twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరే స్టెప్స్ తో :అజిత్ 'వేదలం' సాంగ్ టీజర్ (వీడియో)

    By Srikanya
    |

    చెన్నై: తమిళ నటుడు అజిత్‌ కుమార్‌, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'వేదలం' . ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ అందుబాటులో లేకపోతే శ్రుతి కోసం అజిత్‌ ఫొటోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    'వేదలం' కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా అజిత్‌తో కలసి వర్క్ చేస్తుండటంతో అనిరుధ్ తెగ సంబరపడిపోతున్నాడట. అంతేకాదు అక్టోబర్ 16న తన పుట్టినరోజు సందర్భంగా అజిత్‌పై ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు అనిరుధ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఈ లోగా 'వేదలం' చిత్రంలో ఓ పాటను విడుదల చేసారు.

    ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

    Ajith's Vedalam - Aaluma Doluma Song Teaser

    అయితే ఈ గెటప్ చూసినవారు దాదాపు పదమూడేళ్ల క్రితం అజిత్ నటించిన రెడ్ సినిమాలోని గెటప్ ను పోలి ఉందంటున్నారు.... ఇటీవల అజిత్ చిత్రాలన్నీ తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగులో డబ్ కానుంది. గతంలో అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన వీరమ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నవంబర్-10న వస్తున్న వేదాలం.. ఆ అంచనాలను అందుకుని అజిత్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

    English summary
    Watch the song teaser of Aaluma Doluma from the movie Vedalam. , Ajith fans are geared up to celebrate this year's Diwali with a bang. As of now, it is said that the film might release on November 10th but the exact release date is still awaited as it remains to be confirmed officially by the makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X