twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బైబై .... (వెల్‌కమ్‌ ఒబామా రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5
    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు అంటే కమర్షియల్ గా ఉంటూనే ఏదో ఒక మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తూంటారని మనకి తెలుసు. అలాగే విభిన్నతకు మారు పేరు ఆయన సినిమాలు. ఇదే ఊహతో... ఆయన తాజా చిత్రం వెల్‌కమ్‌ ఒబామా కి వెళ్తే మాత్రం చాలా నిరాసపరుస్తుంది. వైవిధ్యం పేరుతో ఆయన ఎన్నుకున్న కథాంశం...డల్ సీన్స్ తో సీరియల్ తరహా స్క్రీన్ ప్లే తో సాగుతూ సహన పరీక్ష పెడుతూ ఆయన అభిమానులకు కూడా నచ్చటం కష్టమే అనిపిస్తుంది.

    మరాఠీ చిత్రం " మల అయి వహహిచయ్' కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం లో లూసీ(రేచల్) ఓ అమెరికన్. ఆమె తన బిడ్డకు ఎవరన్నా తల్లిగా మారి కనిస్తారేమో అని వెతుకుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఒక ఏజెంట్ ద్వారా యశోద(ఊర్మిళ కనిత్కర్)ని కలుస్తుంది. యశోదకి తన కూతురి వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం వుంటుంది. దాంతో ఆమె ఆ అమెరికన్ గర్భం మోయటానికి ఒప్పుకుంటుంది. కొద్ది కాలానికి యశోద కూతురు వైద్యపరంగా కాస్త మెరుగవుతుంది, అలాగే లూసీ తనని జాగ్రత్తగా చూసుకుంటూ వుంటుంది.

    కానీ పరిస్దితి బాగోకపోవటంతో యశోద హెల్ట్ దెబ్బతింటుంది. దానితో ఆమె కు పుట్టబోయే బిడ్డ ఏదైనా లోపంతో పుడుతుందనే అనుమానంతో తను కు ఆ బిడ్డ వద్దని, అబార్షన్ చేయించుకోమని చెబుతుంది. దానితో యశోద అబార్షన్ చేయించుకోనని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత ఆమె ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుంది. యశోద ఆ బిడ్డని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇదిలా కొనసాగుతుండగా తల్లి కొడుకులకు ఊహించని ఓ సంఘటన జరుగుతుంది. లూసీ తిరిగి వచ్చి తన కొడుకుని తనకు ఇవ్వమని అడుగుతుంది. ఈ సమయంలో కన్నతల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులకు మద్య జరిగే ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రం.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

     కాన్సెప్టు గొప్పదే కానీ...

    కాన్సెప్టు గొప్పదే కానీ...

    మానవతా విలువల గొప్పతనాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ సినిమా. సింగీతం శ్రీనివాసరావు సినిమాని నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకొంటుంది అంటూ ప్రచారం చేసిన ఈ చిత్రంలో కాన్సెప్టు బాగుంటుంది. ఇప్పటి సమాజం ఎదుర్కొంటున్న,ఎదుర్కోబోతున్న సమస్యని కళ్ళకు కట్టినట్లు చూపింది. అయితే ఆ క్రమంలో చాలా సీరియస్ డ్రామా నడవటం, అదీ బోర్ గా మారటంతో కష్టమనిపిస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఒక గర్బస్థ శిశువు చుట్టూ, ఎమోషనల్ గా సాగుతూ వుంటుంది.ఈ సినిమాని ఒక నవల ఆదరంగా నిర్మించడం జరిగింది.

    ఎత్తుగడ కీలకమే..

    ఎత్తుగడ కీలకమే..

    కృష్ణుడు(ఎస్తిబన్‌)ని భారతీయ సంప్రదాయాలతో పెంచాలని తల్లి లూసి(రేచల్‌) అనుకొంటుంది. దీని కోసం రాజమండ్రి దగ్గర పోరుమామిడిలో ఉంటున్న యశోద(వూర్మిళ)కి కృష్ణుడిని అప్పగిస్తుంది. కొన్నాళ్ల తర్వాత లూసి తన బిడ్డను తిరిగి అమెరికా తీసుకుపోవాలనుకుంటే యశోద చాలా బాధపడుతుంది. పర్యవసానంగా చోటు చేసుకునే పరిణామాలు, కృష్ణుడు, లూసి, యశోదల మనోవేదనకు చిత్రరూపమే ఈ సినిమా. రామలింగం (వీఎన్వీ ప్రసాద్‌)పాత్ర కూడా కీలకమే.

    రీమేకే గానీ..

    రీమేకే గానీ..

