twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైమ్ దోపిడి (‘డి ఫర్ దోపిడి’రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    టైటిల్, పోస్టర్స్, హీరో నాని స్టేట్ మెంట్స్ చూసి ఏదో గొప్ప క్రైమ్ కామెడీ చూడబోతున్నాం అనే బిల్డప్ ఈ సినిమాకి వచ్చేసింది. అయితే సినిమా చూసాక అంత సీన్ లేదు అనిపిస్తుంది. మూస ధోరణులకు స్వస్ధి చెప్పి కొత్తగా ట్రై చేసినందుకు సంతోష పడాలో...లేక కొత్త దనం పేరుతో నమ్మించి మన టైమ్ ని దోపిడి చేసే ప్రయత్నం చేసారని బాధపడాలో తెలియని స్ధితి. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ స్లో అవటం..ముఖ్యంగా ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ బాగా డల్ చేసేసింది. ఎక్కువ భాగం సింగిల్ లొకేషన్ లో తీసారు కాబట్టి...ఆ ఫీల్ కలగకుండా ఈ చిత్రం స్క్రిప్టుపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఫలితం బాగుండేది.

    విక్కీ (వరుణ్‌ సందేశ్‌), సుబ్బ రాజు(సందీప్‌ కిషన్‌) హరీష్‌ (నవీన్‌) బన్నూ (రాకేష్‌) స్నేహితులు. వీళ్ల నలుగురుకీ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా డబ్బు అవసరం. విక్కికి..అమ్మాయిల పిచ్చితో షాపింగ్ లు చేసి రికవరిలు కట్టటానికి డబ్బు కావాలి.రాజీవ్ కు హీరో అవ్వాలంటే డబ్బు ఎదురు ఇవ్వాల్సిన స్ధితి. హరీష్ కు తమ మామను ఒప్పించి మరదలని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. బన్ను కి...గర్ల్ ప్రెండ్ కి చూపించుకోవటానికి సిక్స్ ప్యాక్ కావాలి. అందుకు డబ్బు కావాలి. వీళ్లంతా.. తమ అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో ఓ బ్యాంకు దోపిడీ చేయాలనుకొంటారు. దొంగతనం ఎలా చేయాలో తెలియని కుర్రాళ్లు.. ఈ సాహసం ఎలా చేశారు. ఏ సమస్యలు ఎదురయ్యాయి. విజయవంతం అయ్యారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ.

    Varun Sandesh's 'D For Dopidi' review
    నలుగురు కుర్రాళ్లు...ఓ క్రైమ్.. వంటి 'ఐతే' టైప్ కాన్సెప్టులు తెలుగులో బాగా తక్కువ. అలాగే ఎంతో పకడ్బందీగా స్క్కిప్టు రాసుకుని దిగితే కానీ ఇలాంటి సినిమాలు సంచలనం సృష్టించవు. Attack the Gas Station(1999),Dog Day Afternoon (1975) తరహా చిత్రాల ప్రేరణతో రెడీ చేసినట్లున్న ఈ చిత్రం ఫస్టాఫ్ కామెడీ,సెటైర్ తో ముందుకు వెళ్లినా...ముందే చెప్పుకున్నట్లు సెకండాఫ్ కి వచ్చేసరికి సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా సింగిల్ లొకేషన్ లో కథ కావటంతో కొంత దూరం వెళ్లాక కాంప్లిక్ట్ తగ్గిపోయింది. అయితే దర్శకుడు విభిన్నంగా ప్రతీ సీన్ చెప్పటానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా మీడియాపై సెటైర్స్ వంటివి బాగానే పండాయి. దర్శకుడు కొత్త వాడైనప్పటికి బాగానే అవుట్ పుట్ నటీనటులు నుంచి తీసుకోగలిగాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా తొందరలోనే కథలోకి వెళ్లపోవటం ఒకటే ప్లస్ పాయింట్.

    నటీనటులు విషయానకి వస్తే... ఇప్పటికే సక్సెస్ లో ఉన్న సందీప్ కిషన్ కి ఈ సినిమా పెద్దగా ఉపయోగపడకపోయినా...మైనస్ మాత్రం కాదు. వరుణ్ సందేశ్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మొదటి సినిమాలో ఏం చేసాడో..ఇప్పుడూ అదే రిపీట్ చేసాడు. మిగతా ఇద్దరు కుర్రాళ్లూ ఓకే. తణికెళ్ల,హేమ,పృధ్వి వంటి సీనియర్ నటులు...ఎప్పటిలాగే కొంచెం కూడా కొత్తదనం చూపకుండా చేసుకుంటూ వెళ్లిపోయారు. కెమెరా వర్క్ ఓకే. సినిమాలో పాటలు లేవు. నేపధ్య సంగీతం సోసో గా ఉంది. నాని ఇచ్చిన వాయిస్ ఓవర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉండాల్సింది. పోలీస్ ఆఫీసర్ కృష్ణమాచారిగా దర్శకుడు దేవకట్టా బాగా చేసారు.


    ఇక ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్...నిడివి బాగా తక్కువ కావటం. ఏదైమైనా ఈ సినిమాని..కొత్తగా ట్రై చేసారు చూద్దాం ఎంకరేజ్ చేద్దాం అనుకునే వారికి మంచి ఆప్షన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా దీన్ని చూస్తే మాత్రం నచ్చే అవకాసం తక్కువ. మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఏ మేరకు ఆడుతుందో చూడాలి.

    చిత్రం: డి ఫర్‌ దోపిడి
    సంస్థ: డి 2 ఆర్‌ ఫిలిమ్స్‌
    నటీనటులు: వరుణ్‌సందేశ్‌, సందీప్‌ కిషన్‌, మెలనీ, రాకేష్‌, నవీన్‌, దేవా కట్టా, తనికెళ్ల భరణి,హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు
    సంగీతం: మహేష్ శంకర్,
    కెమెరా: లుకాస్,
    కళ: ఉపేంద్ర రెడ్డి,
    కూర్పు: ధర్మేంద్ర,
    నిర్మాతలు: రాజ్‌ నిడిమోరు, కృష్ణ డికె, నాని
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.
    విడుదల: బుధవారం.

    English summary
    
 D for Dopidi is a 2013 directed by Siraj Kalla released today with divide talk. D for Dopidi starring Varun Sandesh, Sundeep Kishan, Naveen, Rakesh and Melanie Kannokada in the lead roles. This film is produced by Raj Nidimoru and Krishna D.K.,Nani under D2R Films Pvt Ltd Banner. Mahesh Shankar composed the music. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X