twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద డాష్ ('నీకు నాకు డాష్‌ డాష్‌' రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సంస్థ: భవ్య క్రియేషన్స్‌
    నటీనటులు: ప్రిన్స్‌, నందిత, చౌదరి, పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, బెనర్జీ, తనికెళ్ల భరణి, వేణు, సుమన్‌శెట్టి, ఉత్తేజ్‌ తదితరులు.
    సంగీతం: యశ్వంత్ నాగ్
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : అనూప్ రూబెన్స్
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లూరి
    మాటలు :రామస్వామి
    నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్‌.
    కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: తేజ
    విడుదల: 13/04/2012

    ఒకే సన్నివేశంలో ద్విముఖాలుగా భావోద్వేగాలను పండిస్తూ కొత్త తరహాలో స్క్రీన్‌ప్లే చేశాను. ఈ స్క్రీన్ ప్లే పద్ధతి కనుక ప్రేక్షకులకు నచ్చితే కచ్చితంగా తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులొస్తాయి అంటూ రిలీజ్ కు ముందు దర్శకుడు తేజ ఊదరకొట్టి సినిమాపై ఆసక్తి రేపారు. అలాగే టైటిల్ సైతం 'నీకు నాకు డాష్‌ డాష్‌'అని పెట్టి యూత్ ని ఆకట్టుకున్నారు. అంతా కొత్త నటీనటులు, ప్రేమ కథ, దానికి తోడు కేక డిజాస్టర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని తేజ చేసిన చిత్రం.. ఇవన్నీ జనాల్ని థియేటర్ వరకూ బాగానే లాక్కెళ్లి ఓపినింగ్స్ రాబట్టడానికి ఉపయోగపడ్డాయి. అయితే సినిమా ప్రారంభమైన కాస్సేపటికే అంత సీన్ లేదని అర్దమైపోతుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్ కొంత గడిచేసరికి ఇది పెద్ద డాష్ సినిమా అని ఫిక్స్ అయిపోయేలా చేస్తుంది. ఉన్నంతలో సుమన్ శెట్టి కామెడీ మాత్రమే రిలీఫ్ ఇస్తుంది.

    శివ (పిన్స్‌) తమ కుటుంబ అప్పులు తీర్చటం కోసం బాపినీడు (చౌదరి), చిట్టితల్లి (తీర్థ)నిర్వహించే నకిలీ మద్యం తయారీ కేంద్రంలో చేరతాడు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న గాయత్రి (నందిత)కి... శివ తెగ నచ్చేస్తాడు. దాంతో ఆ ప్రేమని శారీరిక కలయిక దాకా తీసుకువస్తుంది. తర్వాత గాయత్రి గర్భం దాల్చిన విషయం లేడీ విలన్ చిట్టితల్లికి తెలిసి చావబాదుతుంది. అదే సమయంలో శివ కూడా అక్కడ డబ్బుని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం విలన్స్ కి తెలిసి వెంబడిస్తారు. అక్కడ నుంచి ఆ జంట ఎలా తప్పించుకుని బయిటపడింది... అసలు శివకు డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

    తమిళ డబ్బింగ్ చిత్రం షాపింగ్ మాల్ ని గుర్తు చేస్తూ మొదలైన ఈ కథ .. ఫస్టాఫ్ ..హీరోయిన్ ఊతపదం 'డాష్', సుమన్ శెట్టి కామెడీ తో నడిచిపోతుంది. అయితే రొటీన్ అనుకున్నాడో ఏమో కాన ఫస్టాఫ్ లో హీరో,హీరోయిన్స్ మధ్యన ఎస్టాబ్లిష్ చేయాల్సిన ప్రేమ సీన్స్ ని మాత్రం చేయలేదు. కేవలం శారీరిక బంధం ఏర్పరిచి దాన్నే ప్రేమ అనుకోండి అన్నట్లుగా చూపెట్టాడు. దాంతో సెంకండాఫ్ లో హీరో, హీరోయిన్స్ మధ్యన వచ్చే ఛేజింగ్ సీన్స్, విలన్స్ ని ఎదిరించే సన్నివేశాలు పండలేదు. దానికితోడు ఏదో నిధి వేట అన్నట్లు ..ఈ ప్రేమ కథ కాస్తా.. విలన్ ..హీరో వెనక డబ్బు కోసం పడుతూ పరుగెడుతుంది. చివరలో మరీ విచిత్రంగా విలన్ ని మరో క్యారెక్టర్ చేత చంపించేసారు.. హీరోకి ఆ అవకాశం ఇచ్చి క్రిమినల్ ని చేయటం ఎందుకనుకున్నారో ఏమో గానీ.. అదే గత సూపర్ హిట్ తేజ చిత్రాల్లో ఫస్టాఫ్ లో ప్రేమ కథని చూపి, సెకండాఫ్ లో వారు తమ ప్రేమను నిలబెట్టుకోవటం కోసం చేసే ప్రయత్నాలు యువతను ఆకట్టుకున్నాయి. అదే ఈ సినిమాలో మిస్సైంది. అది కథన సమస్యే.

    టెక్నికల్‌గా చూసుకుంటే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడం ప్రథమం అని చెప్పారు కానీ...కథ బాగుంటే దాని విషయం బాగా ఎలివేట్ అయ్యేది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్, రీరికార్డింగ్ ఓకే. తేజ స్వతహాగా కెమెరామెన్ కావంటంతో చాలా చోట్ల విజువల్ బ్యూటి కి అవకాసం ఏర్పడింది. ఇక నటీనటుల్లో కొత్తగా పరిచయమైన హీరోయిన్ నందిత, విలన్ చౌదరి బాగా చేసారు. పరుచూరి వెంకటేశ్వరావు క్లైమాక్స్ పంచ్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. యువతను టార్గెట్ చేసిన ఈ చిత్రం సెకండాఫ్ దెబ్బకొట్టడంతో వారిని అయినా ఎంత వరకూ థియేటర్స్ కి లాక్కువస్తుందో చూడాలి. అయితే తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా కాబట్టి ఎవరికీ నష్టాలు రాకపోవచ్చు. ఓపినింగ్స్ బాగా రావటంతో రికవరి బాగానే ఉండే అవకాశం ఉంది.

    English summary
    Teja's Neeku Naaku Dash Dash released today with divide talk. Teja is back with this movie after a long hiatus of four years. He had given huge blockbusters at the start of his directing career like Jayam and Nuvva Nena. The music of Neeku Naaku Dash Dash composed by Yashwanth Nag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X