twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం తలనొప్పి: రజనీ 'లింగ' పై ఇంకో కేసు

    By Srikanya
    |

    చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'లింగ' చిత్ర కథ తనదేనని ఇంతకు ముందు ఒక కేసు నమోదు అయ్యి,వివాదం,వివరణ జరిగి రెండు రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి తలనొప్పి ఎదురుకానుంది. తమిళనాడు వడపళనికి చెందిన శక్తివేల్‌ చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో లింగ కథ నాదేనంటూ వ్యాజ్యం దాఖలు చేశారు.

    ముల్లె పెరియారు జలాశయాన్ని నిర్మించిన పెన్నీక్విక్‌ తదితర నేపథ్యంలో 'ఉయిర్‌ అనై' పేరిట ఓ కథను రాశానని, 2012లోనే తమిళనాడు నిర్మాతల గిల్డ్‌లో ఆ కథను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కథను పలువురు నిర్మాతలకు కూడా చెప్పానని, అది సెట్స్‌పైకి వెళ్లలేదని అన్నారు. ఇప్పుడు ఆ కథను తీసుకుని దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ తెరకెక్కించారని ఆరోపించారు.

    చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారని తెలిపారు. విడుదలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 12 అడిషినల్‌ సిటీ సివిల్‌ కోర్టు దీన్ని విచారించి.. కథ విషయమై 9వ తేదీన వివరణ ఇవ్వాలని దర్శకుడు, నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.

    Another case of plagiarism filed against Rajinikant-starrer 'Linga'

    సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ - కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ'. ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. లింగ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచి సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం కూడా సన్నాహలు చేస్తోంది.

    ఇప్పటివరకూ తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్ర టీం ముందుగా తెలుగులో కూడా భారీగా ప్రమోట్ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. డిసెంబర్ 7న ఈ చిత్ర టీం హైదరబాద్ వచ్చి లింగ సినిమాని ప్రమోట్ చేయనున్నారు. దాదాపు ఈ చిత్ర టీం అంతా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    Another case of plagiarism was filed against Tamil superstar Rajinikant-starrer film Linga in a city civil court on Friday, two days after a similar case was dismissed by the Madras High Court. In his petition, Sakthivel claimed that he had written the storyline for a film Uyir Anai tracing the life of Pennyquick, the British engineer behind the construction of Mullaiperiyar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X