twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా ఉంది...(నయనతార ‘నేనూ రౌడీనే’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    నయనతార, విజయ్ సేథుపతి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం 'నానుం రౌడీదాన్'. హీరో ధనుష్ నిర్మించిన ఈ సినిమాకి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఇపుడు ఇదే చిత్రం తెలుగులో కల్పన చిత్ర, స్నేహ మూవీస్ సంస్థలు 'నేనూ రౌడీనే' పేరుతో విడుదల చేసారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నయనతార సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం...

    కథ విషయానికొస్తే...మీనా(రాధికా) అనే పోలీస్ ఆఫీసర్‌కు కుమారుడు పండు(విజయ్ సేథుపతి). చిన్నతనంలో ఓ సంఘటన కారణంగా రౌడీగా ఎదిగి సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. పండు రౌడీగా ఎదగడానికి ఇన్స్పిరేషన్ కిల్లి బాబ్జీ(పార్తిబన్) అనే ఓ పెద్ద రౌడీ. ఈ క్రమంలో కాదంబరి(నయనతార) అనే వినికిడి సమస్య ఉన్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. కానీ కాదంబరి జీవితంలో కిల్లి బాబ్జీ విలన్ అని తెలుసి షాకవుతాడు పండు. కిల్లి బాబ్జీకి, కాదంబరికి సంబంధం ఏమిటి? కాదంబరి కోసం పండు చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్మార్మెన్స్ పరంగా చూస్తే.... వినికిడి సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో నయనతార అదరగొట్టింది. ఇక నయనతార గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, అందంతో ప్రేక్షకలను మంత్రముగ్దులను చేసింది. విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ బావుంది. కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో బాగా చేసాడు. విలన్ పాత్రలో పార్తిబన్ అతరగొట్టాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

    స్లైడ్ షోల సినిమా రివ్యూ సంబంధించిన పూర్తి వివరాలు...

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే...

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే...


    ఈ సినిమాకు జార్జి విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. అనిరుద్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఓకే. సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. డైలాగ్స్ ఓకే.

    దర్శకుడి పని తీరు...

    దర్శకుడి పని తీరు...


    దర్శకుడు విఘ్నేష్ శివన్.... రివేంజ్ కాన్సెప్టు ఎంచుకున్నప్పటికీ దాన్ని డిఫరెంటుగా, తనదైన మార్కు జోడించి ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

    రొటీన్ కు భిన్నంగా

    రొటీన్ కు భిన్నంగా


    రొటీన్ కు బిన్నగా కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. అయితే ఇందులో కామెడీ కూడా కాస్త భిన్నంగా ఉండటం అందరూ పూర్తి స్థాయిల రిసీవ్ చేసుకోలేక పోవచ్చు. మరో వైపు సినిమా స్లోగా ఉండటం కూడా కొందరికి రుచించక పోవచ్చు.

    ఓవరాల్ గా...

    ఓవరాల్ గా...


    ఓవరాల్‌గా చెప్పాలంటే.... సినిమా కొత్తగా ఉంది. రివేంజ్ స్టోరీకి కామెడీ జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. కొత్త దనం కోరుకునే వారికి సినిమా నచ్చుతుంది.

    English summary
    Nenu Rowdy Ne is a telugu movie starring by vijay sethupathi, nayantara, nenu rowdy ne movie will release on 29th january 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X