twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లైట్ పై అంతా రజనీ బొమ్మలే, ఇలాంటిది ఇదే తొలిసారి (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రజనీకాంత్ తాజా చిత్రం కబాలి' ప్రతీ విషయంలోనూ తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోనే చూడాలనుకునే అభిమానుల కోసం ఆ చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ఓ ఫ్లైట్ ని ముస్తాబు చేసారు.

    'కబాలి' చూడ్డానికొచ్చేవారి కోసం బెంగళూరు నుంచి చెన్నైకి విమానాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఎయిర్‌ ఏసియా విమాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విమానం టికెట్‌తో పాటు 'కబాలి' టికెట్‌, ఆడియో సీడీ, భోజనం తదితర సౌకర్యాలు అందిస్తారట. ఈ ఆఫర్‌కు విశేష స్పందన వస్తోంది.

    మోహన్ బాబు సాయిం- అల్లు అరవింద్ మద్దతుతో , వరణ్ తేజ, నాని కలిసిమోహన్ బాబు సాయిం- అల్లు అరవింద్ మద్దతుతో , వరణ్ తేజ, నాని కలిసి

    రజనీకాంత్ నటించిన కబాలి సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తి బాగా పెరిగిన నేపథ్యంలో ఈ థీమ్‌తో 'ప్లై లైక్‌ ఎ సూపర్‌ స్టార్‌' ప్రమోషన్‌ ఆఫర్‌ను తెచ్చినట్టు ఎయిర్‌ ఆసియా ఇండియా సిఇఒ అమర్‌ అబ్రోల్‌ తెలిపారు. 'కబాలి'తో ఈ కంపెనీ ఇటీవలే టైఅప్‌ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

    దేశీయంగా కొన్ని గమ్యస్థానాలకు 786 రూపాయల (అన్ని పన్నులు కలిపి) ప్రారంభ ధరతో వన్‌వే ప్రయాణం చేసే విధంగా ఎయిర్‌ ఆసియా సరికొత్త ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద జూలై 3వ తేదీ వరకు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

    కబాలి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలుకబాలి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు

    కబాలి సినిమా కోసం బెంగళూరు నుంచి చెన్నైకు రిలీజ్ రోజు ఎయిర్ ఎసియా బయలుదేరనుంది. ఆ రోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి చెన్న‌ైకి ఫ్లైట్ ఏడు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది.

    స్లైడ్ షోలో ఫొటోలు చూడండి..

    విమాన టిక్కెట్‌తో పాటు...

    విమాన టిక్కెట్‌తో పాటు...

    క‌బాలి మూవీ టిక్కెట్, ఆడియో సీడీ, బ్రేక ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్... ఉంటాయి

    ఇవికాకయ....

    ఇవికాకయ....

    చెన్న‌ై విమానాశ్రయం నుంచి సినిమా థియేట‌ర్‌కు ర‌వాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. సినిమా కోసం ఇలా ప్రత్యేక విమానం తొలిసారి కావొచ్చు.

    ప్రమోషన్ ఆఫర్

    ప్రమోషన్ ఆఫర్

    అయితే ఇది ఎన్నో ట్రిప్ లు తిరగదు. కేవలం తమ దగ్గరకు వచ్చిన వారిలో లాటిరీ తీస్తారని తెలుస్తోంది.

    ఏజెడ్

    ఏజెడ్

    ‘కబాలి'లో వయసు పైబడిన మాఫియా డాన్‌గా సూట్‌లు, నెరిసిన గడ్డంతో రజనీ గెటప్‌ ఆకట్టుకుంటోంది. అను వర్ధన్‌ అనే అమ్మాయి రజనీకి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది.

    ట్రెండీగా

    ట్రెండీగా

    లండన్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌ నుంచి కాస్ట్యూమ్స్‌కు కావాల్సిన ముడి వస్త్రాలు కొనుగోలు చేశారట.

    లోకల్ స్టోర్స్ నుంచి

    లోకల్ స్టోర్స్ నుంచి

    మలేసియాలో జరిగే సన్నివేశాల కోసం అక్కడి ట్రెండ్స్‌ను ప్రతిబింబించేలా లోకల్‌ స్టోర్స్‌లో నుంచే కాస్ట్యూమ్స్‌ తెప్పించారట.

    కుతు డాన్స్

    కుతు డాన్స్

    ఈ చిత్రంలో రజనీ కుతు అనే తమిళ సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశం ఉందట. రజనీ స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు.

