twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' : క్షమాపణ చెప్పి,తొలిగిస్తానన్న డైలాగ్ రైటర్

    By Srikanya
    |

    చెన్నై : బాహుబలి తమిళ వెర్షన్ లో వాడిన కొన్ని పదాలు దళితలను కించపరిచేలా ఉన్నాయని వివాదం చెలిరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు తమిళనాడులోని మధురై వద్ద పెట్రో బాంబు సైతం ఈ విషయమై పేలింది. దళితులలో ఓ వర్గాన్ని కించ పరిచేలాగ ఉన్న ‘pagadai' అనే పదాన్ని ఉపసంహించుకోవాలంటూ కోరారు. సినిమాలోని ఓ కీలకమైన సన్నివేసంలో ఓ డైలాగులో ఈ పదం వస్తోంది.

    ఈ సంఘటన జరగటంతో ...వెంటనే తమిళ మాటల రచయిత మదన్ కార్కే ...క్షమాపణను అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసారు. "నేను మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నా...నేను రాసిన ఓ డైలాగులోని ఓ పదం కొందరు మనో భావాలను దెబ్బ తీసిందని, ఆ పదాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఆ పదం నేను కావాలని రాసింది కాదు. అలాగే అది ఓ కమ్యూనిటికి చెందిన పదమని కూడా తెలియదు. ఆ పదం ఉన్న డైలాగుని తొలిగిస్తున్నాం..ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అన్నారు.

    చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...

    Bahubali dialogue writer Madan Karky issues an apology

    ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
    రూ.100కోట్లు.. 200.. 300.. కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రూ.355కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకేముంది రూ.500కోట్ల కలెక్షన్‌ సినిమాలో జాబితాలో చేరేందుకు దూసుకెళ్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అంతేకాదు బాలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్‌ సినిమా 'భజరంగీ భాయీజాన్‌' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.

    ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్‌ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.

    బాలీవుడ్‌లో షారూక్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్‌ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.

    English summary
    ‘Bahubali’ tamil dialogue writer said... “I came to know through media sources that a word present in the dialogue of the movie 'Bahubali' hurt the sentiments of a few and that, this has led them to acts of violence. I'm letting you know that the word will be removed from the movie soon. I'm sorry if anyone has been hurt.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X