twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బోరు’మనించిన ‘బీరువా’ (రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5

    హైదరాబాద్: ‘బీరువా' వినడానికే...కాస్త డిఫరెంటుగా ఉంది కదూ. సందీప్ కిషన్, సురభి హీరో హీరోయిన్లుగా కణ్మిణి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్టయ్యాక సందీప్ కిషన్ సినిమాలంటే ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. పైగా ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించడం, చోటా కె నాయుడు కెమెరా, తమన్ సింగీతం ఉండటం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించాడో చూద్దాం...

    కథ విషయానికొస్తే...హైద‌రాబాద్‌లో ఇండ‌స్ట్రియ‌లిస్ట్ అయిన సూర్య‌నారాయ‌ణ‌(న‌రేష్‌) కొడుకు సంజు(సందీప్ కిషన్), భార్య అనిత‌(అనితా చౌద‌రి) ఉంటాడు. సంజు ఎప్పుడూ త‌న అల్ల‌రితో తండ్రికి బిపి పెంచుతుంటాడు. ఓ సంద‌ర్భంలో విజ‌య‌వాడ‌కి చెందిన ఒక వ్య‌క్తి చేతిలో 40 కోట్లు మోస‌పోయిన సూర్య‌నారాయ‌ణ‌కి ఏం చేయాలో తెలియ‌దు. దాంతో సంజు స‌ల‌హాపై విజ‌య‌వాడ‌ను శాసించే పెద్ద మ‌నిషి ఆది కేశ‌వులు నాయుడు(ముకేష్ రుషి) సాయం కోర‌డానికి అక్క‌డ‌కి సూర్య‌నారాయ‌ణ‌, సంజు వెళ‌తారు. అక్క‌డ ఆదికేశ‌వులు కూతురు స్వాతి(సుర‌భి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు సంజు. స్వాతి కూడా సంజుని ఇష్ట‌ప‌డుతుంది. బీరువా సహాయంతో సంజు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

    Sundeep kishan's Beeruva movie Review

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...సందీప్ బాగా చేసాడు. అతని పాత్రలో, పెర్ఫార్మెన్సులో ఎనర్జీ బావుంది. ఫైట్లు, డాన్సులు అదరగొట్టాడు. సుర‌భి అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. సంజు తండ్రి పాత్రలో నరేష్ నవ్వులు పూయించాడు. ఇతర కమెడియన్లు బాగా చేసారు.

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమాకు ఇది హైలైట్ అని చెప్పొచ్చు. థ‌మ‌న్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు కథకు తగిన ఫర్వాలేదనిపించింది.

    దర్శకుడి ప్రతిభ గురించి మాట్లాడుకుంటే.....టేకింగ్ కాస్త ఫర్వాలేదు కానీ సినిమాలో సరైన కంటెంటు జొప్పించడంలో విఫలం అయ్యాడు. కథ కూడా రొటీన్. కామెడీ ఉంది కాబట్టి ప్రేక్షకులకు కాస్త ఉరట. విలనిజం సీన్లు, చేజింగ్ సీన్లు సినిమాకు విలన్లు హైలెట్ చేయడానికి పెట్టినట్లే ఉన్నాయి. కథ రొటీన్‌గా ఉంది కాబట్టి దర్శకుడు కంటెంటుపై మరింత శ్రద్ధ పెడితే బావుడేంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా పర్ ఫెక్టుగా లేదు.

    ఓవరాల్‌గా చెప్పాలంటే......‘బీరువా'లో ఏముందని ఆసక్తిగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ‘బోరు'మనిపించే విధంగా ఉంది.

    నటీనటులు: సందీప్‌ కిషన్‌, సురభి, ముఖేష్‌రుషి, సీనియర్‌ నరేష్‌, శంకర్‌, సప్తగిరి, అజయ్‌ తదితరులు
    నిర్మాత: రామోజీరావు
    సమర్పణ: జెమినీ టీవీ
    సంగీతం: థమన్
    దర్శకత్వం: కణ్మణి

    English summary
    Beeruva falls flat because of its routine storyline and format.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X