twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరియో నుంచో, ఇరాన్ నుంచో కాపీ కొట్టలేదు

    By Srikanya
    |

    చెన్నై : సినిమా విడుదలైన గంటలో సోషల్‌ మీడియాల్లో ఎవరికివారు రివ్యూలు రాస్తున్నారు. అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ నా సినిమాలో 'ఈ సీన్‌ను కొరియన్‌ సినిమాలో చూశా.. ఇరాన్‌ సినిమాలో చూశాన'నే మాటకు తావుండదు. ఇందులో ప్రతి ఫ్రేమును నా స్వశక్తితో రూపొందించిందే అంటున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన తన తాజా చిత్రం జైహింద్ 2 విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    ఎవర్‌గ్రీన్‌ ఎనర్జీతో ప్రస్తుతం స్వీయ దర్శకనిర్మాణంలో 'జైహింద్‌ 2'ను తెరకెక్కిస్తున్నారు. 'జైహింద్‌' విడుదలై 20 ఏళ్లు దాటింది. అయినా.. సినీజనాలు ఆ సినిమాను ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారు. అందుకు కొనసాగింపుగా ఓ సినిమా వస్తోందంటే.. అంచనాలు వేసుకుంటున్నారు. ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది. తొలి నుంచీ తనకు నచ్చినట్టుగా కెరీర్‌ను రూపుదిద్దుకుని.బిల్డ్ చేసుకుంటూ ఇప్పటికీ హీరోగా, విలన్‌గా.. హవా చాటుకుంటున్నారు యాక్షన్‌కింగ్‌ అర్జున్‌.

    Arjun about his latest Jai Hind 2

    తన తాజా చిత్రం గురించి చెప్తూ....ఒక్కమాటలో చెప్పాలంటే.. 'నేటి విద్యా ప్రమాణాల పరిస్థితి.. ఎలా ఉంటే బాగుంటుంది' అనే విషయానికే పెద్దపీట వేశాం. పాఠశాల ఫీజు కట్టలేకుండా.. అందుకోసం ఎంతో శ్రమించే తల్లిదండ్రుల సాధకబాధకాలు ఇందులో కనిపిస్తాయి. పాఠశాల ఫీజు కట్టలేదని అవమానానికి గురైన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త విని గుండె తరుక్కుపోయింది. మనం ఎటుపోతున్నామో అర్థం కావట్లేదు. అందుకే ఎంతో ఆకలిగా, కసిమీద ఉన్నవారి కోసమే ఈ సినిమాను రూపొందించా అన్నారు.

    అలాగే జైహింద్‌లో గౌండర్‌మణి పెద్ద పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం ఆయన్ను పిలిచా. కానీ అప్పుడాయన రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నందువల్ల రాలేకపోయారు. ఆయనకు సమానంగా నటుడు బ్రహ్మానందం ఇందులో హాస్యం పండించారు అన్నారు. ఇప్పుడు హీరోల్లో సూర్యతోపాటు చాలా మంది హీరోలు చాలా ఫిట్‌నెస్‌గా ఉన్నారు. వీరిలో భరత్‌ బ్రహ్మాండమైన ఫిజిక్‌తో ఉన్నారనిపిస్తోంది. '555' సినిమాలో ఆ శరీరాకృతిని తీసుకొచ్చేందుకు భరత్‌ చాలా శ్రమించారు.

    నా కుమార్తె ఐశ్వర్య కెరీర్‌ గురించి చెప్పాలంటే... ఐశ్వర్య మంచి ప్రతిభావంతురాలు. ఆమె ప్లస్‌, మైనస్‌లు తెలిసిన నేనే.. ఆమె హీరోయిన్‌గా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా. యాక్షన్‌, ప్రేమ కథతో తెలుగు, తమిళంలో ఆ సినిమాను విడుదల చేయనున్నా అన్నారు.

    English summary
    Jai Hind 2 is an upcoming multilingual Indian action drama film produced and directed by Arjun Sarja. It is a sequel to the Tamil film Jai Hind. It will be released in Kannada under the title Abhimanyu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X