twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్ ఈజ్ వెల్..బట్ ('స్నేహితుడు' రివ్యూ)

    By Srikanya
    |

    బ్యానర్: జెమినీ ఫిల్మ్ సర్కూట్
    నటీనటులు: విజయ్, జీవా, శ్రీరామ్, ఇలియానా, సత్యరాజ్ తదితరురు,
    సంగీతం: హేరేశ్ జయరాజ్
    ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
    ఎడిటింగ్: ఆంధోని
    నిర్మాతలు: రాజు ఈశ్వరన్, దిల్ రాజు
    దర్శకుడు: శంకర్
    విడుదల తేదీ: జనవరి 26, 2012

    తమిళ దర్శకుడు శంకర్ చిత్రాలకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద స్టార్ల సినిమాలతో పోటీ పడుతూ హంగామా చేస్తూ ఆ సినిమాలు ఓపినింగ్స్ రాబడుతుంటాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అస్సలు విడుదల అయ్యిన విషయం కూడా ఎవ్వరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. దానికి కారణం ఇక్కడ కొద్దిగా కూడా మార్కెట్ లేని విజయ్ హీరో కావటమే కాక, ఈ సబ్జెక్ట్ నచ్చే అర్బన్ ఆడియన్స్ చాలా మంది ఇప్పటికే హిందీ వెర్షన్ ని చూసేయటం కావచ్చు. అప్పటికీ ధైర్యం చేస్తే ఒరిజనల్ కి ప్రేమ్ టు ఫ్రేమ్ కార్బన్ కాపీలా వచ్చిన ఈ చిత్రంలో పాటలు,ఆ ర్టిస్టులు తప్ప కొత్తగా చూడాల్సిందీ ఏమీలేదు.

    తెలిసిన కథనే మళ్లీ చెప్పుకుంటే వెంకట్(శ్రీరామ్), నిఖిల్(జీవా)ఇద్దరూ కలిసి తమ కాలేజీ మేట్, క్లోజ్ ప్రెండ్ అయిన పంచబట్ల సారంగ పాణి(విజయ్)కోసం వెతుకుతూ తమ గతాన్ని గుర్తు చేసుకుంటూంటారు. ఆ గతం వారు స్ట్రిక్ట్ ప్రిన్స్ పాల్ విరూపాక్ష సుందరం(సత్యరాజ్)నడిపే ఐడిల్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరటం తో మొదలవుతుంది. అక్కడే వారికి పాణి పరిచయమవుతాడు. కొద్దిపాటి పరిచయంలోనే వారు ప్రాణ స్నేహితులు అవుతారు. పాణికి ఆక్కడ స్టూడెంట్స్ ఎదుర్కొనే ఒత్తిడి, విద్యా విధానం నచ్చుదు దాంతో మాటిమాటికీ తమ ప్రిన్స్ పాల్ తో విభేదిస్తూంటాడు. మరోప్రక్క తాము వైరస్ అని ముద్దుగా పిలుచుకునే ప్రిన్స్ పాల్ కూతురు(ఇలియానా)తో పాణి ప్రేమలో పడతాడు...అప్పుడు ఏం జరిగింది...తమ ప్రిన్స్ పాల్ లో మార్పు ఎలా తెచ్చాడు. చివరకు పాణి ఏమయ్యాడు అనేది మిగతా కథ.

    కథ మీద కాకుండా పూర్తిగా కథనం మీద ఆధారపడి తయారు చేసుకున్న ఈ చిత్రం విద్యావ్యవస్ధలోని లోటుపాట్లను విపులంగా చర్చకు తీసుకువస్తుంది. అందుకే హిందీలో సంచలన విజయం సాధించింది. అయితే మాస్ కు నచ్చే ఎలిమెంట్స్ లేకపోవటంతో తెలుగుకు వచ్చేసరికి ఇది పూర్తిగా మల్టిప్లెక్స్ సినిమాలా మారింది. మల్టిప్లెక్స్ జనం ఇప్పటికే ఈ సినిమాని హిందీలో చూసేసి ఉన్నారు. అంతేకాకుండా తెలుగు వెర్షన్ కోసమైనా ఇక్కడ హీరోని ఎవరినైనా తీసుకుంటే కొంతలో కొంత క్రేజ్ వచ్చేది. అలా కాకుండా ఇక్కడ మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేని విజయ్ హీరోని తీసుకోవటంతో టాక్‌లో లేకుండా పోయింది. దానికి తోడు దర్శకుడు శంకర్ కొంచెం కూడా ఒరిజనల్ ని మార్చటానికి ఇష్టపడలేదు. విజయ్ కూడా అమీర్ ఖాన్ ని పూర్తిగా అనుకరిస్తూ చేసుకుపోయాడు. అప్పిటికీ ఆసక్తి ఉన్న కొద్ది మందీ చూద్దామంటే ఆల్రెడీ తమిళంలో విడుదలై ప్రేమ్ టు ప్రేమ్ రీమేక్ అని టాక్ రావటంతో వారినీ ఆపు చేసేసింది. దానికి తోడు ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ స్నేహితుడు అనేది అస్సలు కొంచెం కూడా క్రేజ్ తేలేకపోయింది. ఇలియానా విషయానికి వస్తే ఆమెలో ఛార్మ్ మిస్సైంది. సత్యరాజ్ మాత్రం చాలా బాగా చేసాడు. పాటలు కూడా క్లాస్ గా ఉన్నాయి...కిక్ ఇచ్చేలా లేవు. తెలుగు డైలాగులు ఓకే. టెక్నికల్ గా ఏ విభాగంలోనూ వంక పెట్టడానికి ఏమీలేదు. ఫైనల్ గా ఇప్పటికే హిందీ త్రీ ఇడియట్స్ చూసిన వాళ్లు దీన్ని పట్టించుకోవాల్సిన పనిలేదున్నట్లుగానే ఉంది. అది చూడనివారికి మాత్రం మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే విద్యావ్యవస్ధను ప్రశ్నించే ఈ చిత్రాన్ని మిస్ కావద్దు. ఆల్ ఈజ్ వెల్.

    English summary
    Shankar's Snehithudu movie released with positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X