    నిజానికి ఈ చిత్రం మరాఠీలో చూసి సింగీతం గారు ముచ్చడపడి చేసారు. కానీ తెలుగు వాతావరణం అద్దే క్రమంలో క్రమంగా జీవం పోతూ వచ్చింది. అదే కాక ఈ చిత్రం రీమేక్ అని ఎక్కడా చెప్పలేదు. సినిమాని ఉన్నదున్నట్లు తీసినా మన నేటివిటీకి,ప్రేక్షకుల కనెక్టివిటీకి, అక్కడ వారికి తేడా ఉండటంతో వర్కవుట్ కాలేదు.

    స్క్రీన్ ప్లే పరంగా...

    స్క్రీన్ ప్లే పరంగా...

    మరాఠీ లో ఈ సినిమాని సమృద్ధి పోరీ దర్శకత్వం వహించడం జరిగింది. తెలుగు వెర్షన్ లో స్క్రీన్ ప్లే కి సాయం కూడా చేసాడు. అయితే ఇక్కడ మన సినిమాలు చాలా స్పీడ్ నేరేషన్ కి అలవాటు పడ్డాయనే విషయం మరిచారు. దాంతో స్లోగా సాగింది. ఎమోషన్స్ రిజిస్టర్ చేయటానికే చాలా సమయం తీసుకున్నారు.

    దర్శకుడుగా..

    దర్శకుడుగా..

    చాల రోజుల తరువాత వయస్సులో ఈ సినిమాని సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కానీ ఆయన మార్క్ ఎక్కడా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుని చేసినట్లుంది. ఆయన స్వయంగా తయారుచేసుకున్న కథలు ఉన్నట్లుగా ఈ సినిమా లేదు.

    నటీనటులు..

    నటీనటులు..

    అందరి నటులలో ఊర్మిళ కనిత్కర్ మాత్రం కాస్త బాగా నటించడం జరిగింది. మరాఠీలో ఆమె యశోద పేరుతో నటించడం జరిగింది. అదేవిదంగా తెలుగులో కూడా అదే పేరుతో నటించింది. ఆమెకు తెలుగు నుంచి కూడా ఆఫర్స్ రావచ్చు. ఇక రేచల్ ‘పోటుగాడు' సినిమాలో తన నటనతో ఇబ్బంది పెట్టిన ఆమె వెల్ కమ్ ఒబామ' సినిమాలో ఆమె ఈ సినిమాలోనూ తనకు నటన రాదని మరోసారి ప్రూవ్ చేసుకుంది.

    టైటిల్ ,కామెడీ ట్రాక్

    టైటిల్ ,కామెడీ ట్రాక్

    ‘వెల్ కమ్ ఒబామ' టైటిల్ కు సినిమాకు అస్సలు సంభంధమే లేదు. ‘కామెడీ' ట్రాక్ కూడా అస్సలు బాగోలేదు. లిరిక్ రైటర్స్ రచయితలు భువన చంద్ర, అనంత శ్రీరామ్ నటించారనే కానీ చాలా ఇబ్బంది పెడతారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    ఛాయా గ్రహణం అసలు బాగోలేదు. డి ఐ కూడా సరిగ్గా చేయలేదు. ఇక సంగీత పరంగా కూడా సినిమా కు ఎక్కడా ప్లస్ లేదు. నటి రోహిణి అందించిన డైలాగ్స్ ఫరవాలేదనిపిస్తాయి.

    ఎవరెవరు

    ఎవరెవరు

    సంస్థ: శాండల్‌వుడ్‌ మీడియా
    నటీనటులు: వూర్మిళ, ఎస్తిబన్‌, వీఎన్వీ ప్రసాద్‌ , రేచల్(యు.కె), ఊర్మిళ, సంజీవ్, నిరంజని తదితరులు
    సమర్పణ: భారతి
    కెమెరా: ఎస్.ఎస్.దర్శన్,
    రచనా సహకారం: రోహిణి,
    ఆర్ట్: వర్మ
    నిర్మాత: ఎస్. భారతీకృష్ణ,
    కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సింగితం శ్రీనివాసరావు.

    ఫైనల్ గా సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి ఇలాంటి సినిమాలు అసలు ఆశించము. కాబట్టి ఆదిత్య 999 లాంటి ప్రాజెక్టులు చేస్తేనే బాగుంటుంది. ఇక ఈ సినిమాకు దూరంగా ఉంటేనే బెస్ట్. ఇప్పటికే ఈ చిత్రం చూస్తే ఆయన గతంలో తీసిన చిత్రమో చూసి ఊరట పొందాలి.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Singeetham Srinivasa Rao is well-known critically-acclaimed director, who has won several Nandi and National awards for his works in the past. The title of his latest directorial venture - Welcome Obama and a few foreign characters featured in its promos have created lot of curiosity of the film goers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X