twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులని మోసం చెయ్యటం కష్టం (‘మోసగాళ్లకు మోసగాడు’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    'స్వామిరారా' చిత్రంతో తెలుగులో మళ్లీ క్రైమ్ కామెడీ జానర్ కు ఊపొచ్చింది. లో బడ్జెట్ లో కాస్త కామెడీ, కొంచెం క్రైమ్ కలిపి వండేస్తే వర్కవుట్ అవుతుందనే నమ్మకం కొత్త దర్శకులకు కలిగింది. అయితే ఆ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మి...స్వామిరారా దర్శకుడు కూడా మరోసారి హిట్ కొట్టలేక...కలెక్షన్స్ దోచేయ్ లేక చతిలికిపడ్డారు. ఇప్పుడు స్వామిరారా నిర్మాత తో కలిసి అదే పాట్రన్ లో ...విగ్రహాలు...స్లగ్లింగ్...హీరో దొంగ అంటూ అటూ ఇటూ చేసి...స్వామిరారాను గుర్తు తెస్తూ...మేం మోసం చేస్తాం చూడండి..నవ్వుకోండి అంటూ సుధీర్ బాబు వచ్చాడు. అసలే హిట్ లు లేక అల్లాడుతున్న అతనికి ఈ సినిమా కూడా కలిసి వచ్చేటట్లు కనపడటం లేదు. ఒరిజనల్ ...అనుకరణ వేరు వేరు ...అది మాకు తెలుసు..స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకుండా బోర్ కొట్టే కథలకు మేము మోసపోం అంటూ ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఉన్నంతలో కామెడీ కొద్దిగా పేలటం ఈ దర్శకుడుకి,ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    క్రిష్(సుధీర్ బాబు) ఓ చిన్న దొంగ (ఇదోదో టైటిల్ అనుకునేరు...అలాంటిదేమీ కాదు..చిన్న దొంగతనాలు,మోసాలు గట్రా చేస్తూంటాడు అని). రెగ్యులర్ గానే మంచి పిల్ల అయిన జానికి(నందిని)తో అతను ప్రేమలో పడటం, ఆమెకు ఈ దొంగతనాలు అవీ నచ్చకపోవటం జరుగుతుంది. అంతేకాదు..ఈ మోసాలు,దొంగతనాలు మానేయమని ఆమె సలహా ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం తన వృత్తికి స్వస్ది చెప్దామనుకున్న మన హీరోకు...ఓ డీల్ వస్తుంది. డాన్ కౌసిక్(జయప్రకాష్ రెడ్డి) ఓ విగ్రహాన్ని ఎత్తుకురమ్మని పురమాయిస్తాడు. ఆ విగ్రహం చూసాక, దాన్ని ఎత్తుకు పారిపోతూంటే...అది ఓ జంట విగ్రహాల సముదాయం అని...రెండోది ఉంటేనే వాల్యూ అని తెలుస్తుంది. ఆ రెండో విగ్రహం కోసం... డాన్ రుద్ర (అభిమన్యు సింగ్) దగ్గరకు వెళ్తాడు. అక్కడ నుంచి రుద్రని ఎలా బోల్తా కొట్టించి ఆ రెండో విగ్రహాన్ని లేపేసి, బయిటపడ్డాడు... ఇంతకీ ఆ జంట విగ్రహాల కహానీ ఏంటి...తన లవర్ కు ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడలేదు..లాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి లేదా తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. లేదా సినిమా పూర్తి గా చూసినవాడని కలిసి అడగాల్సిందే.

    మొదటి నుంచీ ఈ చిత్రం స్వామిరారా కు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. అదే ప్లస్..అదే మైనస్ అయ్యింది. ఓపినింగ్స్ రాబట్టటానికి ఆ ప్రచారం పనికొస్తే...ఆ సినిమాతో పోల్చి చూసుకుని నిరాశపడేలా జరగటం మైనస్ అయ్యింది. వాస్తవానికి ... ఈ సినిమాలో హీరో దొంగ, విగ్రహాలు చుట్టూ కథ జరగటం తప్ప స్వామిరారా తో పోలిక లేదు. సరే ఆ విషయం వదిలేస్తే...దర్శకుడు ఇలాంటి కథకు స్క్రీన్ ప్లే అవసరమనే విషయం మర్చిపోయి...ప్రతీ సీన్ లో కామెడీని ఎలా చొప్పించాలా అని ఆలోచించి,పేర్చుకుంటూ పోయాడు. అంతేగానీ మనం క్రైమ్ కామెడీ జానర్ ఎత్తుకున్నాం...మోసగాళ్లకు మోసగాడు అంటూ టైటిల్ పెట్టాం...ఎత్తుకు పై ఎత్తులు అవసరం అని అనుకోలేదు. ఎలాగోలా కామెడీని అడ్డం పెట్టి బయిటపడాలేనే తాపత్రయమే కనపడింది.

