twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హే..కృష్ణా.... (‘ముకుందా’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    .....సూర్య ప్రకాష్ జోశ్యుల

    మెగా కుటుంబం నుంచి మరో హీరో లాంచ్ అవుతున్నాడంటే కుర్రాడు ఎలా ఉన్నాడు... డైలాగు డెలవరీ పరిస్ధితి ఏంటి...డాన్స్ లు ఎలా చేస్తున్నాడు...ఫైట్స్ ఇరగతీస్తున్నాడా...ఎమోషన్స్ బాగా పలికిస్తున్నాడా..వంటి ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకుని,రకరకాల లెక్కలు వేసి చివరకు అవునూ.. సినిమా ఎలా ఉంది...అని అరా తీస్తారు..అంచనా వేస్తారు...అలా ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఎన్నాళ్ళగానో ఊరిస్తూ తెరపైకి వచ్చేసాడు. హీరోగా ఫీచర్స్ గట్రా బాగానే ఉన్నా...లాంచింగ్ ప్యాడే సరిగా కుదరలేదనిపించింది. పక్కా ప్యాసివ్ కథతో అదీ స్లో నేరేషన్ తో శ్రీకాంత్ అడ్డాల కుర్రాడిని లాంచ్ చేసాడు.

    కథలో రావు రమేష్ పాత్ర మీద పెట్టిన శ్రద్ద స్క్రిప్టు మీద పెట్టలేదనిపించే ఈ చిత్రం ఫస్టాఫ్ బాగుంది అనిపించే లోపల సెకండాఫ్ అంతలేదనిపించేలా తేలిపోయింది. హీరో మీద ఫోకస్ కన్నా ప్రక్క పాత్ర లవ్ స్టోరీ మీద కాన్సర్టేట్ ఎక్కవైంది. అలాగే సెకండాఫ్ సగంలో సినిమా క్లైమాక్స్ అయిపోయినట్లు అనిపించి,మళ్లీ మొదలవ్వటం కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాగా గొప్పగా లేకపోయినా వరుణ్ తేజ్ మాత్రం తన పాత్రకు తగిన న్యాయం చేసాడనిపించింది. ముఖ్యంగా సినిమా సీరియస్ గా సాగుతూ ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవటం,ముఖ్యంగా లవ్ ట్రాక్ పట్టించుకోకపోవటం మైనస్ లుగా నిలిచాయి.

    https://www.facebook.com/TeluguFilmibeat

    కాకినాడ పట్టణంలో స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది అనే డౌట్ ఇప్పటికీ ఉంటే తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే.

    హీరో లాంచ్ చిత్రం అనగానే ఆరు ఫైట్స్, ఆరు అదిరిపోయే డాన్స్ లు వంటి మూస స్కీమ్ కు స్వస్తి చెప్తామనుకున్నాడో ఏమో శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి కథతో వచ్చాడు. ఎక్కడా హీరో చేత తొడ కొట్టించి, ఛాలెంజ్ చేయించలేదు. అక్కడవరకూ ఆయన ఆలోచన బాగానే ఉంది..రొటీన్ నుంచి బయిటపడేయాలనే తపనా మెచ్చుకోదగ్గదే...అయితే అందుకు తగ్గ కథని ఎంచుకోలేకపోయాడు. కేవలం రావు రమేష్, హీరో మధ్యన వచ్చే కొన్ని సీన్స్ ని అనుకుని సినిమా రెడీ చేసేసినట్లున్నాడు. దాంతో మిగతా స్టోరీ డైనమిక్స్ ఏమీ కథలో రాకుండాపోయాయి. ముఖ్యంగా సబ్ ప్లాట్ గా నడిచే హీరో, హీరోయిన్స్ లవ్ స్టోరీ ని సైతం డల్ గా,వాళ్లిద్దరి మధ్యా అసలు కెమెస్ట్రీ వర్కవుట్ కానివ్వకుండా డైరక్టర్ అడ్డుపడినట్లు సీన్స్ ఉన్నాయి. అలాగే రావు రమేష్ పాత్ర వైపు వెటకారంగా మాట్లాడటం తప్పించి, నెగిటివ్ ఫీలింగ్ ఎక్కడా కనపడదు. ఆయన పాత్ర చేసిన తప్పు పెద్దగా ఎలివేట్ చేయకపోవటం, ఆ సీన్స్ పెద్దగా ఆసక్తిగా అనిపించవు. అలాగే మొదటి నుంచి రావు రమేష్, హీరో మధ్య వచ్చే సన్నివేశాలు ఒకేలాగ చివరి వరకూ ఉంటాయి...ఎక్కడా టర్న్ గాని, ట్విస్ట్ గానీ తీసుకోవు.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

    కుర్రాడు బాగున్నాడు కానీ....

    కుర్రాడు బాగున్నాడు కానీ....

