twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగటు 'యువత'(రివ్యూ)

    By Staff
    |

    సంస్థ: వర్త్‌వాచింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    తారాగణం:నిఖిల్,అక్ష,రణధీర్,సుభాష్,నరసింహ,మొనాలి చౌదరి,
    సాయాజీ షిండే,శ్రీనివాసరెడ్డి తదితరులు
    కెమెరా:జస్వంత్
    సంగీతం:మణిశర్మ
    ఫైట్స్:రామ్-లక్ష్మణ్
    పాటలు:కృష్ణ చైతన్య
    ఎడిటింగ్:మార్తాండ్ కె వెంకటేష్
    కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం:పరశురామ్(బుజ్జి)
    నిర్మాత:హరి తుమ్మల,ఉమాప్రకాష్
    రిలీజ్ డేట్:నవంబర్ ఏడు 2008

    'బొమ్మరిల్లు' భాస్కర్,పూరీ జగన్నాధ్ ల వద్ద శిష్యరికం చేసిన పరుశురాం(బుజ్జి) దర్శకత్వంలో హ్యాపీడేస్ ఫేం నికిల్ మాస్ హీరోగా చూపుతూ వచ్చిన చిత్రం 'యువత'. కథనే నమ్ముకుని చేసిన నిజాయితీ ప్రయత్నంలా కనపడే ఈ చిత్రం కొత్తగా లేకపోయినా రెగ్యులర్ గా వస్తున్న చెత్తగా అనిపించదు. ముఖ్యంగా మళ్ళీ కాలేజీ సీన్స్ చూడాలేమో అని భయపడుతూ ధియోటర్లోకి అడుగు పెట్టిన వారికి పెద్ద రిలీఫ్.

    అమెరికా వెళ్ళి సాప్ట్ వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవుదామనుకున్న అజయ్(రణధీర్), పోలీస్ అవుదామనుకుని సెక్యూరిటీ గార్డుగా లైఫ్ లీడ్ చేస్తున్న కిరణ్(నరసింహ),అసెస్టెంట్ డైరక్టర్ గా చేస్తున్న సుబ్బు(సుభాష్) హైదరాబాద్ లో తమ కలల్ని సాకారం చేసుకునేందుకు కృషి చేస్తూ కలిసి బ్రతుకుతూంటారు.అక్కడికి వీరబాబు(నికిల్) వచ్చిపడతాడు. కేశవరం లో ఉండే వీరబాబు తల్లి,తండ్రి ఉండరు.మేనమామతో తగువు పడి మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకేంటి అని వీరి వద్ద చేరతాడు. పనిలో పనిగా వరలక్ష్మి(అక్ష) అనే మెడికో తో ప్రేమలో పడతాడు. ఓ సారి ఆమెను గూండాలనుండి రక్షిస్తాడు. అయితే వాళ్ళు మళ్ళీ ఎటాక్ చేస్తే వీరబాబు కి సాయింగా వచ్చిన కాబోయే దర్శకుడు తీవ్రంగా గాయపడతాడు. హాస్పటిల్ లో చేరిస్తే ఐదు లక్షలు కట్టాలంటాడు. ఓ పెద్ద రౌడి(నర్శింగ్ యాదవ్) దగ్గర నుండి తీసుకొచ్చి ఇస్తారు. అయితే ఆ తర్వాత ఆ రౌడి డబ్బు కట్టమని ప్రెజర్ చేస్తే తప్పని స్ధితిలో కిరణ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బ్యాంకుని దోయాలని ప్లాన్ చేస్తారు. కిరణ్ బయిట కాపలా ఉంటాడు. అంతా ఫెరఫెక్ట్ గా అయిందనుకున్న సమయంలో ఓ ట్విస్ట్ పడుతుంది. అయితే అప్పటికే ఆ బ్యాంక్ దొంగతనం జరిగిపోయి ఉంటుంది. అంతే గాక పోలీసులు వచ్చి అజయ్ ని,వీరబాబు ని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఆ దొంగతనం చేసిందెవరు...కిరణ్ పాత్ర ఎంత...హీరో ఎలా బయిట పడ్డాడు అనేది క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్.

    నిఖిల్ హ్యాపీడేస్ తర్వాత ఈ చిత్రంలో మళ్ళీ బాగా చేసాడు. అయితే రవితేజ ని పదేపదే అనుకరిస్తున్న ఫీల్ తీసుకొచ్చాడు. ఇక అక్ష ఓకె గానీ హీరోకి అక్కలా ఉంది. షాయిజి షిండె ...సిమ్రాన్ ఫాన్ గా బాగా నవ్వించాడు. చివరలో అనసరంగా సిద్దార్ద,వినాయుకు ఫేమ్ కృష్ణుడు కనిపిస్తారు. ఇక మొదట్లో వచ్చే పూరీ వాయిస్ ఓవర్ బాగుంది.ఇక కొత్త దర్శకుడు పరుశురామ్ గ్రిప్పింగ్ గా కథనం రాసుకోవటం ప్లన్ అయింది. కెమెరా ఓకె.పాటలు మరింత బాగా తీయాల్సిన అవసరం ఉంది. ఇక డైలాగులు న్యాచురల్ గా బాగున్నాయి. ఎడిటింగ్...ప్రొడక్షన్ విలువలు సినిమాకు తగ్గట్లే అమరాయి. ఒక రకంగా ఈ టీమ్ లో సీనియర్ అయిన మణిశర్మే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. పాటలు ఒక్కటీ ఇంప్రెసివ్ గా లేదు. వరస చెత్త చిత్రాల మధ్య రావటం ఓ ఫ్లస్ అయితే బోర్ కొట్టకుండా కూర్చోపెట్టగలగడం మరో ఫ్లస్. ఆ రెండు చేసిన ఈ సినిమా ఓ సారి చూడచ్చు. టిక్కెట్ట్ గిట్టుబాటవుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X