twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాని బ్యాన్ చేయండంటూ, బ్రాహ్మణుల పిటీషన్

    By Srikanya
    |

    చెన్నై: హిందువుల మనోభావాలు గాయపరిచేలా సన్నివేశాలు చోటుచేసుకున్న 'పిచ్చైక్కారన్‌' సినిమాను నిషేధించాలని తమిళనాడు అందనర్‌ మున్నేట్ర సంఘం డిమాండ్‌ చేసింది. అంతేకాదు చెన్నైలోని బ్రాహ్మణుల అశోశియేషన్ సైతం చెన్నై పోలీస్ కమీషనర్ కు పిటీషన్ అందించారు.

    చిత్రంలో... 'పిచ్చైక్కారన్‌' చిత్రంలో హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా గాయత్రీ మంత్రాన్ని వాడుకున్నారని, ఆలయం బయట ఉండేవారు బిచ్చగాళ్లు, ఆలయంలో ఉండేవారూ బిచ్చగాళ్లు అనే విధంగా సంభాషణలు, సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు.

    హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆ వినతిపత్రంలో కోరారు. నగర పోలీసుకమిషనరు కార్యాలయంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి గురు విజయ్‌శర్మ అధ్యక్షతన పదిమంది నిర్వాహకులు ఓ వినతిపత్రం అందించారు.

    Brahmins against 'Pichaikaran', seek ban on movie

    పిచ్చైక్కారన్ చిత్రం ఏకంగా వినోదపు పన్ను మినహాయింపు అర్హతను పొందడం విశేషం అనే చెప్పాలి. సాధారణంగా మంచి సందేశంతో కూడిన అతి కొద్ది చిత్రాలకే ప్రభుత్వం వినోదపు పన్నును రద్దు చేస్తుంది.అలాంటిది కమర్షియల్ అంశాలతో కూడిన పిచ్చైక్కారన్ చిత్రం ఈ కేటగిరీలో చేరడం చెప్పకోదగ్గ విషయం.

    సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోనీ హీరోగా నటించి, సంగీతాన్ని అందించి తన విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. డిష్యుం చిత్రంతో విజయ్‌ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన శశి ఈ చిత్రానికి దర్శకుడు.

    English summary
    Pichaikaran Movie should be banned, the Brahmins Association has Petitioned the Chennai Police Commissioner."There are scenes which insult priests in temples as beggars," they said and added that the film has hurt their sentiments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X