twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయపడి పరారీలో హీరో శింబు

    By Srikanya
    |

    చెన్నై : యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ దర్శకత్వంలో నటుడు శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తాజాగా సేలంలో కలకలం రేపింది. ఈ విషయమై హీరో శింబు పరారీలో ఉన్నట్లు సమాచారం.

    చెన్నై మహిళలను కించపరిచే రీతిలో అసభ్య పదజాలంతో తమిళ సినీ నటుడు శింబు పాడిన బీప్ సాంగ్ వివాదం రాజు కుంది. మహిళా సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు రేస్ కోర్సు పోలీసులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేశారు. ఈ విషయం వెల్లడైనప్పటి నుంచి నటుడు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

    శింబు పాటపై తమిళ సినీ గేయరచయిత వైరముత్తు, సంగీత దర్శకుడు గంగై అమరన వ్యాఖ్యానిస్తూ అసభ్యపదజాలంతో ఉన్న పాటలను అనుమతించకూడదన్నారు.

    ఇదిలా ఉండగా మహిళలను కించపరిచే రీతిలో పాట పాడిన శింబు, అనిరుధ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘం, ప్రజాస్వామ్య యువత సంఘం తరపున సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాయం ఎదుట ఆందోళన చేపట్టారు.

     Actor Simbu Asked to Appear befor police

    ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను దగ్ధం చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    తర్వాత ఆందోళన కారులు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను చింపేసి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా పాటను రూపొందించిన వారిపై బెయిలుకు వీల్లేని కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

    వివాదం ఏంటి...

    నటుడు శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' సమస్యాత్మకంగా మారింది. ప్రస్తుతం ఈ పాట తమిళనాట మహిళాసంఘాల తీవ్ర నిరసనకు కారణమైంది. ‘కొలవెరి' కుర్రాడు అనిరుథ్‌ సంగీతంలో శింబు పాడిన ఓ పాట శుక్రవారం రాత్రి నుంచి వెబ్‌సైట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాటలో వచ్చే సాహిత్యం పూర్తిగా అమ్మాయిలకు వ్యతిరేకంగా, బూతుపదాలతో ఉండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ విషయమై ఓ మహిళాసంఘం ప్రతినిధులు శింబు, అనిరుథ్‌ కలసి ఉన్న ఫొటోలను చించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది తనపాటే అని శింబు నుంచి సమాధానం వచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే అనిరుథ్‌ కెనడాలో ఉండటంతో.. ఆయన అభిప్రాయం ఇంకా వ్యక్తం కాలేదు.

    English summary
    Police team from Coimbatore served summons to Simbu and Anirudh to appear before Coimbatore Commissioner on December 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X