    వరుణ్ తేజ చూడ్డానికి ఒడ్డూ పొడుగూ తో తెలుగుకు ప్రామిసింగ్ హీరోలాగే ఉన్నాడు కానీ నటన,డైలాగు డెలవరీ కూడా కాస్తంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. పెద్దగా డైలాగులు చెప్పించకుండా, పెద్దగా ఎమోషన్ చూపే అవసరం లేకుండా ఈ కథలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ ప్రతీ సారి అలా చెయ్యాలంటే కష్టం కదా.

    దర్శకుడుగా...

    దర్శకుడుగా...

    గోదావరి జిల్లా మాండలీకం, అక్కడి జనాల మేనరిజంలను పట్టుకుని వాటిని తెరపై యాజటీజ్ గా చూపుతూ గెలుస్తూ వచ్చారు. అయితే ఈ సారి కథ కరెక్టుగా లేకపోవటంతో అవేమి ప్లస్ కాలేకపోయాయి. ముఖ్యంగా రావు రమేష్ చేత చేయించిన నటన...మేనరింజలు దర్శకుడుకి తన పాత్రపై ఉన్న పట్టుని చెప్పాయనటంలో సందేహం లేదు. అయితే హీరో నుంచి మాత్రం అవుట్ పుట్ తియ్యలేకపోయారు

    పూజహేడ్గే

    పూజహేడ్గే

    ఈ అమ్మాయికు సినిమాలో హీరోయిన్ అన్నారే కానీ చెప్పుకోదగిన సీన్లు లేవు..కేవలం పాటలకే పరిమితం అవటంతో ఆమెలోని నటనా యాంగిల్ ఏమీ బయిటపడలేదు. కానీ గ్లామర్ గా బాగుంది..అంతకుమించి చెప్పుకోవటానికి ఏమీ లేదు.

    అదరకొట్టాడు

    అదరకొట్టాడు

    సినిమా హైలెట్ లలో రావు రమేష్ ని ముందర చెప్పుకోవాలి. ఆయనకు ఈ సినిమాలో పాత్ర ఆయనలోని నటుడుని పూర్తిగా ఆవిష్కరించింది అని చెప్పటంలో సందేహం లేదు. ఇది రావు రమేష్ వన్ మ్యాన్ షో. రఘుబాబు, ప్రవీణ్,అలీ వంటి కమిడియన్స్ ఉన్నా ఎక్కడా నవ్వు తేలేకపోయారు. అలాగని ఎమోషన్స్ సైతం పెద్దగా పండలేదు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే బాగా చేసారనిపించుకన్నారు.

    ఫైట్స్,పాటలు

    ఫైట్స్,పాటలు

    కొత్తగా లాంచ్ అవుతున్న హీరోకు ఫైట్స్,పాటలులో తన ప్రతిభ చూపాల్సిన అవసరం ఉందేమో కానీ ఈ చిత్రం కథకు మాత్రం ఏ మాత్రం అవసరం లేదు అనిపించే ప్రతీ చోటా ఏదో ఒక ఫైటో,పాట ఇరికించారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...


    సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉంటే ప్రేక్షకులు ధాంక్స్ చెప్పేవారు. డైలాగులు బాగున్నాయి.

    ఉల్లిపాయి గోలేంటో

    ఉల్లిపాయి గోలేంటో

    సినిమాలో ప్రకాష్ రాజ్ ని ఉల్లిపాయి గుర్తు మీద ఎలక్షన్స్ లో నిలబెట్టడం మాత్రమే కాక, ఉల్లిపాయి మీద డైలాగులు, ఉల్లిపాయి మార్కెట్ చూపారు..ఏంటో ఈ ఉల్లిపాయి గోలేంటో అనిపిస్తుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: లియో ప్రొడక్షన్స్
    నటీనటులు: వరుణ్‌తేజ్, పూజాహెగ్డే , రావు రమేష్, రఘుబాబు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, నాజర్, రఘుబాబు, తదితరులు
    సంగీతం: మిక్కీ.జే.మేయర్,
    పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,
    కెమెరా:మణికందన్,
    ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్,
    ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
    నిర్మాత: నల్లమలుపు బుజ్జి
    సమర్పణ: ఠాగూర్ మధు
    విడుదల తేదీ: 24 డిసెంబర్,2014

    ఫైనల్ గా మెగా క్యాంప్ నుంచి వచ్చిన కొత్త కుర్రాడు ఎలా ఉన్నాడో, అతని స్టామినా తెలుసుకోవటానికి ఈ సినిమాచూడకతప్పదు. అలాగే రావు రమేష్ అభిమాని అయితే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. అయితే శ్రీకాంత్ అడ్డాల గత రెండు చిత్రాలను దృష్టిలో పెట్టుకుని,అలాగే ఉండవచ్చు అని ఊహించుకుని మాత్రం ఈ సినిమాకు వెళ్ళితే తప్పక నిరాసపడతారు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Mukunda is an action-oriented love story released today with divide talk. The film is about romance in a rural town, and how the youth there react to local politics. This movie written & directed by Srikanth Addala. The film was produced by Tagore Madhu and Nallamalapu Srinivas (Bujji) under the banner Leo Productions. It features Varun Tej and Pooja Hegde in the lead roles, the former making his debut in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X