయి. అలాగే మిగతా పాటలు కూడా సినిమాలో బాగా గ్రాండియర్ గా తీసారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    బ్యానర్ : రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌
    నటీనటులు :షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, అభిషేక్‌ బచ్చన్‌, సోనూ సూద్‌, బొమన్‌ ఇరానీ, వివాన్‌ షా, జాకీ షరాఫ్ తదితరులు.
    కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం :ఫరా ఖాన్‌.
    నిర్మాత : గౌరీ ఖాన్‌
    విడుదల తేదీ:24, అక్టోబర్ 2014.

    ఫైనల్ గా హై ఎక్సపెక్టేషన్స్ తో విడుదలైన ఈ చిత్రం ఇంతకుముందు చూసినట్లు అనిపించినా... చూస్తున్నంతసేపూ బాగానే ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ఫరాఖాన్ ...మాస్ ఎంటర్టైన్మెంట్ లకు అలవాటుపడిన వారికి ఇది బాగుందనిపిస్తుంది. ఫరాఖాన్ గత చిత్రం తీస్ మార్ ఖాన్ తో పోలిస్తే బెస్ట్ అనిపిస్తుంది. షారూఖ్..గత చిత్రం చెన్నై ఎక్సప్రెస్ తో పోలిస్తే..దాని మీద గౌరవం రెట్టింపు అవుతుంది.

    English summary
    Shahrukh Khan, Deepika Padukone, abhishek bachchan and Sonu Sood Starrer upcoming thriller and Comedy film Happy New year released today with average talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X