twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ క్షమాపణ చెప్పాలంటూ కేబుల్ ఆపరేటర్స్ డిమాండ్

    By Srikanya
    |

    చెన్నై: తమిళ స్టార్ హీరో ధనుష్ తమకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తమిళనాడు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అశోసియేషన్ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం టాటా స్కై డిటిహెచ్ యాడ్. ఆ యాడ్ ని ధనుష్ చేయటమే.

    టాటా స్కై యాడ్ లో ధనుష్... కొన్ని ఫాల్స్ ఛానెల్స్ చూపించి కేబుల్ ఆపరేటర్స్ డబ్బుని గుంజుతున్నారనే అర్దం వచ్చేలా చెప్తారు. దాంతో కేబుల్ ఆపరేటర్స్ జనరల్ సెక్రటరీ జి. దామోదరన్ మీడియాతో మాట్లాడుతూ...మేము పూర్తిగా ధనుష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన మమ్మలని ఇన్సల్ట్ చేసారు. క్షమాపణ చెప్పి యాడ్ ని వెనక్కి తీసుకోవాలి ." అన్నారు.

    Cable operators demand an apology from Dhanush

    మరో ప్రక్క ఈ లోగా ధనుష్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆపరేటర్స్ కు క్షమాపణ చెప్పాలి లేదా ఆయన ఇంటి, ఆఫీసులు వద్ద నిరసన దీక్షలు,ధర్నాలు జరుగుతాయని హెచ్చరించారు.

    అయితే ఈ విషయమై ధనుష్ మాత్రం ఏమీ స్పందించలేదు. ఆయన అభిమానులు మాత్రం ధనుష్ కేవలం టాటా యాడ్ డైరక్టర్ ఏమి చెప్పమన్నారో అదే చెప్పారు...అందులో తప్పేముంది అని వెనకేసుకు వస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ముగుస్తుందో చూడాలి.

    English summary
    Tamil Nadu Cable TV Operators Welfare Association has lashed out at Dhanush for allegedly demeaning them in Tata Sky DTH advertisement. In the ad, Dhanush used to say that cable operators use to suck money by showing some false channels. Regarding this, G.Dhamodharan, state general secretary of the association, said, “We strongly condemn popular actor Dhanush for insulting cable operators in an advertisement for a DTH company.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X