    ముఖ్యంగా హీరో,హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ చాలా విసుగెత్తించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాను లవ్ ట్రాక్ లు అందుకు సంభందించిన కామెడీలు చూడ్డానికి ప్రేక్షకుడు రాడు. టైటిల్ కు తగ్గట్లు ఏదన్నా జరుగుతుందేమో అనుకుంటాడు. అయితే అదే సమయంలో విగ్రహాలు గురించి జరిగే ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా అనిపించిందంటేనే జనం దేనికి ఈ జానర్ సినిమాకు వస్తారో అర్దం చేసుకోవాలి. అలాగే..విగ్రహాలు రెండూ జంటగా ఉంటేనే విలువ అనేది బలంగా చెప్పలేకపోయాడు. విలన్ పాత్ర కూడా మొదట బిల్డప్ తో ఓపెన్ చేసి, తర్వాత హీరో ఎత్తులకు బలయ్యే శ్రీను వైట్ల విలన్ ని చేసేసాడు.

    Sudheer Babu's Mosagallaku Mosagaadu  review

    సుధీర్ బాబు...నటన మెరుగవుతోందే కానీ అతను కథలను ఎంచుకునే తీరు మాత్రం వెనకపడుతోంది. అలాగే డైలాగు డెలవరీ కూడా ఇంకా అలాగే ఉండి...కొన్ని చోట్ల వినేవారికి ఇబ్బందిగానే ఉంది. అయితే డాన్స్ లు మాత్రం బాగ చేసాడు. ఇక జయప్రకాష్ రెడ్డి మాత్రం కామెడీ తో లాక్కొచ్చాడు చాలా వరకు. క్లైమాక్స్ లో సప్తగిరి ఎంట్రీతో కూడిన కామెడీ కూడా బాగానే ఉంది. డైలాగులు కొన్ని బాగానే పేలాయి.

    టెక్నికల్ గా...సినిమాటోగ్రఫీ ఓకే అనిపించుకుంటుంది. పాటలు సినిమాకు పెద్ద ప్లస్ కాలేదు, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే... ఫస్ట్ హాఫ్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాతగా చక్రి చిగురుపాటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. దర్సకుడుగా కొన్ని సీన్స్ బాగనే తీసినా ఈ జానర్ కు తగ్గట్లు మేకింగ్ మాత్రం లేదు.

    ఫైనల్ గా... టైటిల్, ట్రైలర్ చూసి ఏదో ఎత్తుకు పై ఎత్తులు తరహా చిత్రం చూడబోతున్నాం అని ఫిక్స్ అవకుండా వెళితే ఓకే అనిపిస్తుంది. అలాగే స్వామి రారా కు సీక్వెల్ అనే ది కూడా మర్చిపోతే మరింత మేలు. అక్కడక్కడా పేలిన కామిడితో మిగతా సినిమాని లాగేయవచ్చు.

    బ్యానర్ :లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్

    నటీనటులు : సుధీర్ బాబు, నందిని, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు
    సంగీతం: మణికాంత్ ఖాద్రి,
    ఆర్ట్: నాగేంద్ర,
    మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,
    పాటలు: శ్రీమణి, కె.కె,
    సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్,
    అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.
    నిర్మాత :చక్రి చిగురుపాటి
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోస్ నెల్లూరి
    విడుదల తేదీ :22, మే 2015.

    English summary
    Sudher Babu, Nandini Roy's ‘Mosgallaku Mosgadu’ released today with divide talk. The film titled is matched with Superstar Krishna’s memorable movie ‘Mosagallaku Mosagadu’ released in 1971 is a trendsetter in Telugu. The film is directed by Bose Nelluri and produced by Chakri Chigurupati. Actress Nandini is pairing up with Sudheer Babu.The music is scored by Manikanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X