    యాప్

    యాప్

    ‘కబాలి' కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇందులో ‘కబాలి'కి సంబంధించిన చిత్రవిశేషాలు అందించారు.

    కీఛైన్స్

    కీఛైన్స్

    అమెజాన్‌ ద్వారా ‘కబాలి' థీమ్‌ కీచైన్లు, మైనపు బొమ్మలు అమ్మకానికి ఉంచడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

    మంచి రెస్పాన్స్

    మంచి రెస్పాన్స్

    పా రంజిత్‌ తెరకెక్కించిన ‘కబాలి' తెలుగు ఆడియో విడుదల హైదరాబాద్‌లో ఈనెల 26న జరగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది.

    జపాన్ లోనూ

    జపాన్ లోనూ

    రజనీ మానియా విదేశాలకూ పాకింది. గతంలో రజనీ చిత్రాలకు జపాన్‌ తదితర దేశాల్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ‘కబాలి' మరిన్ని దేశాల్లో సంచలనాలు చేయడానికి సిద్ధమవుతోంది.

    పదివేలు ధియేటర్స్

    పదివేలు ధియేటర్స్

    ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదలవుతోంది.

    మూడో భారతీయ చిత్రం

    మూడో భారతీయ చిత్రం

    చైనాలో ‘పీకే', ‘బాహుబలి' తర్వాత ఐదు వేల థియేటర్లలో విడుదలవుతన్న మూడో భారతీయ చిత్రమిది.

    తొలి తమిళ చిత్రం

    తొలి తమిళ చిత్రం

    చైనీస్‌, మలై, థాయ్‌, జపనీస్‌ భాషల్లోకి అనువాదమవుతున్న తొలి తమిళ చిత్రమిది.

    అంచనాలు

    అంచనాలు

    ‘బాషా' తర్వాత మళ్లీ రజనీ డాన్‌గా నటిస్తున్న ‘కబాలి'పై భారీ అంచనాలున్నాయి.

    ఆకాశాన్ని అంటిన బిజినెస్

    ఆకాశాన్ని అంటిన బిజినెస్

    అందుకు తగ్గట్లే ఆ సినిమా బిజినెస్‌ ఆకాశన్నంటుతోంది.

    బిజినెస్ జరిగింది

    బిజినెస్ జరిగింది

    ప్రి రిలీజ్‌లోనే రూ.200 కోట్లకుపైగా బిజినెస్‌ జరుగుతున్నట్లు సమాచారం.

    ఎగబడ్డారు

    ఎగబడ్డారు

    మలేసియాలో చిత్రీకరణ జరుగుతున్నపుడు రజనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారట

    లగ్జరీ కార్లు

    లగ్జరీ కార్లు

    మలేషియాలో షూటింగ్‌ కోసం 25 లగ్జరీ కార్లు అవసరం కాగా అక్కడి అభిమానులే వాటిని సమకూర్చారట.

    రోడ్ షో

    రోడ్ షో

    ఆడియో రిలీజ్‌ రోజున ఆ కార్ల యజమానులు ‘కబాలి' పోస్టర్లతో రోడ్‌షో చేశారు.

    ఎక్కువ భాగం

    ఎక్కువ భాగం

    ‘కబాలి' చిత్రీకరణ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.

    విదేశీయులే

    విదేశీయులే

    ఇందులో విలన్‌తో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల్లో విదేశీ నటులు నటించడం విశేషం.

    విలన్ గా..

    విలన్ గా..

    ప్రముఖ తైవాన్‌ నటుడు విన్‌స్టన్‌ చావొ ప్రతినాయకుడిగా నటించాడు

    విలన్ రైట్ హ్యాండ్

    విలన్ రైట్ హ్యాండ్

    విలన్ రైట్‌హ్యాండ్‌గా మలేసియన్‌ నటుడు రోసియమ్‌ నొర్‌ నటించారు.

    వాయిదా

    వాయిదా

    రజనీకాంత్‌ డాన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే కథానాయికగా నటించింది. వచ్చే నెల 15న విడుదలవుతందున్న ఈ చిత్రం వాయిదా పడుతుందని అంటున్నారు.

    English summary
    AirAsia India, the official airline partner for Rajinikanth-starrer Kabali, has devoted a special aircraft, bearing the images of the star, to the movie and the fans of the Tamil superstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X