twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనెక్కడికి పారిపోలేదు, జైలు కెళ్లడానికైనా సిద్ధమే: శింబు

    By Bojja Kumar
    |

    చెన్నై: శింబు స్వయంగా రాసి, పాడిన ‘బీప్ సాంగ్' తమిళనాడులో పెద్ద దుమారమే రేపింది. మహిళలను నీచంగా అభివర్ణిస్తూ కించ పరిచే పదజాలం ఉండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యాయి. శింబును అరెస్టు చేసేందుకు తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతని ఆచూకీ తెలియక పోవడంతో.... అందరూ శింబు అరెస్టుకు భయపడి పారిపోయాడనే ప్రచారం మొదలైంది. అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొందడానికే శింబు అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు.

    ఈ నేపథ్యంలో శింబు స్పందించారు. తాను ఎక్కడికీ పారి పోలేదని, అజ్ఞాతంలోకి వెళ్లానని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్నారు. తాను తమిళనాడులోనే ఉన్నట్లు ప్రకటించాడు. తాను ఏ తప్పూ చేయలేదు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. చట్టపరంగా జైలుకెళ్లడానికి కూడా సిద్దమే అన్నారు. ఈ నెల 19న కోవై పోలీస్ స్టేషన్లో శింబు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

    'Beep Song' issue: Actor Simbu ready to face Arrest

    బీప్ సాంగ్ కేసు పూర్తి వివరాలు...
    శింబు స్వయంగా రాసి పాడిన ‘బీప్ సాంగ్'పై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. వారికి వ్యతిరేకంగ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఫొటోలను దగ్ధం చేసి, ఆ పటాలను రోడ్డుపై పారవేసి చెప్పులతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేసారు. కోయంబత్తూరు రేస్‌కోర్సు పోలీసుస్టేషన్‌లో అక్కడి మహిళా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ సెల్వరాజ్‌ ఇతర పోలీసులు చెన్నై నగరానికి వచ్చారు. శింబుతో పాటు ఆ పాటను కంపోజ్ చేసినట్లు అనుమానిస్తున్న అనిరుధ్‌లను అరెస్టు చేసేందుకు వీరు కొద్ది రోజులపాటు నగరంలోనే బసచేయాలని నిర్ణయించారు. మరో వైపు శింబు, అనిరుధ్ లపై తిరుతురైపూండి పోలీసుస్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. అరెస్టు చేసేందుకు శింబు ఇంటికి వెళ్లినపోలీసులు అతను కనిపించకపోవటంతో అతని ఇంటి తలుపుకు సమన్లు అతికించారు.

    అనిరుధ్‌ ఆ వివాదాస్పద పాటకు తాను సంగీతం సమ కూర్చలేదని ప్రకటించారు. ప్రస్తుతం అనిరుధ్‌ ఓ మ్యూజిక్ ఫ్రోగ్రాం కోసం కెనడా వెళ్లారు. ఈ విషయమై కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్‌ అమల్‌రాజ్‌ మాట్లా డుతూ ఆ పాట రెండేళ్లకు ముందు శింబు పాడగా, రికార్డ్‌ చేసినట్టు చెబుతున్నారని, ఆ పాటకు తాను సంగీతం సమకూర్చలేదని అనిరుధ్‌ తెలిపారని, అయినా ఆ ఇరువురిని అరెస్టు చేసి విచారణ జరిపితే తమకు వాస్తవాలు తెలుస్తాయని, ఇక ఆ పాటను వాట్సప్‌లో ఎవరు ప్రసారం చేశారనే విష యంపై కూడా తాము దర్యాప్తు జరుపు తున్నామని తెలిపారు.

    జనం మెచ్చేలా మంచి భావాలున్న పాటలు కరవవుతున్న ప్రస్తుత సమయంలో ఐటమ్‌ సాంగ్‌లే ఎక్కువవుతున్నాయని, శింబు బీప్‌ సాంగ్‌ను తాను వినలేదని, ఆ పాట మహిళా లోకాన్ని కించపరిచేలా ఉందని చెబుతున్నారని, పాటలలో పదాలు అసభ్యం గా హద్దులు దాటితే విపరీత పరిమాణాలు ఎదురవుతాయని వైరముత్తు వ్యాఖ్యానించారు. అసభ్య పదజాలంతో ఉన్న బీప్‌ సాంగ్‌ను జనంలోకి అనుమతించకూడదని ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ అన్నారు.

    Read more about: simbu శింబు
    English summary
    It is known that the ‘Beep Song’ of Simbhu stirred a huge controversy for the use of cuss words undermining females. Kovai Police reached Chennai the other day with an arrest warrant against Simbhu but couldn’t trace him. There were reports that the actor has been absconding to evade arrest and he is trying for a anticipatory bail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X